E-Paper
Advertisement

Electric Cars: బ్యాటరీ కార్లపై మోజు వద్దు.. కొన్న తర్వాత ఇత్తడే, ఎందుకంటే?

Electric Cars: బ్యాటరీ కార్లపై మోజు వద్దు.. కొన్న తర్వాత ఇత్తడే, ఎందుకంటే?
Advertisement

Electric Cars In India: భారత్ లో ఎలక్ట్రిక్ వాహన (EV) మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది, టాటా నెక్సాన్ EV, MG ZS EV, మహీంద్రా XUV400 లాంటి మోడల్స్ బాగా అమ్ముడవుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, తగ్గుతున్న బ్యాటరీ ధరలు, పర్యావరణ అవగాహన కారణంగా వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే, మధ్యతరగతి కుటుంబాలు ఈవీలు కొనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలంటున్నారు నిపుణులు. నిర్వహణ, బ్యాటరీ సంబంధిత సమస్యల కారణంగా EVలు తరచుగా ఇబ్బంది పెడుతున్నాయంటున్నారు. EVలతో తక్కువ రన్నింగ్ ఖర్చు అయినప్పటికీ బ్యాటరీ లైఫ్, ఖర్చులు, సర్వీస్ సవాళ్లతో ఇబ్బంది పడే అవకాశం ఉందంటున్నారు.

మరమ్మతులకు భారీగా ఖర్చు

EVలు పెట్రోల్/డీజిల్ కార్ల కంటే తక్కువ కదిలే భాగాలను కలిగి ఉంటాయి. ఇంజన్ ఆయిల్ మార్పులు, క్లచ్ రీప్లేస్‌మెంట్‌లు, ఎగ్జాస్ట్ మరమ్మతులు ఉండవు. EV ఏడాది మెయింటెనెన్స్ సాధారణంగా రూ.3,000– రూ.5,000 ఖర్చవుతుంది. ఇది ఐదు సంవత్సరాలలో ICE వాహనాలకు రూ.10,000– రూ.15,000 ఉంటుంది. అయితే, మనదేశంలో  Evల ప్రత్యేక మరమ్మతులు చాలా ఖర్చుతో కూడుకున్నవి. EVలకు హైవోల్టేజ్ వ్యవస్థలు, సాఫ్ట్‌ వేర్ అప్ డేట్స్, ఎలక్ట్రానిక్స్ కోసం శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు అవసరం. చాలా సర్వీస్ సెంటర్లు మెట్రో నగరాల్లోనే ఉన్నాయి.  టైర్ 2, 3 ఈ సర్వీసులు తక్కువగా ఉన్నాయి.

ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువ

Advertisement

అటు ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఎక్కువగా ఉంటాయి. ఖరీదైన భాగాలు, బ్యాటరీ ప్రమాదాల కారణంగా, EV బీమా ICE కార్ల కంటే 20–50% ఎక్కువ ఖరీదైనది. IRDAI EVల కోసం థర్డ్ పార్టీ ప్రీమియంలపై 15% తగ్గింపును అందిస్తుంది. కానీ సాధారణ   పాలసీలు ఖరీదైనవిగా ఉంటాయి.

భరించలేని విధంగా బ్యాటరీ ధరలు

బ్యాటరీ నిర్వహణ వ్యవస్థలు (BMS), ఇన్ఫోటైన్‌మెంట్‌లోని లోపాల కారణంగా కారును షోరూమ్ కు తీసుకెళ్లాల్సి రావచ్చు.  ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్‌లు సజావుగా ఉండవు.  రోజువారీ నిర్వహణ చౌకగా ఉన్నప్పటికీ, ఊహించని మరమ్మతులు మధ్యతరగతి యజమానులకు ఇబ్బంది కలిగిస్తాయి. బ్యాటరీ EV గుండె లాంటిది. ఇది వాహనం ఖర్చులో 40–50% ఉంటుంది.బ్యాటరీ ధరలు తగ్గాయి. kWhకి రూ. 8,000- రూ.20,000 తగ్గాయి. కానీ రీప్లేస్‌మెంట్ ఇప్పటికీ ఇబ్బందికరంగానే ఉంది. చిన్న EVలు బ్యాటరీలకు రూ. 4–6 లక్షలు ఖర్చవుతుంది. పెద్ద ప్యాక్ లకు రూ. 12–15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నెక్సాన్ లాంటి కార్ల ధర రూ. 15–20 లక్షల కాగా, బ్యాటరీ ధర ఏకంగా రూ. 7–9 లక్షలు ఉంటుంది.

బ్యాటరీ సమస్యలు

Advertisement

ఆధునిక లిథియం-అయాన్ బ్యాటరీలు 10–20 సంవత్సరాలు లేదంటే 2–3 లక్షల కి.మీ వరకు పని చేస్తాయి. సాధారణ ఉపయోగంలో 1–2% వార్షిక క్షీణత ఉంటుంది. భారతదేశంలోని వేడి వాతావరణంలో క్షీణత మరింత పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు బ్యాటరీ పరిధిని 10–20% తగ్గిస్తాయి. మొత్తంగా EVలు దీర్ఘకాలికంగా పర్యావరణ అనుకూలం, చౌకైనవి.  కానీ మధ్యతరగతి భారతీయ కుటుంబాలకు, బ్యాటరీ  భయాలు, అధిక మరమ్మతులు, మౌలిక సదుపాయాల సమస్యలు ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉంటాయి.

Read Also: వినియోగదారులకు షాక్, జనవరి 2026 నుంచి కార్ల ధరలు పెంపు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×