E-Paper
Advertisement

నిస్సాన్ టెక్టన్, బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు స్టార్ట్.. కస్టమర్లకు తాళాలు అందజేత!

నిస్సాన్ టెక్టన్, బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు స్టార్ట్.. కస్టమర్లకు తాళాలు అందజేత!
Advertisement

Nissan Tecton-New Maruti Brezza Deliveries Begin: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ఇటీవల విడుదలైన నిస్సాన్ టెక్టన్, మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీల డెలివరీలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బుక్ చేసుకున్న వినియోగదారులకు కంపెనీలు వెహికల్స్ ను అందిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫస్ట్ డెలివరీలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

 నిస్సాన్ టెక్టన్ గురించి..

నిస్సాన్ టెక్టన్ ధరలు రూ.10.49 లక్షల నుంచి రూ.18.59 లక్షల (ఎక్స్‌ షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. మొదటి ఆప్షన్‌ గా 1.0 లీటర్, 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండగా, ఇది 99 bhp పవర్, 166 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. రెండో ఆప్షన్‌ గా 1.3 లీటర్, 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 160 bhp పవర్, 280 Nm టార్క్‌ ను అందిస్తుంది.

Advertisement

1.0 లీటర్ ఇంజిన్‌కు 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్ అందించగా, 1.3 లీటర్ ఇంజిన్‌కు 6 స్పీడ్ మాన్యువల్‌తో పాటు 6 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపిక కూడా ఉంది. మైలేజ్ విషయానికి వస్తే 1.0 లీటర్ వెర్షన్ లీటర్‌కు 19.5 కిలోమీటర్లు, 1.3 లీటర్ మాన్యువల్ వెర్షన్ 17.8 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వెర్షన్ 18.5 కిలోమీటర్ల వరకు ఫ్యూయెల్ ఎఫిషియెన్సీని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

భద్రత పరంగా కూడా టెక్టన్ సత్తా చాటింది. BNCAP క్రాష్ టెస్టుల్లో ఈ ఎస్‌యూవీకి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. పెద్దలు, చిన్నారుల భద్రత విభాగాల్లోనూ మంచి స్కోర్లు నమోదు చేసింది.

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ గురించి..

Advertisement

ఇక కొత్త మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ ధర రూ.7.40 లక్షల నుంచి రూ.13.70 లక్షల (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంది. ఈ ఎస్‌యూవీ LXi, VXi, ZXi, ZXi+ అనే నాలుగు ట్రిమ్‌లలో మొత్తం 13 వేరియంట్లతో అందుబాటులోకి వచ్చింది. కొత్త బ్రెజ్జాలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కూడా అందించారు. 1.5 లీటర్ ఇంజిన్‌కు CNG ఆప్షన్ కూడా ఉంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌ గా ఉండగా, 1.5 లీటర్ ఇంజిన్‌కు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ ఎంపిక కూడా లభిస్తుంది.  మైలేజ్ పరంగా 1.0 లీటర్ టర్బో వెర్షన్ 20.47 kmpl, 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ 21.09 kmpl వరకు ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఆటోమేటిక్ వెర్షన్ 20.17 kmpl మైలేజ్ అందిస్తే, CNG వేరియంట్ 26.90 కిలో మీటర్ల వరకు ఇస్తుంది.

భద్రత విషయంలో బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కూడా 5 స్టార్ క్రాష్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. దీంతో ఈ రెండు కొత్త ఎస్‌యూవీలు పనితీరు, భద్రత, ఫీచర్ల పరంగా వినియోగదారుల నుంచి మంచి ఆదరణ పొందే అవకాశం కనిపిస్తోంది.

Read Also: టాటా నుంచి రెండు సూపర్ ఈవీలు.. సఫారీ, అవిన్యా రిలీజ్ ఎప్పుడంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×