E-Paper
Advertisement

ఇండియన్ కార్ మార్కెట్లో మారుతి జోరు.. మేలో రికార్డు స్థాయి అమ్మకాలు!

ఇండియన్ కార్ మార్కెట్లో మారుతి జోరు.. మేలో రికార్డు స్థాయి అమ్మకాలు!
Advertisement

Maruti Suzuki Sales June 2026: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి సంస్థ మే 2026లో సూపర్ సేల్స్ సాధించింది. అమ్మకాల్లో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. కంపెనీ చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. మొత్తం 2,42,688 కార్లను అమ్మింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఏకంగా 34.76 శాతం వృద్ధిని సాధించింది. 2025 మేలో కంపెనీ 1,80,077 యూనిట్లను మాత్రమే విక్రయించగా, ఈసారి ఆ సంఖ్య భారీగా పెరిగింది.

దేశీ మార్కెట్లో సరికొత్త రికార్డు

దేశీయ మార్కెట్లో కూడా మారుతి సుజుకి సరికొత్త రికార్డును నమోదు చేసింది. గత ఏడాది మే నెలలో 1,38,690 యూనిట్లు విక్రయించగా, ఈసారి దేశీయ అమ్మకాలు 1,93,535 యూనిట్లకు చేరుకున్నాయి. కంపెనీ చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు కావడం విశేషం. అలాగే ఇతర ఆటోమొబైల్ తయారీ సంస్థలకు ఏకంగా 7,239 యూనిట్లను సరఫరా చేసింది.

చిన్నకార్ల అమ్మకాల్లో మరింత జోరు

Advertisement

చిన్న కార్ల విభాగంలో కూడా భారీగా వృద్ధి సాధించింది. ఆల్టో, ఎస్ ప్రెస్సో లాంటి మోడళ్ల అమ్మకాలు గత ఏడాది మేలో 6,776 యూనిట్లుగా ఉండగా, ఈసారి 16,275 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ విభాగంలో డిమాండ్ భారీగా పెరిగింది.  బాలెనో, స్విఫ్ట్, వాగన్ ఆర్, డిజైర్, సెలెరియో, ఇగ్నిస్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు కూడా మంచి వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది 61,960 యూనిట్లు విక్రయించగా, ఈసారి 81,555 యూనిట్లకు పెరిగాయి. మధ్యతరగతి వినియోగదారులు ఈ మోడళ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

అటు ఎస్‌యూవీ, యుటిలిటీ వాహనాల విభాగంలో కూడా మారుతి సుజుకి సత్తా చాటింది. బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఎక్స్‌ ఎల్ 6, ఇన్విక్టో లాంటి మోడళ్ల అమ్మకాలు గత ఏడాది 54,899 యూనిట్లుగా ఉండగా, ఈసారి 79,267 యూనిట్లకు పెరిగాయి. ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్ కంపెనీకి కలిసొచ్చింది. అటు ఈకో వ్యాన్ అమ్మకాలు గత ఏడాది 12,327 యూనిట్లుగా ఉండగా, ఈసారి 13,240 యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే సూపర్ క్యారీ లైట్ కమర్షియల్ వాహనాల విక్రయాలు కూడా పెరిగి 3,198 యూనిట్లకు చేరుకున్నాయి.

ఎగుమతులలోనూ మారుతి దూకుడు

Advertisement

ఎగుమతుల పరంగా కూడా కంపెనీ మంచి ఫలితాలు సాధించింది. 2025 మేలో 31,219 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేయగా, ఈసారి ఆ సంఖ్య 41,914 యూనిట్లకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మారుతి వాహనాలకు మంచి డిమాండ్ కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే, దేశీయ విక్రయాలు, ఎగుమతులు, చిన్న కార్లు, కాంపాక్ట్ కార్లు, ఎస్‌యూవీలు లాంటి అన్ని విభాగాల్లో వృద్ధి నమోదు కావడంతో మారుతి సుజుకి మే 2026లో అమ్మకాల్లో కొత్త రికార్డు క్రియేట్ చేసింది.

Read Also: ఆటోమేటిక్ కార్లు కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరలో బెస్ట్ మోడల్స్ ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×