E-Paper
Advertisement

మారుతి ఇ-విటారా కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

మారుతి ఇ-విటారా కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
Advertisement

Maruti Suzuki e Vitara Details: భారతీయ ఎలక్ట్రిక్ మార్కెట్లో మారుతి సుజుకి ఇ-విటారా మంచి ఆదరణ దక్కించుకుంటుంది. ఫిబ్రవరి 2026లో విడుదలైన ఈ 5 సీటర్ ఎలక్ట్రిక్ SUVకి కొనుగోలుదారుల నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. ఆకట్టుకునే డిజైన్, మంచి రేంజ్, భద్రతా ఫీచర్లు, కొత్త టెక్నాలజీలతో ఈ SUV వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకవేళ మీరు కూడా ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే ఈ విషయాలు తెలుసుకోండి.

⦿ బ్యాటరీ ఆప్షన్లు, రేంజ్

ఈ ఎలక్ట్రిక్ SUVలో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి 48.8kWh బ్యాటరీ కాగా, మరొకటి 61.1kWh బ్యాటరీ ప్యాక్. పెద్ద బ్యాటరీ వేరియంట్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 543 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. సిటీతో పాటు హైవే ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా రూపొందించారు. 61.1kWh బ్యాటరీ వేరియంట్‌ లో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ సుమారు 172 bhp పవర్, 193Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.  కారు మంచి పికప్‌ తో పాటు స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. DC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో  బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతం వరకు కేవలం 45 నిమిషాల్లో ఛార్జ్ చేస్తుంది. ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది.

⦿ భద్రతా ఫీచర్లు

Advertisement

భద్రత విషయంలో కూడా ఈ SUVకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి 5-స్టార్ BNCAP సేఫ్టీ రేటింగ్ లభించింది.  ఇందులో 7 ఎయిర్‌ బ్యాగ్‌ లు ఉన్నాయి. లెవెల్-2 ADAS టెక్నాలజీ కూడా అందించారు. లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇవి డ్రైవింగ్‌ ను మరింత సురక్షితంగా మార్చడంలో సాయపడుతాయి.

⦿ ప్రీమియం ఇంటీరియర్

ఇంటీరియర్ డిజైన్ కూడా ప్రీమియంగా కనిపించేలా తయారు చేశారు. ఇందులో 10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌ రూఫ్, ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే 18 లేదంటే 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ వెహికల్ కు మరింత స్టైలిష్ లుక్ ఇస్తాయి.

⦿ ధర గురించి..

Advertisement

ఈ SUV ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.15.99 లక్షల నుంచి రూ.20.01 లక్షల వరకు ఉంటుంది. అయితే, కొన్ని వేరియంట్లు తక్కువ ధరలో కూడా అందుబాటులో ఉంటాయి. కంపెనీ బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) అనే ప్రత్యేక స్కీమ్ ను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా బ్యాటరీని రెంటెల్ పద్ధతిలో ఉపయోగించవచ్చు. దీంతో ప్రారంభ ధర సుమారు రూ. 10.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మొత్తంగా  మారుతి సుజుకి ఇ-విటారా మంచి రేంజ్, అత్యాధునిక ఫీచర్లు, భద్రత, ప్రాక్టికల్ వినియోగాన్ని కోరుకునే వారికి సరైన ఎలక్ట్రిక్ SUVగా చెప్పుకోవచ్చు.

Read Also: కార్ ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×