E-Paper
Advertisement

Maruti Suzuki Micro SUV: మారుతి నుంచి మైక్రో ఎస్‌యూవీ, టాటా పంచ్ కు పోటీ తప్పదా?

Maruti Suzuki Micro SUV: మారుతి నుంచి మైక్రో ఎస్‌యూవీ, టాటా పంచ్ కు పోటీ తప్పదా?
Advertisement

Maruti Suzuki Upcoming Micro SUV: మైక్రో ఎస్‌యూవీ విభాగంలో అధిక అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్న మారుతి సుజుకి.. వచ్చే ఏడాది ఆరంభం నాటికి మారుతి నుంచి సరికొత్త మోడల్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. గత పదేళ్లలో ఆరు మోడళ్లతో ఎస్‌యూవీ శ్రేణిని బలోపేతం చేసిన మారుతి సుజుకి, రాబోయే సంవత్సరాల్లో కూడా ఈ శ్రేణిని మరింత విస్తరించాలని భావిస్తోంది. ఇకపై, ఈ బ్రాండ్ చిన్నగా ఉండే చౌకైన ఎస్‌యూవీలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా టాటా పంచ్‌కు పోటీగా క్రేజీ మోడల్ ను తీసుకురాబోతోంది.

తాజాగా నివేదికల ప్రకారం..  మారుతి సుజుకి నెక్ట్స్ లాంచ్ కు సంబంధించి ‘YMC’ అనే కోడ్‌ నేమ్‌ తో ఒక పూర్తి ఎలక్ట్రిక్ MPVని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అయితే, ఈ EV తర్వాత, సంస్థ ఎంట్రీ లెవల్ కార్లపై తన దృష్టిని పెట్టనుంది. 1,200 cc (పెట్రోల్), 1,500 cc (డీజిల్) కంటే పెద్దవి కాని ఇంజిన్లు ఉన్న 4 మీటర్ల లోపు మోడళ్లపై GSTని 18 శాతానికి తగ్గించినప్పటి నుంచి ఈ సంస్థ ఆ కార్ల తయారీపై మొగ్గు చూపుతోంది.

Advertisement

రానున్న రోజుల్లో మారుతి సుజుకి సరికొత్త ఎంట్రీ లెవల్ కార్ల శ్రేణిలో మొదటిది ‘Y43’ అనే కోడ్‌ నేమ్‌ తో రానున్న మైక్రో ఎస్‌యూవీ. టాటా పంచ్ సక్సెస్ ఫుల్ గా ఇదే సెగ్మెంట్ లో కొనసాగుతోంది. ఇదే సెగ్మెంట్ లో తన రాబోయే మినీ ఎస్‌యూవీని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ కారుతో మార్కెట్‌ లో తమ వాటాను బలోపేతం చేసుకోవాలనుకుంది.

ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి తన ఇగ్నిస్‌ తో ముందుగా ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఆ మోడల్ పెద్దగా సక్సెస్ కాలేదు. చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ లాంటి ప్రత్యర్థులు పెద్దవిగా, మరింత విశాలంగా ఉన్నాయి. ఈ కార్లు పనితీరు, సౌకర్యం, కనెక్టివిటీ, భద్రత పరంగా మరింత మెరుగ్గా ఉన్నాయి.

Advertisement

మారుతి Y43 సుమారుగా 3.8 మీటర్ల పొడవు, 1.7 మీటర్లకు పైగా వెడల్పు, 1.6 మీటర్లకు పైగా ఎత్తును కలిగి ఉండే అవకాశం ఉంది. దీని వీల్‌ బేస్ సుమారు 2.5 మీటర్లు ఉండవచ్చు. మారుతి సుజుకి తన కొత్త మైక్రో ఎస్‌యూవీ.. 80hp పవర్, 111.7nm టార్క్‌ ను ఉత్పత్తి చేసే Z12E 1.2 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ తో రానుంది. ఈ కంపెనీ ఇదే ఇంజన్ CNG వేరియంట్‌ ను కూడా అందించవచ్చు, ఇది గ్యాస్‌పై నడుస్తూ 69 hp పవర్, 101.8nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

2027లో ఈ మైక్రో ఎస్‌యూవీ విడుదల

అటు మారుతి సుజుకి 2027 ప్రారంభంలో Y43ని విడుదల చేసే అవకాశం ఉంది. దీని బేస్ కాన్ఫిగరేషన్ ధర రూ. 5.25-5.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ఉంటుందని భావిస్తున్నారు. రాబోయే 5-6 సంవత్సరాలలో కంపెనీ లాంచ్ చేయాలని భావిస్తున్న7 ఎస్‌యూవీలలో ఈ మోడల్ ఒకటి కాఉంది. ఎస్‌యూవీ విభాగంలో ప్రస్తుతం మారుతి సుజుకి దాదాపు 20% మార్కెట్ వాటాను కలిగి ఉంది.

Read Also: రెండేళ్లలో 5 SUVలు.. టయోటా నుంచి రాబోయే క్రేజీ కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×