E-Paper
Advertisement

ఒకే రోజులో 108 ఇ-విటారాలు డెలివరీ.. హైదరాబాద్‌లో మారుతి కొత్త రికార్డు!

ఒకే రోజులో 108 ఇ-విటారాలు డెలివరీ.. హైదరాబాద్‌లో మారుతి కొత్త రికార్డు!
Advertisement

Massive e-Vitara Delivery Event In Hyderabad: మారుతి సుజుకి ఇ-విటారా ఎస్‌యూవీ భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మారుతి సుజుకి స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించింది. జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌ లో జరిగిన ఈ ఈవెంట్‌ లో, కంపెనీ ఒకే రోజులో 108 ఇ-విటారా ఎస్‌యూవీలను వినియోగదారులకు అందజేసింది. కంపెనీకి  సంబంధించి హైదరాబాద్  కీలక మార్కెట్ గా కొనసాగుతోంది. ఎలక్ట్రిక్ కార్ల వినియోగం వేగంగా పెరుగుతున్నందున, భవిష్యత్తులో కూడా ఈ సిటీపై మరింత దృష్టి పెట్టాలని మారుతి సుజుకి భావిస్తోంది. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను కస్టమర్లకు అందించడం ఇదే తొలిసారిగా కంపెనీ ప్రకటించింది.

ఎమోషనల్ వర్సటైల్ క్రూయిజర్ కాన్సెప్ట్ తో..

ఇ-విటారా ఎస్‌యూవీని మారుతి సుజుకి కొత్త HEARTECT-e ప్లాట్‌ ఫామ్‌ పై డెవలప్ చేసింది. ఈ వెహికల్ ను ఎమోషనల్ వర్సటైల్ క్రూయిజర్  అనే కాన్సెప్ట్‌ తో రూపొందించారు. దీని ప్రత్యేకతల్లో ముఖ్యమైనది డ్రైవింగ్ రేంజ్. ఒకసారి పూర్తి చార్జ్ చేస్తే ఇది గరిష్టంగా 543 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. సుదూర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. 49 kWh, 61 kWh బ్యాటరీ ప్యాక్‌ లలో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఈ రెండు వేరియంట్లకూ కంపెనీ 8 సంవత్సరాలు లేదంటే 1.6 లక్షల కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారంటీ అందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులకు మరింత నమ్మకం పెరగనుంది.

5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఇ-విటారా   

Advertisement

భద్రత విషయానికొస్తే ఈ కారు మంచి రేటింగ్ సాధించింది. భారత్ NCAP పరీక్షల్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. కుటుంబ ప్రయాణీకులకు ఈ కారు మరింత సేఫ్టీగా ఉంటుంది.

Read Also: ఇక పెట్రోల్ బైక్స్ కనిపించకూడదట.. ఢిల్లీ సర్కారు షాకింగ్ డెసిషన్!

హైదరాబాద్ లో 14.5 శాతం ఈవీల వినియోగం

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో మాట్లాడిన కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ ప్రాముఖ్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోనే అత్యధికంగా సుమారు 14.5 శాతం ఎలక్ట్రిక్ వాహన వినియోగం  భాగ్యనగరంలోనే ఉందని తెలిపారు. అందుకే, ఇలాంటి కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి హైదరాబాద్ సరైన ప్రదేశమని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఒకే రోజులో 108 ఇ-విటారా వాహనాల డెలివరీ ఇవ్వడం ద్వారా మారుతి సుజుకి తన ఈవీ ప్రయాణాన్ని మరింత బలంగా ప్రారంభించింది.  భవిష్యత్తులో కూడా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది.

Read Also: ఈవీలకు నో రోడ్ టాక్స్.. అదిరిపోయే న్యూస్ చెప్పిన ఢిల్లీ సర్కారు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×