E-Paper
Advertisement

మే అమ్మకాల్లో దుమ్మురేపిన హీరో.. ఏకంగా ఎన్ని లక్షల యూనిట్స్ అమ్మిందంటే?

మే అమ్మకాల్లో దుమ్మురేపిన హీరో.. ఏకంగా ఎన్ని లక్షల యూనిట్స్ అమ్మిందంటే?
Advertisement

May 2026 Two Wheeler Sales Report: ఇండియన్ టూ వీలర్ మార్కెట్ మే 2026లో సత్తా చాటింది. మంచి వృద్ధిని నమోదు చేసింది. పాపులర్ టూవీలర్ తయారీ సంస్థలు దేశీయ అమ్మకాలు, ఎగుమతులతో పాటు  మొత్తం అమ్మకాల్లో గత ఏడాదితో పోలిస్తే మంచి రిజల్ట్స్ సాధించాయి. హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్, సుజుకి, రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి బ్రాండ్లు అమ్మకాల్లో దూసుకెళ్లాయి.

1.హీరో  

హీరో మోటోకార్ప్ మరోసారి దేశంలో అత్యధిక టూ వీలర్స్ అమ్మిన కంపెనీగా గుర్తింపు తెచ్చుకుంది. మే 2026లో కంపెనీ మొత్తం 5.70 లక్షలకుపైగా యూనిట్లను డిస్పాచ్ చేసింది. దేశీయ మార్కెట్లో 5.36 లక్షల యూనిట్లు అమ్ముడవగా, ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా స్కూటర్ అమ్మకాలు భారీగా పెరగడం హీరోకు కలిసివచ్చింది.

2.హోండా

Advertisement

హోండా మోటార్‌ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కూడా అమ్మకాల్లో సత్తా చాటింది. కంపెనీ మొత్తం అమ్మకాలు 5.18 లక్షల యూనిట్లకు చేరాయి. దేశీయ మార్కెట్లోనే కాకుండా విదేశీ మార్కెట్లలో కూడా హోండా మంచి వృద్ధిని సాధించింది. ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరగడం కంపెనీకి అదనపు బలం ఇచ్చింది.

3.టీవీఎస్

ఈ నెలలో అత్యుత్తమ వృద్ధి సాధించిన కంపెనీల్లో టీవీఎస్ మోటార్ ఒకటి. టీవీఎస్ మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 5.43 లక్షల యూనిట్లను దాటాయి. మోటార్‌ సైకిళ్లు, స్కూటర్లు రెండింటి విక్రయాలు కూడా బలంగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో కంపెనీ 24 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం.

4.బజాజ్

Advertisement

బజాజ్ ఆటో కూడా మంచి ఫలితాలు సాధించింది. దేశీయ మార్కెట్లో 2 లక్షలకుపైగా ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అయితే, బజాజ్ విజయానికి ప్రధాన కారణం ఎగుమతులే. విదేశీ మార్కెట్లలో అమ్మకాలు భారీగా పెరగడంతో మొత్తం విక్రయాలు 3.93 లక్షల యూనిట్లకు చేరాయి. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ మొత్తం అమ్మకాలు 18 శాతం పెరిగాయి.

5.సుజుకి

సుజుకి మోటార్‌ సైకిల్ ఇండియా మే 2026లో తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డును నమోదు చేసింది. కంపెనీ మొత్తం 1.32 లక్షల యూనిట్లను విక్రయించింది. దేశీయ అమ్మకాలు లక్షకు పైగా చేరుకుని కొత్త రికార్డు సృష్టించాయి. ఎగుమతులు కూడా పెరుగుదల నమోదు చేశాయి.

6.రాయల్ ఎన్‌ఫీల్డ్

రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా దేశీయ మార్కెట్లో మంచి వృద్ధిని నమోదు చేసింది. మే నెలలో 94 వేలకుపైగా మోటార్‌ సైకిళ్లు అమ్ముడయ్యాయి. అయితే ఎగుమతులు తగ్గడం కంపెనీకి కొంత నిరాశ కలిగించింది. అయినప్పటికీ, మొత్తం అమ్మకాలు లక్ష యూనిట్ల మార్క్‌ను దాటి 15 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

మే 2026లో ఇండియన్ టూ వీలర్ ఇండస్ట్రీ ఓ రేంజ్ లో సత్తా చాటింది. దేశీయ డిమాండ్ పెరగడం, ఎగుమతులు మెరుగుపడటం వల్ల ప్రముఖ కంపెనీలు మంచి అమ్మకాలను సాధించాయి. రాబోయే నెలల్లో కూడా ఈ వృద్ధి కొనసాగుతుందనే ఆశాభావం పరిశ్రమ వర్గాల్లో కనిపిస్తోంది.

Read Also: ఎలక్ట్రిక్ To హైబ్రిడ్.. భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సూపర్ 7-సీటర్ SUVలు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×