E-Paper
Advertisement

Bike Cleaning Tips: బైక్ వాష్ చేస్తున్నారా? ఈ 6 విషయాలు గుర్తుంచుకోండి!

Bike Cleaning Tips: బైక్ వాష్ చేస్తున్నారా? ఈ 6 విషయాలు గుర్తుంచుకోండి!
Advertisement

కారు వాష్ కష్టమైన పనా? బైక్ వాష్ కష్టమైన పనా? ఎవరిని అడిగినా, కారు కష్టం అంటారు. కానీ, వాస్తవానికి అది తప్పు. మోటార్‌సైకిల్ వాష్ అనేది కార్ వాష్ కంటే చాలా కష్టమైన పని అంటారు మెకానిక్స్. కార్ వాష్‌లో పెయింట్, గ్లాస్ ఏరియాను మాత్రమే శుభ్రం చేస్తారు. మోటార్‌ సైకిల్ వాష్‌ లో పెయింట్, ఇంజిన్, గేర్‌ బాక్స్, చైన్, కేబుల్స్ సహా చాలా యాక్సెసరీలను శుభ్రం చేయాల్సి ఉంటుంది. అందుకే బైక్ క్లీన్ చేసే సమయంలో కొన్ని టిప్స్ పాటించాలి.

⦿  శుభ్రమైన ప్లేస్ లో ఉంచాలి  

బైక్ వాష్ చేసే సమయంలో చాలా మంది అపరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచుతారు. అది చాలా తప్పు. అలా చేయడం వల్ల వాటర్ జెట్ ప్రెజర్ కు మురికి బైక్ లోపలి భాగాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. లేని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే, వీలైనంత వరకు శుభ్రమైన ప్రదేశంలో ఉంచి బైక్ ను వాష్ చేయాలి.

⦿  డే టైమ్ లో వాష్ చేయకూడదు!  

Advertisement

చాలా మంది బైక్ ను డే టైమ్ లో వాష్ చేస్తారు. అలా చేయడం వల్ల త్వరగా బైక్ ఆరిపోతుందని భావిస్తారు. ఇలా చేయడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందంటారు నిపుణులు. డే టైమ్ లో వాష్ చేయడం వల్ల పెయింట్ కు హాని కలిగే అవకాశం ఉందంటున్నారు.

⦿ ప్రెషర్ వాషర్లతో జాగ్రత్త

చాలా మంది బైక్ వాష్ చేసే సమయంలో ప్రెషర్ వాషర్లను ఉపయోగిస్తారు. వీటి వల్ల బైక్ కు అంటుకున్న బురద, దుమ్ము, ధూళి ఈజీగా పోతాయి. కానీ, అదే స్థాయిలో సమస్యలు కూడా వస్తాయంటున్నారు. అతిగా ప్రెషర్ వాషర్లతో నీటిని చల్లడం వల్ల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రికల్ భాగాలలోకి నీరు వెళ్లి చెడిపోయే అవకాశం ఉందంటున్నారు.

⦿ చైన్ క్లీనింగ్ 

Advertisement

బైక్ వాష్ చేసే సమయంలో చైన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చైన్ చుట్టూ దుమ్ము, ధూళితో పాటు గ్రీజు పేరుకుపోయే అవకాశం ఉంది. అందుకే, వాష్ సమయంలో చైన్ చుట్టూ పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలి. వీలైతే బ్రష్ ఉపయోగించడం మంచిది.

⦿ అన్ని ప్రాంతాలను శుభ్రం చేయాలి

బైక్ వాష్ చేసే సమయంలో  సాధారణ స్ప్రే, క్లీన్ సరిపోదు. బైక్ లోని అన్ని భాగాలను కవర్ చేయాలి. ముఖ్యంగా నల్లటి బాగాల్లో దుమ్ము పేరుకుపోయి చూడ్డానికి మురికిగా కనిపిస్తాయి. అందుకే నల్లటి ప్లాస్టిక్‌ బాగాలను వదిలి వేయకుండా జాగ్రత్తగా శుభ్రం చేయాలి.

⦿ ఎలా ఆరబెట్టాలంటే?  

బైక్ ను శుభ్రం చేసిన తర్వాత పెయింట్ చేసిన భాగాలను మృదువైన గుడ్డతో తుడవాలి. బైక్ మీద నిటి చుక్కలేకుండా చక్కగా మెత్తటి గుడ్డతో క్లీన్ చేయాలి. లేదంటే నీటి బిందువులు ఉన్న చోట మరకలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గుడ్డతో తుడిచిన తర్వాత నీడలో ఆరబెట్టాలి.కంప్రెస్డ్ ఎయిర్‌ తో ఆరబెట్టినట్లయితే బైక్ మరింత షైనింగ్ గా కనిపిస్తాయి. కంప్రెస్డ్ ఎయిర్ దొరకడం కష్టమైతే హెయిర్ డ్రైయర్‌ ని ఉపయోగించినా ఫర్వాలేదు. ఈ చిట్కాలు ఉపయోగించడం వల్ల బైక్ చక్కగా మెరిసేలా రెడీ అవుతుంది.

Read Also: మీ బైక్ కు సర్వీస్ అవసరమా? లేదా? సింపుల్ గా ఇలా తెలుసుకోండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×