E-Paper
Advertisement

Maruti Dzire Sales: అమ్మకాల్లో దుమ్మురేపిన మారుతి డిజైర్.. 30 లక్షల సేల్స్ వెనుక సీక్రెట్ ఏంటి?

Maruti Dzire Sales: అమ్మకాల్లో దుమ్మురేపిన మారుతి డిజైర్.. 30 లక్షల సేల్స్ వెనుక సీక్రెట్ ఏంటి?
Advertisement

Maruti Dzire Sales Cross 30 Lakh Mark: భారతీయ ఆటో మార్కెట్ లో డిజైర్ కాంపాక్ట్ సెడాన్ 30 లక్షల అమ్మకాల మార్కును అధిగమించిందని మారుతి సుజుకి వెల్లడించింది. ఈ మోడల్ 2.14 లక్షలకు పైగా యూనిట్లు అమ్మడై, 2025 క్యాలెండర్ ఇయర్ లో అత్యధికంగా అమ్ముడైన కారుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది అత్యంత అరుదైన 30 లక్షల అమ్మకాల మార్క్ ను క్రాస్ చేసింది. ఇంతకీ ఈ కారు అంత ప్రజాదరణ పొందడం వెనుక కారణాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

2008లో మార్కెట్ లోకి అడుగు పెట్టిన డిజైర్  

2008లో మార్కెట్ కు పరిచయం అయిన డిజైర్, వినియోగదారుల అంచనాలకు అనుగుణంగా ఫీచర్లు క్రమంగా జోడిస్తూ, 4 జెనరేషన్స్ గా అభివృద్ధి చెందింది. తాజా వెర్షన్ మరింత అధునాతనమైన సెడాన్ డిజైన్‌ ను పొందింది. యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంది. డిజైర్ కస్టమర్లలో దాదాపు సగం మంది మొదటిసారి కారు కొనుగోలు చేసేవారేనని మారుతి సుజుకి వెల్లడించింది. రూ. 6.25 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో ఈ కారును అందిస్తుంది.

⦿ ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ ఇంజిన్  

Advertisement

డిజైర్ ప్రజాదరణకు ముఖ్యమైన కారణం ఇంజిన్ సామర్థ్యం. ఈ సెడాన్ పెట్రోల్ మాన్యువల్ లో 24.79 కి.మీ/లీ, S-CNG మోడ్‌ లో 33.73 కి.మీ/కేజీ మైలేజీని ఇస్తుంది. మారుతి అత్యంత ఇంధన సామర్థ్యం గల సెడాన్‌ లలో ఒకటిగా కొనసాగుతోంది. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండే భారతీయ వినియోగదారులను మైలేజ్ అనేది బాగా ఆకట్టుకుంటుంది.

⦿ ఫీచర్ అప్‌గ్రేడ్

ఈ కారు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఫీచర్ కంటెంట్ కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుత డిజైర్‌ లో ఎలక్ట్రిక్ సన్‌ రూఫ్, 360 డిగ్రీల HD కెమెరా, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లేతో కూడిన 22.86 సెం.మీ  స్మార్ట్‌ ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లాంటి పరికరాలు ఉన్నాయి. టెక్నాలజీపై అవగాహన ఉన్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, నెక్స్ట్ జెన్ సుజుకి కనెక్ట్ ద్వారా కనెక్టివిటీ మరింత పెంచింది. ఇది స్మార్ట్‌ వాచ్ ఇంటిగ్రేషన్, అలెక్సా వాయిస్ అసిస్టెడ్ ఫంక్షన్లకు సపోర్ట్ చేస్తుంది.

⦿ సేఫ్టీ ఫీచర్లు  

Advertisement

డిజైర్ మార్కెట్ పొజిషనింగ్‌ లో భద్రత మరో కీలక అంశంగా చెప్పుకోవచ్చు. ఈ సెడాన్‌ లో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌ లు, హిల్ హోల్డ్ అసిస్ట్‌ తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, EBD, బ్రేక్ అసిస్ట్‌ తో కూడిన ABS, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌ తో సహా 15కు పైగా భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్ భారత్ NCAP, గ్లోబల్ NCAP రెండింటి నుంచి 5-స్టార్ భద్రతా రేటింగ్‌ను కూడా పొందింది. సామర్థ్యం, ​​ఫీచర్లు, భద్రతల కారణంగా కాంపాక్ట్ సెడాన్ విభాగంలో డిజైర్ తన స్థానాన్ని పదిలంగా నిలుపుకుంది.

Read Also: 6 ఏళ్లలో 7 కొత్త SUVలు, మారుతి సుజుకి ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×