E-Paper
Advertisement

E-Rickshaw Burn: రూ.2.5 లక్షలు విలువ చేసే ఇ-రిక్షాను తగలబెట్టేసిన మహిళ.. కారణం ఇదేనట!

E-Rickshaw Burn: రూ.2.5 లక్షలు విలువ చేసే ఇ-రిక్షాను తగలబెట్టేసిన మహిళ.. కారణం ఇదేనట!
Advertisement

MP Woman Sets E-Rickshaw on Fire: చాలా మంది పేద, మధ్య తరగతి కుటుంబాలు జీవనాధారం కోసం చిన్న చిన్న పనులు, వ్యాపారాలు చేసుకుంటారు. వచ్చే కొద్ది మొత్తం ఆదాయాలతో బతుకుబండి లాగిస్తారు. అలాగే మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళ ఎలక్ట్రిక్ రిక్షాను కొనుగోలు చేసింది. తరచుగా రిపేర్లు రావడం, సర్వీస్ చేసేందుకు సదరు కంపెనీ అధికారులు నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంత బతిమిలాడినా తన రిక్షాను బాగు చేయకపోవడంతో అందరూ చూస్తుండగానే తగలబెట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?  

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో నివసించే గుడియా మహౌర్, ఆమె భర్త నారాయణ్ మహౌర్ కూలీలుగా పని చేస్తున్నారు. ఆరు నెలల క్రితం అప్పు చేసిన ఓ ఎలక్ట్రిక్ రిక్షాను కొనుగోలు చేశారు. ఈ రిక్షాకు రూ. 2.5 లక్షల వరకు ఖర్చు చేశారు. తన ముగ్గురు పిల్లలతో పాటు తామకు బతుకుబండి లాగించేందుకు ఈ రిక్షా బండి కొనుగోలు చేశారు. ఈ రిక్షా కొనుగోలు తర్వాత కూలి పని మానేసి, స్వయం ఉపాధి పొందాలనుకున్నారు. రెండు నెలలు సరిగా పని చేసింది.  అయితే, తాము ఒకటి తలిస్తే, దైవం మరకొకటి తలిచింది అన్నట్లుగా పరిస్థితి తయారైంది. కొద్ది రోజుల్లోనే రిక్షాలో టెక్నికల్ సమస్యలు రావడం మొదలయ్యింది. కొద్ది రోజుల్లోనే పూర్తిగా పని చేయడం ఆగిపోయింది.

షో రూమ్ కు వెళ్లి పరిస్థితి వివరించినా.. 

Advertisement

ఎలక్ట్రిక్ రిక్షా రిపేర్ కొసం చాలాసార్లు షోరూమ్‌కు వెళ్లారు. రెండు నెలలకే సమస్య వచ్చిందని ఫిర్యాదు చేశారు. కానీ, గుడియా మాటలు పెద్దగా పట్టించుకోలేదు. “గత నాలుగు నెలలుగా, నేను ఆ ఏజెన్సీకి పదే పదే వెళ్తున్నాను. రిక్షాను బాగు చేయాలని విజ్ఞప్తి చేశాను. దాన్ని మరమ్మతు చేయకుండా రకరకాల సాకులు చెప్తున్నారు” అని గుడియా చెప్పుకొచ్చింది. గత నాలుగు నెలలుగా ఆ రిక్షా ఇంట్లోనే నిరుపయోగంగా పడి ఉందన్నారు. మరోవైపు ఈ-రిక్షా కోసం EMI కట్టాలని ఒత్తిడి పెంచుతున్నారు. చివరికి మళ్లీ కూలికి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. చివరకు షోరూమ్ వాళ్లు రిపేర్ చేయమని చెప్పడంతో అప్పు చేసి కొన్న రిక్షా తమకు భారంగా మారిందన్నారు.

షో రూమ్ ముందే అందరూ చూస్తుండగా..

ఇక  గుడియా దంపతులకు ఓపిక నశించడంతో ఆ రిక్షాను నడిపించుకుంటూ షో రూమ్ దగ్గరికి తీసుకెళ్లారు. దాని మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. విషయం తెలిసిన పోలీసులు, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలోని దుకాణాలు, వాహనాలకు మంటలు వ్యాపించకుండా అధికారులు కంట్రోల్ చేశారు. ఆ తర్వాత కాలిపోయిన ఈ-రిక్షాను ఆ మహిళతో పాటు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

షో రూమ్ అధికారులు ఏమన్నారంటే..

Advertisement

అటు గుడియా వాదనలను షోరూమ్ సిబ్బంది ఖండించారు. బ్యాటరీ సమస్య తప్ప ఈ-రిక్షాలో తయారీ లోపం లేదని షోరూమ్ ఇన్‌ ఛార్జ్ శుభం శర్మ వెల్లడించారు. “బ్యాటరీ పగిలిపోయింది. పేలిన బ్యాటరీలకు కంపెనీ రీప్లేస్ చేయదు. దానిని ఉచితంగా మార్చేందుకు ఎలాంటి నిబంధన లేదు” అని శర్మ వివరించారు.  డబ్బులు చెల్లించి బ్యాటరీ మార్చుకోవాలని చెప్పినా, తను వినకుండా, కాల్చేశారని చెప్పుకొచ్చారు.

Read Also: రూ. 10 లక్షల్లోపు అదిరిపోయే కార్లు.. సిటీ ట్రాఫిక్ లో జర్నీకి ఇవే బెస్ట్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×