E-Paper
Advertisement

Maruti Suzuki e Vitara: వచ్చేసింది మారుతి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Maruti Suzuki e Vitara: వచ్చేసింది మారుతి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Advertisement

Maruti Suzuki e Vitara Launch: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV ఇ- విటారాలను ఇండియన్ మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధరను రూ. 10.99 లక్షలుగా నిర్ణయించింది. ఈ కారును బ్యాటరీ ఈఎంఐ కింద కిలో మీటరుకు రూ. 3.99 చొప్పున కంపెనీకి చెల్లిల్సాల్సి ఉంటుంది. ఈ కారును రూ. 21000 చెల్లించి నెక్సా షో రూమ్‌ లలో లేదంటే అధికారిక వెబ్‌ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

జనవరి 2025లో ఆటో ఎక్స్ పోలో లాంచ్

2025 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి ఇ-విటారాను తొలిసారి ప్రదర్శించింది. ఈ కారు ఏడాది తర్వాత మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ SUV విభాగంలోకి ప్రవేశించింది. ఈ కారు కొనుగోలుదారులు వెహికల్, బ్యాటరీ ప్యాక్ రెండింటిపై 8  సంవత్సరాల వారంటీ, ఒక సంవత్సరం ఉచిత ఛార్జింగ్ లాంటి ఆఫర్లు అందిస్తుంది. అదే సమయంలో రూ. 50 వేల విలువైన ఇన్‌స్టాలేషన్‌తో ఫ్రీ హోమ్ ఛార్జర్ ను కూడా అందిస్తుంది.

మారుతి సుజుకి ఇ-విటారా డిజైన్‌ గురించి..

Advertisement

మారుతి సుజుకి మంచి లుక్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ కారు ఛార్జింగ్‌ పోర్ట్‌ ను ముందువైపు ఇచ్చారు. 18 అంగుళాల వీల్స్‌ ఉన్నాయి. 4275mm పొడవు, 1800 mm వెడల్పు, 1635 mm ఎత్తు, 2700 mm వీల్‌ బేస్‌ కలిగి ఉంటుంది. 180 mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ తో వస్తోంది. కారు లోపలి భాగంలో 10.25 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ అందుబాటులో ఉన్నాయి. పనోరమిక్‌ సన్‌ రూఫ్‌, యాంబియెంట్‌ లైటింగ్‌, వైర్‌ లెస్‌ ఛార్జింగ్‌, JBL సౌండ్‌ సిస్టమ్‌, ఆటోమేటిక్ క్లైమేట్‌ కంట్రోల్‌, మల్టిపుల్‌ యూఎస్‌బీ పోర్టులు, ఇన్‌ క్యాబిన్‌ ఎయిర్‌ ప్యూరిఫయర్‌ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఏడు ఎయిర్‌ బ్యాగులు ఉన్నాయి. ABS, EBD, ESP, 360 డిగ్రీల కెమెరా, లెవల్‌ 2 అడ్వాన్స్ డ్ ఫీచర్లు ఉన్నాయి.

Read Also: ఓలా To హీరో.. ఈ స్కూటర్లకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదండోయ్!

మారుతి సుజుకి ఇ-విటారా బ్యాటరీ, రేంజ్

Advertisement

మారుతి సుజుకి ఇ-విటారా 49kwh, 61kwh బ్యాటరీ ఆప్షన్స్ లో లభిస్తుంది.  49kwh బ్యాటరీ సామర్థ్యం కలిగిన విటారా 144hp పవర్‌ను, 189nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. సింగిల్‌ ఛార్జ్‌ తో 440 కిలో మీటర్లు  ప్రయాణించొచ్చు. ఇక  61kwh బ్యాటరీ సామర్థ్యం కలిగిన మోడల్‌ లో 174 hp పవర్‌, 180nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సింగిల్‌ ఛార్జింగ్‌ తో 543 కిలోమీటర్ల ప్రయాణాన్ని అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు, ఇన్వర్టర్ అండ్ ట్రాన్స్‌ మిషన్లను కలిపిఏ కాంపాక్ట్ 3-ఇన్-1 వ్యవస్థ ఉంటుంది. అంతేకాదు, ఎకో, నార్మల్, స్పోర్ట్, స్నో లాంటి నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.

Read Also: టాటా సియెర్రా To మారుతి సుజుకి ఇ విటారా.. త్వరలో లాంచ్ కాబోతున్న క్రేజీ ఈవీలు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×