E-Paper
Advertisement

మారుతి ఈకో స్టార్ ఎడిషన్ వచ్చేసింది.. కొత్త లుక్‌ అదిరింది భయ్యా!

మారుతి ఈకో స్టార్ ఎడిషన్ వచ్చేసింది.. కొత్త లుక్‌ అదిరింది భయ్యా!
Advertisement

Maruti Suzuki Eeco Star Edition Launched: మారుతి సుజికి ఈకో స్టార్ ఎడిషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా అదిరిపోయే యాక్సెసరీ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక ప్యాకేజీ ధర రూ. 19,999గా కంపెనీ నిర్ణయించింది. ముందుగా ఈ కిట్ ధర ఎక్కువగా ఉండగా, ఇప్పుడు కంపెనీ దానిని తగ్గించి మరింత అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మొత్తాన్ని వెహికల్ అసలు ఎక్స్‌ షోరూమ్ ధరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. డీలర్‌షిప్‌ల ద్వారా ఈ యాక్సెసరీలను సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఈకో 5-సీటర్ AC, 5-సీటర్ AC CNG వేరియంట్లకు అందిస్తున్నారు.

స్టార్ ఎడిషన్ లో 18 కొత్త యాక్సెసరీలు

ఈ స్టార్ ఎడిషన్ ద్వారా ఈకోకు బయట, లోపల కలిపి మొత్తం 18 కొత్త యాక్సెసరీలను జోడించారు. బయట భాగంలో రియర్ స్పాయిలర్, ఫాగ్ ల్యాంప్స్, వీల్ కవర్లు, డోర్ వైజర్లు, మడ్ ఫ్లాప్స్, క్రోమ్ బ్యాడ్జింగ్ ఉన్నాయి. అలాగే మెటాలిక్ గ్లిస్టనింగ్ గ్రే, మెటాలిక్ బ్రిస్క్ బ్లూ రంగుల్లో బాడీ కలర్ బంపర్లు కూడా అందిస్తున్నారు. ఇవి వాహనానికి ప్రీమియం లుక్ తీసుకొస్తాయి.

ఇంటీరియర్ లో కీలక మార్పులు

Advertisement

ఇంటీరియర్‌లో కూడా పలు మార్పులు చేశారు. కొత్త స్టైలింగ్ కిట్‌ తో పాటు సరికొత్త సీట్ కవర్లను అందించారు. గతంతో పోల్చితే క్యాబిన్ మరింత ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు, ప్రయాణికులకు మెరుగైన అనుభూతి కలగనుంది. ఈకో ఇప్పుడు కొంచెం స్టైలిష్ టచ్‌ తో ఆకట్టుకుంటుంది.

అధునాతన భద్రతా ఫీచర్లు

ఫీచర్ల పరంగా కూడా ఈకోలో అవసరమైన భద్రతా సదుపాయాలు ఉన్నాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABSతో పాటు EBD, ESP, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ముందు సీటు బెల్ట్ రిమైండర్లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.  మాన్యువల్ AC, డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్, రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు, డోమ్ ల్యాంప్, స్లైడింగ్ డోర్లు, 12V ఛార్జింగ్ సాకెట్ లాంటి ఉపయోగకరమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఈకో ఇంజిన్ గురించి..

Advertisement

ఇంజిన్ విషయానికి వస్తే, ఈకోలో 1.2 లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది పెట్రోల్ మోడ్‌లో 80 bhp పవర్, 104.4 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే సీఎన్‌జీపై నడిపితే పవర్ 71 bhpకు, టార్క్ 95 Nmకు తగ్గుతుంది. ఈ వాహనం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ తో మాత్రమే లభిస్తుంది. అలాగే E20 ఇంధనానికి కూడా అనుకూలంగా రూపొందించారు. ఈకో  కుటుంబ అవసరాలతో పాటు వ్యాపార అవసరాలకు సరిపోయే ప్రాక్టికల్ వ్యాన్‌గా కొనసాగుతోంది. ఇప్పుడు స్టార్ ఎడిషన్ ప్యాకేజీ ద్వారా కొత్త లుక్, మంచి స్టైల్ తో కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Read Also: 1200 కి.మీ రేంజ్.. 3.5 లక్షలు.. భారత మార్కెట్లోకి సూపర్ ఈవీ వచ్చేస్తోంది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×