E-Paper
Advertisement

కొనుగోలుదారులకు మారుతి సుజుకి షాక్.. అన్ని మోడళ్ల ధరల పెంపు!

కొనుగోలుదారులకు మారుతి సుజుకి షాక్.. అన్ని మోడళ్ల ధరల పెంపు!
Advertisement

Maruti Suzuki Price Hike 2026: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ వాహనాల ధరలను మరోసారి పెంచనున్నట్లు ప్రకటించింది. 2026 జూన్ నెల నుంచి కంపెనీ విక్రయించే దాదాపు అన్ని మోడళ్ల ధరలు పెరగనున్నాయి. మోడల్‌ ను బట్టి గరిష్టంగా రూ. 30,000 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ముడి సరుకు ధరలు పెరగడం, తయారీ ఖర్చులు అధికమవడం, ద్రవ్యోల్బణ ప్రభావం లాంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతి సుజుకి వెల్లడించింది. ఇప్పటి వరకు పెరిగిన ఖర్చులను కంపెనీ భరించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఇప్పుడు కొంత భారాన్ని వినియోగదారులపై మోపక తప్పడం లేదని వెల్లడించింది.

మారుతి కార్లకు భారత మార్కెట్ లో మంచి డిమాండ్

మారుతి సుజుకి ప్రస్తుతం అరేనా, నెక్సా, కమర్షియల్ అనే మూడు వేర్వేరు డీలర్‌ షిప్ నెట్‌ వర్క్‌ ల ద్వారా  కార్లను అమ్ముతుంది. అరేనా షోరూమ్‌లలో కంపెనీ ఎంట్రీ లెవల్ మోడళ్ల నుంచి ఫ్యామిలీ కార్ల వరకు అందిస్తోంది. ఇందులో ఆల్టో K10, సెలెరియో, వాగన్ ఆర్, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా లాంటి మోడళ్లు ఉన్నాయి. తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఈ కార్లకు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.  కమర్షియల్ విభాగంలో టూర్ సిరీస్ కార్లు ఉన్నాయి. ఇవి టాక్సీ, కమర్షియల్ అవసరాల కోసం రూపొందించిన మోడళ్లు. టూర్ H1, టూర్ H3, టూర్ S, టూర్ M లాంటి వాహనాలు ఈ విభాగంలో లభిస్తున్నాయి. ధరల పెంపు ఈ మోడళ్లపైనా ప్రభావం చూపనుంది.

నెక్సా షోరూమ్‌ లలో ప్రీమియం కార్లు    

Advertisement

ఇక ప్రీమియం సెగ్మెంట్ కోసం మారుతి సుజుకి నెక్సా షోరూమ్‌ల ద్వారా ప్రత్యేక మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో బాలెనో, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, XL6, జిమ్నీ లాంటి కార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇగ్నిస్ మోడల్ తయారీని కంపెనీ నిలిపివేసినట్లు తెలుస్తోంది. డీలర్ల వద్ద ఉన్న స్టాక్ పూర్తయిన తర్వాత ఈ మోడల్ మార్కెట్లో కనిపించకపోవచ్చు. మారుతి సుజుకి తాజాగా లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ SUV  ఇ-విటారా కూడా కంపెనీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ కారును ప్రత్యేక BaaS  ఆప్షన్‌ తో కూడా అందిస్తున్నారు. దీంతో కస్టమర్లు తక్కువ ప్రారంభ ధరకు కారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

ఇక కంపెనీ అత్యంత ఖరీదైన మోడల్ ఇన్విక్టో. ఇది టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా రూపొందించిన పెద్ద MPV. ఈ కారు కేవలం హైబ్రిడ్ ఇంజిన్‌ తో మాత్రమే అందుబాటులో ఉంది. కుటుంబ వినియోగంతో పాటు ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని దీన్ని విక్రయిస్తున్నారు.

జూన్ నుంచి పెరిగిన ధరలు అమలు

Advertisement

జూన్ నుంచి ధరలు పెరగనున్న నేపథ్యంలో కొత్త కారు కొనాలని భావిస్తున్న వారు ముందుగానే బుకింగ్ చేసుకుంటే కొంత వరకు ఖర్చును తగ్గించుకోవచ్చు. ధరల పెంపు తర్వాత అన్ని మోడళ్ల కొత్త రేట్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Read Also: ఏడాదిలో 6 కొత్త కార్లు లాంచ్, హోండా మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×