E-Paper
Advertisement

రోడ్డెక్కిన ఫస్ట్ E85 కారు.. వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ డెలివరీలు ప్రారంభం!

రోడ్డెక్కిన ఫస్ట్ E85 కారు.. వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ డెలివరీలు ప్రారంభం!
Advertisement

Maruti Suzuki Wagon R Flex Fuel: దేశంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా మరో కీలక అడుగు పడింది. దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ కారుగా గుర్తింపు పొందిన మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. తొలి విడత కార్లను ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) తీసుకుంది. ఇథనాల్ ఆధారిత ఇంధనాల వినియోగాన్ని పెంచి, పెట్రోల్‌పై ఆధారపడటాన్ని తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ కొత్త మోడల్ అనుకూలంగా ఉండనుంది. ఇప్పుడు ఆ దిశగా వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఓ కీలక ముందడుగు వేసింది.

సాధారణ కారులా కనిపించినా కీలక మార్పులు

ఈ కారు సాధారణ వాగన్ ఆర్ ఆధారంగానే రూపొందించినప్పటికీ, ఇంధన వ్యవస్థలో ప్రత్యేక మార్పులు చేశారు. దీని ద్వారా E20 నుంచి E100 వరకు వివిధ స్థాయిల ఇథనాల్ పెట్రోల్ మిశ్రమాలతో చక్కగా నడుస్తుంది. అంటే, పంపులో ఏ మిక్సింగ్ ఇంధనం అందుబాటులో ఉన్నా దానిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటు వాహనదారులకు మరింత ఉపయోగకరంగా మారనుంది. మారుతి సుజుకి ఈ మోడల్‌ ను వాగన్ ఆర్ టాప్ ఎండ్ ZXi+ వేరియంట్ ఆధారంగా అభివృద్ధి చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.7.24 లక్షలుగా నిర్ణయించారు. సాధారణ పెట్రోల్ మోడల్‌ తో పోలిస్తే సుమారు రూ.85 వేల అదనపు ధర ఉంటుంది.

ఇంజిన్ గురించి..

Advertisement

వాగన్ ఆర్ ఫ్లెక్స్ ప్యూయల్ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ను అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 90 బీహెచ్‌పీ శక్తి, 113.7 ఎన్ఎం టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌ కు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్‌ ను యాడ్ చేశారు. ప్రస్తుతం ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ ఎంపికను అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో నగరాల్లో ఆటోమేటిక్ కార్లను ఇష్టపడే కొంతమంది కొనుగోలుదారులు ఈ విషయంలో నిరాశ చెందే అవకాశం ఉంది.

మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం ఫోకస్

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇండియన్ ఆయిల్ సహకారంతో దేశవ్యాప్తంగా E85 ఇంధన స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో E85 ఇంధనం లీటరుకు రూ.82.12 ధరకు అందుబాటులో ఉంది. ఇది సాధారణంగా వినియోగిస్తున్న E20 పెట్రోల్‌ తో పోలిస్తే దాదాపు రూ.20 వరకు తక్కువ ధర కావడం విశేషం. వినియోగదారులు సరైన ఇంధనాన్ని సులభంగా గుర్తించేందుకు E85 పంపులకు ప్రత్యేక గుర్తులు, స్పష్టమైన లేబుల్స్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఇంధనం నింపే సమయంలో గందరగోళం తలెత్తే అవకాశాలు తగ్గుతాయి. దేశంలో బయోఫ్యూయల్ వినియోగాన్ని ప్రోత్సహించడంలో వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి వాహనాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇథనాల్ వినియోగం పెరగడంతో పాటు, ఇంధన దిగుమతుల భారం తగ్గే అవకాశం  కనిపిస్తోంది.

Advertisement

Read Also: జస్ట్ రూ.6.29 లక్షలకే సిట్రోయెన్ eC3X.. BaaS స్కీమ్‌ తో అదిరిపోయే ఆఫర్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×