E-Paper
Advertisement

MG Windsor: అమ్మకాల్లో దుమ్మురేపిన MG విండ్సర్, ఆ ఘనత సాధించిన తొలి ఈవీగా గుర్తింపు!

MG Windsor: అమ్మకాల్లో దుమ్మురేపిన MG విండ్సర్, ఆ ఘనత సాధించిన తొలి ఈవీగా గుర్తింపు!
Advertisement

Best selling EV 2025: 2025లో ఈవీలు సత్తా చాటాయి. దేశీ మార్కెట్ లో  అమ్మకాల్లో మంచి దూకుడు కనబరిచాయి. JSW MG మోటార్ ఇండియాకు చెందిన MG విండ్సర్ 2025లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2025లో ఈ కారు ఏకంగా 46,735 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఎక్కువగా ఫ్యామిలీలు ఈ కారును కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపడంతో MG విండ్సర్ ఈ ఘనత దక్కించుకుంది. MG విండ్సర్ కుటుంబంతో కలిసి ప్రయాణించేందుకు అనుకూలంగా ఉంటుంది. మంచి స్పేస్, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం ఆకట్టుకుంటుంది.

111 శాతం పెరిగిన అమ్మకాలు

MG విండ్సర్ అమ్మకాలు JSW MG మోటార్ ఇండియా 2025 క్యాలెండర్ ఇయర్ ను సక్సస్ ఫుల్ గా ముగించేందుకు సాయపడింది. 2025 సంవత్సరానికి కంపెనీ మొత్తం 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. EV వాల్యూమ్‌ మాత్రం రెట్టింపు అయ్యింది. 2024 కంటే ఏకంగా 111 శాతం పెరిగింది. ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ మోడళ్లకు డిమాండ్ మెట్రోలకే పరిమితం కాకుండా, చిన్న నగరాలకు కూడా విస్తరిస్తున్నట్లు MG తెలిపింది.

తక్కువ ధరలో మంచి ఫీచర్లతో..

Advertisement

MG విండ్సర్‌ను బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ మోడల్ కింద  రూ. 9.99 లక్షల ప్రారంభ ధరకు అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కారు ట్రావెల్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుందని తెలిపింది. కిలో మీటర్ కు రూ. 3.9 ఖర్చుఅవుతున్నట్లు వివరించింది. ఈ కారు ఎలక్ట్రిక్ మోటారు 136 PS పవర్, 200 Nm టార్క్‌ ను అందిస్తుంది. రెండు బ్యాటరీ ఎంపికలలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వెర్షన్ 38 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒక్క ఫుల్ ఛార్జ్ మీద 332 కి.మీ పరిధిని అందిస్తుంది. విండ్సర్ ప్రో పెద్ద 52.9 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ మీద 449 కి.మీ పరిధిని అందిస్తుంది.

JSW MG మోటార్ ఇండియా ఏమన్నదంటే..   

MG విండ్సర్‌ అమ్మకాల్లో నెంబర్ వన్ గా నిలవడం పట్ల JSW MG మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా సంతోషం వ్యక్తం చేశారు. “విండ్సర్‌ కు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ దక్కింది. చాలా మంది వినియోగదారులు తమ మిత్రులకు కూడా ఈ కారును కొనుగోలు చేయాలని ప్రోత్సహించడం సంతోషంగా ఉంటుంది. ఈ కారు 2025లో  దేశంలో అమ్మకాల్లో నంబర్ 1గా నిలిచింది. మేం ఈ సక్సెస్ ను ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నాం. 2026లోనూ ఈవీ ప్లాట్ ఫారమ్ లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాం” అని వెల్లడించారు.  2025లో విండ్సర్ పనితీరుతో, JSW MG మోటార్ ఇండియా దేశ EV రంగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ కార్లు దేశీయ మార్కెట్లో ఊహించని రీతిలో సత్తా చాటుతున్నాయి. ప్రజల్లో గ్రీన్ ఎనర్జీ పట్ల అవగాహన పెరగడం, ప్రభుత్వాలు సబ్సిడీలు అందించడంతో ఈవీ కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి.

Advertisement

Read Also: పెట్రోల్, డీజిల్ కార్లను ఈవీలుగా మార్చండి, ఏకంగా రూ. 50 వేల ఆఫర్ పట్టేయండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×