E-Paper
Advertisement

Bajaj Pulsar Classic Launch: వచ్చేస్తోంది నెక్స్ట్ జనరేషన్ పల్సర్, లాంచింగ్ ఎప్పుడంటే?

Bajaj Pulsar Classic Launch: వచ్చేస్తోంది నెక్స్ట్ జనరేషన్ పల్సర్, లాంచింగ్ ఎప్పుడంటే?
Advertisement

ఇండియన్ మోటార్ సైకిల్ మార్కెట్లో రెండున్నర దశాబ్దాలుగా కుర్రాళ్ల డ్రీమ్ బైక్ గా కోనసాగుతోంది బజాజ్ పల్సర్. ఇప్పటి వరకు చిన్న చిన్న అప్ డేట్ తో వచ్చిన పల్సర్.. ఇప్పుడు మేజర్ అప్ గ్రేడ్ పొందబోతోంది. ఇప్పటికే ఈ బైక్ క్లాసిక్, N,  NS/RS విభాగాలుగా విభజించబడినప్పటికీ, క్లాసిక్ మోడల్స్ ఇప్పటిక పెద్ద సంఖ్యలో అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు బజాజ్ పల్సర్ మరిన్ని అప్ డేట్స్ తో మార్కెట్లోకి అడుగు పెట్టే ప్రయత్నం చేస్తోంది. పలసర్ 125 ఇకపై పల్సర్ 150గా మారబోతోంది. పల్సర్ క్లాసిక్ పేరుతో పరిచయం కాబోతోంది.

కొత్త బజాజ్ పల్సర్ క్లాసిక్ ఎలా ఉండబోతోంది?

2026 సెకెండాఫ్ లో మరిన్ని అప్ డేట్స్ తో ఈ బైక్ రానుంది.  ప్రస్తుత క్లాసిక్ పల్సర్ బైక్స్ ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌ లతో పాత డబుల్ క్రెడిల్ ఫ్రేమ్‌ తో వస్తున్నాయి. కొత్త పల్సర్ N బైక్‌లలో కనిపించేలా కొత్త మోడల్‌లు మోనోషాక్‌తో మరింత లేటెస్ట్ సెటప్ కు మారే అవకాశం ఉంటుంది. కొత్త N పల్సర్‌లు రైడ్,  హ్యాండ్లింగ్ మధ్య మంచి సమతుల్యతను కలిగి ఉంటుంది. కొత్త ఛాసిస్‌ తో  పల్సర్ క్లాసిక్‌ ఇంజిన్‌లో కూడా పెద్ద మార్పులు కనిపించే అవకాశం ఉంది. కొత్త బైక్‌లు 125cc నుంచి 150ccకి పెరుగుతాయని భావిస్తున్నారు.

కొత్త బజాజ్ పల్సర్ క్లాసిక్ డిజైన్

Advertisement

కొత్త బైక్స్ మాకో డిజైన్ థీమ్‌ తో వస్తాయని భావిస్తున్నారు.  NS, N మోడళ్లను బట్టి చూస్తే, పెద్ద ప్యూయెల్ ట్యాంక్ ను తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  సహజంగానే, బైక్‌లలో LED లైటింగ్, డిజిటల్ డిస్‌ప్లేలు, బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

కొత్త బజాజ్ పల్సర్ ధర ఎంత?లాంచ్ ఎప్పుడు?

కొత్త బజాజ్ పల్సర్ బైక్ 2026 సెకెండాఫ్ లో వచ్చే అవకాశం ఉంటుంది. పల్సర్ 150, పల్సర్ 220 ఇటీవల LED బ్లింకర్లు, గ్రాఫిక్స్ లాంటి చిన్న అప్ డేట్స్ తో మార్పులు చేసినప్పటికీ, 2026 తరువాత మరిన్ని మార్పులు రానున్నట్లు తెలుస్తోంది. నెక్ట్స్ జనరేషన్ క్లాసిక్ పల్సర్లు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి సిద్ధంగా ఉంటాయని భావిస్తున్నారు. పండుగ సీజన్ అమ్మకాల్లో ఈ బైక్స్ సత్తా చాటేలా కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ధర విషయానికి వస్తే, కొత్త పల్సర్ 125 ఎక్స్ షోరూమ్ ధర దాదాపు రూ. 80,000 నుంచి రూ. 90,000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్త పల్సర్ 150 రూ. 1.05 లక్షల నుంచి రూ. 1.15 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. మొత్తంగా రెండున్నర సంవత్సరాల తర్వాత బజాజ్ పల్సర్ తన స్టైల్ ను పూర్తిగా మార్చుకునే అవకాశం కనిపిస్తుంది. కొత్త బైక్స్ ఎలా ఉండబోతున్నాయనే విషయం త్వరలోనే తెలియనుంది. ప్రస్తుత బైక్స్ తో పోల్చితే మరింత ఆకట్టుకునేలా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Read Also: ఇక ఈవీ కార్లకు ఛార్జింగ్ పెట్టాల్సిన పనిలేదు, కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన హ్యుందాయ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×