E-Paper
Advertisement

కేశవా ఏందిరా ఇదీ… ఈ కారు ఏకంగా 406 టన్నుల రైలును లాగేసిందీ!

కేశవా ఏందిరా ఇదీ… ఈ కారు ఏకంగా 406 టన్నుల రైలును లాగేసిందీ!
Advertisement

MG Majestor Guinness World Record:  జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కొత్త SUV ఎంజీ మెజెస్టర్ అరుదైన ఘనత సాధించింది. అధికారికంగా మార్కెట్‌లోకి తీసుకురావడానికి ముందే అద్భుతమైన రికార్డు సృష్టించింది. ఈ  కారు  అసాధారణ శక్తిని చూపిస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది.

రైలును లాగిన ఎంజీ మెజెస్టర్

జమ్మూ కాశ్మీర్‌లోని కాకాపోరా–అవంతిపోరా మధ్య ఉన్న రైల్వే మార్గంలో నిర్వహించిన పరీక్షలో ఎంజీ మెజెస్టర్ సత్తా చాటింది. మార్చి 31న జరిపిన ఈ టెస్ట్ లో భారీ రైలును లాగి తన సామర్థ్యాన్ని నిరూపించింది. మొత్తం 406.4 టన్నుల బరువున్న రైలును 300 అడుగులకు పైగా దూరం లాగింది. అత్యంత బరువైన రైలును లాగిన SUVగా సరికొత్త రికార్డును నమోదు చేసింది.

పూర్తి స్టాండర్డ్ మోడల్ తో ప్రయోగం

Advertisement

ఈ ఘనతకు మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ పరీక్షలో ఉపయోగించిన వాహనం పూర్తిగా స్టాండర్డ్ మోడల్. ఈ టెస్ట్ కోసం  ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంజిన్, డ్రైవ్‌ ట్రెయిన్, ఇతర వ్యవస్థల్లో మార్పులు లేకుండానే భారీ రైలును లాగింది. ఈ రైలులో లోకోమోటివ్‌ తో పాటు ప్యాసింజర్ కోచ్‌లు, గార్డ్ కోచ్ కూడా ఉన్నాయి. మొత్తం రైలును కేవలం ఈ SUV తోనే కదిలించారు.

ఎంజీ మెజెస్టర్‌ ఇంజిన్ గురించి..

ఇంజిన్ విషయానికి వస్తే, ఎంజీ మెజెస్టర్‌ లో 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సుమారు 215 bhp పవర్, 478.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో పనిచేస్తుంది. అంతేకాకుండా, ఈ వాహనంలో అడ్వాన్స్‌డ్ 4WD సిస్టమ్, ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్స్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి కఠిన పరిస్థితుల్లో కూడా మంచి గ్రిప్, కంట్రోల్ అందిస్తాయి.  ఆఫ్ రోడ్ సామర్థ్యాన్ని పరిశీలిస్తే, 219 mm గ్రౌండ్ క్లియరెన్స్, నీటిలో సుమారు 810 mm లోతు వరకు వెళ్లే సామర్థ్యం కూడా ఇందులో ఉంది. కఠినమైన మార్గాల్లో కూడా సులభంగా నడిచే SUVగా గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

మెజెస్టర్‌ ను ప్రీమియం సెగ్మెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఇది ఇప్పటికే ఉన్న గ్లోస్టర్ కంటే పై స్థాయిలో ఉండే మోడల్‌గా భావిస్తున్నారు. రూ. 41,000తో ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ముందుగా బుక్ చేసుకునే వారికి వారంటీ, రోడ్‌ సైడ్ సహాయం, ప్రత్యేక డెలివరీ లాంటి బెనిఫిట్స్ అందించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ రికార్డు ద్వారా ఎంజీ మెజెస్టర్ శక్తి, ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. మార్కెట్‌లోకి రాకముందే ఇలాంటి ప్రదర్శన చేయడం ద్వారా వినియోగదారుల దృష్టిని ఆకర్షించడంలో కంపెనీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు.

Read Also: స్క్రాప్‌ తో సోలార్ కారు తయారీ, ఈ కామన్ మ్యాన్ క్రియేటివిటీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×