E-Paper
Advertisement

పెట్రో ధరలు పెరిగినా డోంట్ కేర్.. మే కార్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డులు!

పెట్రో ధరలు పెరిగినా డోంట్ కేర్.. మే కార్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డులు!
Advertisement

India Auto Market: మే 2026లో ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్లింది. ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ, వినియోగదారుల నుంచి కార్లకు డిమాండ్ తగ్గలేదు. అంతేకాదు,  టాప్ ఆటోమొబైల్ కంపెనీలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్, కియా లాంటి కంపెనీలు అమ్మకాల పరంగా సత్తా చాటాయి.

ఒకే నెలలో 4.4 లక్షల కార్ల అమ్మకం

తాజా నివేదికల ప్రకారం మే 2026లో దేశీయ ప్యాసింజర్ వాహనాల హోల్‌ సేల్ అమ్మకాలు సుమారు 4.40 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య సుమారు 3.51 లక్షల యూనిట్లుగా ఉండగా, దాదాపు 25 శాతం వృద్ధి నమోదైంది. SUV సెగ్మెంట్‌ లో పెరిగిన డిమాండ్, కొత్త మోడళ్ల ఎఫెక్ట్ తోనే అమ్మకాలు భారీగా పెరిగాయి.

⦿ మారుతి సుజుకి

Advertisement

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి మే నెలలో రికార్డు స్థాయి అమ్మకాలు నమోదు చేసింది. కంపెనీ సుమారు 1,90,000 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ఇది గతేడాదితో పోలిస్తే దాదాపు 40 శాతం వృద్ధి సాధించింది. SUV విభాగంలో 57 శాతం పెరుగుదల నమోదయ్యింది. కంపెనీ CNG వాహనాల అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నారని కంపెనీ వెల్లడించింది.

⦿ టాటా మోటార్స్

టాటా కూడా అమ్మకాల్లో దూసుకెళ్లింది. ఈ నెలలో సుమారు 59,000 యూనిట్లను డీలర్లకు పంపించింది. పంచ్, నెక్సాన్ మోడళ్లకు ఉన్న డిమాండ్ ఈ వృద్ధికి కారణం అయ్యింది. కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా బుకింగ్‌లు భారీగా పెరిగాయని తెలిపింది.

⦿ మహీంద్రా  

Advertisement

సుమారు 58,000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. స్కార్పియో N, థార్ లాంటి SUVలకు కొనసాగుతున్న డిమాండ్ కంపెనీ వృద్ధికి దోహదపడింది.

⦿ హ్యుందాయ్  

మారుతి సుజుకి కూడా మే నెలలో స్థిరమైన వృద్ధిని కొనసాగించింది. సుమారు 47,800 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. SUV మోడళ్లపై వినియోగదారుల ఆసక్తితో ఈ జోరు కొనసాగింది.

⦿ టయోటా, కియా  

టయోటా,కియా కంపెనీలు కూడా సానుకూల ఫలితాలను నమోదు చేశాయి. టయోటా 30,000కు పైగా యూనిట్లు విక్రయించగా, కియా 27,000 యూనిట్లకు పైగా అమ్మకాలు సాధించింది. సెల్టోస్, సోనెట్ వంటి మోడళ్లకు ఉన్న డిమాండ్ కియా వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. మొత్తంగా ఇంధన ధరలు పెరిగినప్పటికీ భారత ఆటోమొబైల్ మార్కెట్ బలంగా కొనసాగుతోంది. SUV సెగ్మెంట్, CNG వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.

Read Also: ఒక్క నెలలో ఇన్నిఈవీలా.. ఈ నెలలో మార్కెట్‌ ను షేక్ చేయనున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×