E-Paper
Advertisement

Most Searched scooters Jan 2026: యాక్టివా To సుజుకి.. జనవరిలో ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేసిన స్కూటర్స్ ఇవే!

Most Searched scooters Jan 2026: యాక్టివా To సుజుకి.. జనవరిలో ఎక్కువ మంది నెటిజన్లు  సెర్చ్ చేసిన స్కూటర్స్ ఇవే!
Advertisement

2026లో ఇండియన్ మోటార్ సైకిల్ మార్కెట్ మంచి జోష్ లో కొనసాగుతోంది. జనవరిలో పెద్ద మొత్తంలో పెట్రోల్ స్కూటర్లు, బైక్స్ అమ్ముడయ్యాయి.  వీటిలో ఎక్కువగా 110cc-125cc మోడళ్లకు బలమైన ఆదరణ దక్కింది. వీటిలో హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్ 125 మార్కెట్‌ లో ముందున్నాయి. మార్కెట్ ట్రెండ్ ప్రకారం జనవరి 2026లో అత్యధికంగా సెర్చ్ చేసిన పెట్రోల్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 జనవరి 2026 ఎక్కువగా సెర్చ్ చేసిన పెట్రోల్ స్కూటర్లు

⦿ హోండా యాక్టివా 6G (109.51 cc):: అత్యధికంగా సెర్చ్ చేయడంతో పాటు కొనుగోలు చేసిన స్కూటర్ గా హోండా యాక్టివా 6G గుర్తింపు తెచ్చుకుంది. మంచి నమ్మకం, ఎక్కువ మైలేజ్ కారణంగా ఎక్కువ మంది దీనిని ఇష్టపడ్డారు.

Advertisement

⦿ సుజుకి యాక్సెస్ 125 (124 సిసి): ప్రీమియం లుక్, మంచి మైలేజ్, లేటెస్ట్ ఫీచర్ల కారణంగా కొత్తగా ప్రారంభించిన  2026 ABS వేరియంట్లకు గట్టి పోటీని ఇస్తుంది.

⦿ TVS Ntorq 125 (124.8 cc): అదిరిపోయే పనితీరు, స్పోర్టీ డిజైన్, బ్లూటూత్ కనెక్టెడ్ ఫీచర్ల కోసం నెటిజన్లు బాగా సెర్చ్ చేశారు.

Advertisement

⦿ TVS జూపిటర్ (113cc/125cc): టీవీఎస్ నుంచి విడుదలైన మోస్ట్ పాపులర్ స్కూటర్ జూపిటర్. మంచి సౌకర్యం,  అద్భుతమైన మైలేజీని కలిగి ఉంది. 110cc, 125cc మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది.

⦿ హోండా డియో 125/110: స్పోర్టి, ఎడ్జీ డిజైన్ కోసం యూత్ గా బాగా సెర్చ్ చేశారు.

⦿ యమహా రేజెడ్ఆర్ 125 ఫై హైబ్రిడ్ (125 సిసి): మంచి మైలేజ్, హైబ్రిడ్ టెక్నాలజీతో ఆకట్టుకుంటుంది.

⦿ సుజుకి బర్గ్‌ మాన్ స్ట్రీట్ (124 సిసి): ప్రత్యేకమైన స్టైలింగ్‌ తో సరసమైన మ్యాక్సీ స్కూటర్ గా ప్రసిద్ధి చెందింది.

⦿ హీరో ప్లెజర్ ప్లస్ XTEC (110.9 సిసి): సరసమైన, తేలికైన  ఆప్షన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

⦿ యమహా ఏరోక్స్ 155 (155 సిసి): పవర్ ఫుల్, స్పోర్టి రైడ్ కోరుకునే యూత్ కు టాప్ సెలెక్షన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ హీరో డెస్టిని 125 (124.6 సిసి): మంచి సౌకర్యం, బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Read Also: టాటా ఈవీలపై అదిరిపోయే ఆఫర్లు, ఆ కార్లపై ఏకంగా రూ. 3.80 లక్షల తగ్గింపు!

జనవరి 2026 మార్కెట్ ట్రెండ్స్  

⦿ సెగ్మెంట్ లీడర్లు: 110cc మోడల్స్ తో పోల్చితే, మంచి ప్యూయెల్ ఎఫిషియెన్స్, మెరుగైన పనితీరు కారణంగా 125cc విభాగం మంచి ప్రజాదరణను దక్కించుకుంది.

⦿ ఇంధన సామర్థ్యంపై ఫోకస్: హీరో డెస్టిని, యమహా ఫాసినో లాంటి హై మైలేజ్ మోడల్స్ ట్రెండింగ్‌ లో ఉన్నాయి.

⦿ అటు హోండా యాక్టివా 7G 2026 చివరిలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. TVS జూపిటర్ CNG,  యమహా NMax 155 లాంటి అప్ కమింగ్ మోడళ్ల గురించి నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు.

Read Also:  జనవరిలో ఈ బైక్ గురించి తెగ సెర్చ్ చేశారట! ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×