E-Paper
Advertisement

Xiaomi SU7 2026: ఒకే ఛార్జ్ తో 902 కి.మీ రేంజ్, వామ్మో ఇదేం టెక్నాలజీ భయ్యా!

Xiaomi SU7 2026: ఒకే ఛార్జ్ తో 902 కి.మీ రేంజ్, వామ్మో ఇదేం టెక్నాలజీ భయ్యా!
Advertisement

New-Gen Xiaomi SU7 Revealed: చైనీస్ ఆటో మోబైల్ దిగ్గజం షియోమీ ఆల్ ఎలక్ట్రిక్ సెడాన్ SU7 అప్‌ డేటెడ్ వెర్షన్‌ ను విడుదల చేసింది. ఈ మోడల్ డిజైన్, క్యాబిన్ ఎక్స్ పీరియెన్స్, పనితీరు, భద్రతకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ తో స్టాండర్డ్, ప్రో, మాక్స్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

షియోమీ కొత్త SU7 డిజైన్  

కొత్త SU7.. 5 మీటర్ల పొడవు, 3 మీటర్ల వీల్‌ బేస్‌ ను అలాగే కొనసాగిస్తుంది. చిన్న చిన్న డిజైన్ మెరుగుదలలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటర్‌ డ్రాప్ హెడ్‌ లైట్లు, హాలో స్టైల్ టెయిల్ ల్యాంప్స్ లాంటి సిగ్నేచర్ ఎలిమెంట్స్ అలాగే కొనసాగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ రాడార్‌ తో కూడిన ఫ్రంట్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్స్, తొమ్మిది కలర్స్ తో అందుబాటులోకి వచ్చింది. ప్రీమియం రూపాన్ని కొనసాగిస్తూనే, మరింత పర్సనలైజేషన్ అందించడం మీద దృష్టి సారించినట్లు అర్థం అవుతుంది.

షియోమీ కొత్త SU7 క్యాబిన్, సౌకర్యాలు  

Advertisement

షియోమీ కొత్త SU7 లోపల అప్‌ గ్రేడ్ చేసిన మెటీరియల్స్, లే అవుట్ మార్పులతో క్యాబిన్‌ను పూర్తిగా రీడిజైన్ చేశారు. యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు, సీట్ అడ్జస్టబిలిటీ లాంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా అందించబడ్డాయి. మెరుగైన కుషనింగ్, రిక్లైన్ యాంగిల్స్‌ తో వెనుక సీటు సౌకర్యం కూడా అప్ డేట్ చేశారు. హైఎండ్  వేరియంట్లలో లామినేటెడ్ గ్లాస్, సౌండ్‌ప్రూఫింగ్ సౌకర్యాలను కల్పించారు.

పవర్‌ ట్రెయిన్, రేంజ్, ఛార్జింగ్

SU7 లైనప్ షియోమి ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ సెటప్‌ తో పనిచేస్తుంది. ఇది 0–100 కిలో మీటర్ల వేగాన్ని కేవలం 3 సెకన్లలో అందుకుంటుంది. వేరియంట్‌ ను బట్టి క్లెయిమ్ చేయబడిన రేంజ్ 902 కి.మీ వరకు ఉంటుంది. గరిష్ట వేగం 265 కిలో మీటర్లు. DC ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ కూడా అప్‌గ్రేడ్ చేయబడింది.  15 నిమిషాల్లో 670 కి.మీ.ల వరకు రేంజ్ ను అందిస్తుంది. 5.2C గరిష్ట ఛార్జింగ్ రేటుతో 10–80% SoC నుంచి 12 నిమిషాల్లోనే ఛార్జింగ్ పూర్తవుతుంది. క్లెయిమ్ చేయబడిన CLTC రేంజ్ విషయానికి వస్తే,  స్టాండర్డ్ మోడల్‌ లో 720 కి.మీ, ప్రో మోడల్‌ లో 902 కి.మీ, మ్యాక్స్ మోడల్‌ లో 835 కి.మీ ఉంటుంది.

షియోమీ కొత్త SU7 భద్రత

Advertisement

ఈ కారు అడాప్టివ్ సస్పెన్షన్, మల్టీఫుల్ డ్రైవింగ్ మోడ్‌ లతో కూడిన ఛాసిస్ సిస్టమ్‌ ను కలిగి ఉంటుంది. స్టీరింగ్, బ్రేకింగ్,  స్టెబిలిటీ సిస్టమ్స్‌ లో చేసిన అప్ డేట్స్, కంఫర్ట్, హ్యాండ్లింగ్ రెండింటినీ మరింత మెరుగ్గా అందిస్తున్నాయి.  భద్రత పరంగా, ఈ కారు ఎక్కువ పవర్ కలిగిన స్టీల్ స్ట్రక్చర్‌ తో పాటు, సెన్సార్లు, డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. బ్యాటరీ ప్రొటెక్షన్,  మానిటరింగ్ సిస్టమ్స్ మరింత బలోపేతం చేయబడ్డాయి. ఈ కారు అప్‌డేట్ చేయబడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, AI-ఆధారిత వాయిస్ అసిస్టెంట్, మెరుగైన కనెక్టివిటీ ఫీచర్లతో, SU7 ఇన్ కార్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తుంది.

Read Also:  ఒకే ప్లాట్‌ ఫామ్, రెండు బ్రాండ్లు.. బాలెనో vs గ్లాంజా, రెండింటిలో ఏది బెస్ట్?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×