E-Paper
Advertisement

మారుతి నుంచి మరో సర్‌ప్రైజ్.. త్వరలో XL6 ఫేస్‌ లిఫ్ట్ గ్రాండ్ ఎంట్రీ!

మారుతి నుంచి మరో సర్‌ప్రైజ్.. త్వరలో XL6 ఫేస్‌ లిఫ్ట్ గ్రాండ్ ఎంట్రీ!
Advertisement

Maruti XL6 Launch: మారుతి సుజుకి త్వరలో XL6 ఫేస్‌ లిఫ్ట్‌ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన GIIAS 2026 ఆటో షోలో కంపెనీ కొత్త సుజుకి XL7 ఫేస్‌ లిఫ్ట్‌ ను ఆవిష్కరించింది. ఇదే మోడల్‌ ను కొన్ని మార్పులతో భారత్‌ లో XL6 ఫేస్‌ లిఫ్ట్‌ గా తీసుకురావచ్చని ఆటో వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే బ్రెజ్జా ఫేస్‌ లిఫ్ట్‌ ను తీసుకొచ్చిన మారుతి, ఇప్పుడు XL6ను కూడా కొత్త రూపంలో పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

కొత్త డిజైన్‌ తో మరింత ఆకర్షణీయంగా

కొత్త XL7ను పరిశీలిస్తే ముందు భాగంలో పెద్ద గ్రిల్, కొత్త బంపర్ డిజైన్, స్పోర్టీ స్టైలింగ్ ఆకట్టుకుంటున్నాయి. దీంతో వెహికల్  మరింత బోల్డ్‌ గా కనిపిస్తోంది. LED హెడ్‌ ల్యాంప్‌ లు, బోనెట్ డిజైన్ మాత్రం ప్రస్తుత మోడల్‌ను పోలి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌ లో పెద్దగా మార్పులు కనిపించకపోయినా, కొత్త 16 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ ను అందించే అవకాశం ఉంది. వెనుక భాగంలో స్మోక్డ్ టెయిల్ ల్యాంప్స్, బ్లాక్ స్పాయిలర్, బ్లాక్ ట్రిమ్స్‌ తో మరింత ప్రీమియం లుక్ ఇవ్వాలని కంపెనీ ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

క్యాబిన్‌ లో కొత్త ఫీచర్లు

Advertisement

ఇంటీరియర్‌ లో కొన్ని ముఖ్యమైన అప్‌ డేట్లు ఉండే అవకాశం ఉంది. డ్యాష్‌ బోర్డ్‌ కు కొత్త డిజైన్‌ తో పాటు పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బ్రెజ్జాలో ఇచ్చిన కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ను ఇందులో కూడా ఉపయోగించే అవకాశం ఉంది.  ఇప్పటికే XL6లో వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, ABS, ESC, TPMS లాంటి పలు ఫీచర్లు ఉన్నాయి. ఫేస్‌ లిఫ్ట్ వెర్షన్‌ లో వీటికి మరికొన్ని కొత్త ఫీచర్లు యాడ్ చేసే అవకాశం ఉంది.

ఇంజిన్‌ లో మార్పులు ఉండకపోవచ్చు!

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్, అలాగే CNG వేరియంట్‌ ను కొనసాగించే అవకాశం ఉంది. పెట్రోల్ మోడల్ 103 PS పవర్, 139 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. CNG వేరియంట్ 88 PS పవర్, 121 Nm టార్క్‌ ను అందిస్తుంది. గేర్‌ బాక్స్ ఆప్షన్స్ లో 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ కొనసాగనున్నాయి. అలాగే కొత్త బ్రెజ్జాలో అందించిన అప్‌ డేటెడ్ గేర్‌ బాక్స్‌ ను కూడా XL6లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి XL6 ప్రారంభ ధర రూ.11.57 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఈ ఏడాది చివర్లో లేదంటే, 2027 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. భారత మార్కెట్లో ఇది కియా కేరెన్స్ క్లావిస్, మారుతి ఎర్టిగా, టయోటా రూమియాన్ లాంటి MPVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Advertisement

Read Also: స్కార్పియో N ఫేస్‌ లిఫ్ట్ లాంచ్ డేట్ ఫిక్స్.. కొత్త ఫీచర్లు ఇవే!

Tags

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×