E-Paper
Advertisement

మీ దగ్గర మారుతి ఇగ్నిస్ ఉందా? వెంటనే సర్వీస్ సెంటర్‌ కు వెళ్లండి భయ్యా!

మీ దగ్గర మారుతి ఇగ్నిస్ ఉందా? వెంటనే సర్వీస్ సెంటర్‌ కు వెళ్లండి భయ్యా!
Advertisement

Maruti Ignis Owners Alert: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. తన పాపులర్  హ్యాచ్‌ బ్యాక్ మోడల్ ఇగ్నిస్‌ ను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. వెనుక పార్కింగ్ సెన్సార్‌ లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ సమస్యతో కొన్నిసార్లు రివర్స్ పార్కింగ్ అలారం సరిగ్గా పని చేయకపోవచ్చని కంపెనీ గుర్తించింది.

ఇగ్నిస్ మోడల్‌ ను నిలిపివేసినప్పటికీ..

ప్రస్తుతం ఇగ్నిస్ మోడల్‌ ను కంపెనీ నిలిపివేసినప్పటికీ, ఇప్పటికే అమ్మిన కొన్ని యూనిట్లలో ఈ లోపం ఉన్నట్లు గుర్తించింది. ప్రభావిత కార్లను రీకాల్ చేస్తోంది. అయితే ఈ సమస్య ఎంతమంది వినియోగదారులను ప్రభావితం చేసిందనే విషయంపై, ఏ టైమ్ లో తయారు చేసిన కార్లు ఇందులో ఉన్నాయనే అంశంపై కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.

Advertisement

మారుతి ఆథరైజ్ డ్ డీలర్‌ షిప్ నుంచి విడుదలైన సర్క్యులర్ ప్రకారం.. “కంట్రోలర్ అసెంబ్లీ, పార్క్ సెన్సార్”లో లోపం ఉండటం వల్ల కొన్ని వాహనాల్లో వెనుక పార్కింగ్ అలారం సరిగా పనిచేయకపోవచ్చని గుర్తించారు. రివర్స్ గేర్‌ లో వాహనాన్ని నడిపేటప్పుడు వెనుక అడ్డంకులను గుర్తించి డ్రైవర్‌ కు హెచ్చరికలు అందించడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి భద్రతా వ్యవస్థలో లోపం ఉండటం వల్ల ప్రమాదాల అవకాశాలు పెరిగే అవకాశం ఉండటంతో కంపెనీ ముందస్తు జాగ్రత్త చర్యగా రీకాల్ చేపట్టింది.

ఫ్రీగా పార్కింగ్ సెన్సార్‌ పార్ట్స్ మార్పిడి!

ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభావితమైన భాగాన్ని పూర్తిగా మార్చాలని మారుతి నిర్ణయించింది. ఇందుకోసం సంబంధిత వాహన యజమానులను కంపెనీ నేరుగా సంప్రదిస్తోంది. సదరు కారు రీకాల్ పరిధిలోకి వస్తే, సమీపంలోని అధీకృత మారుతి సర్వీస్ సెంటర్‌ను సందర్శించాలని వినియోగదారులకు సూచిస్తోంది. ముఖ్యంగా, ఈ స్పేర్ పార్ట్స్ మార్పిడిని పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు  కంపెనీ స్పష్టం చేసింది. వాహన యజమానులు ముందుగా తమ సమీప సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలని సూచించింది. వెహికల్ ను చెక్ చేసి అవసరమైన పార్ట్ ను ఛేంజ్ చేయించుకోవాలన్నది.

Advertisement

కారు రీకాల్‌లు ఆటోమొబైల్ రంగంలో సాధారణమే అయినప్పటికీ, వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు ఇలాంటి చర్యలు చేపడుతుంటాయి. చిన్నపాటి లోపాలను ముందుగానే గుర్తించి సరిదిద్దడం వల్ల భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది.  ఇగ్నిస్ యజమానులు తమ వాహనం రీకాల్ జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడానికి సమీప మారుతి సుజుకి డీలర్‌ను లేదా అధీకృత సర్వీస్ సెంటర్‌ ను సంప్రదించడం మంచిది.

Read Also: స్కార్పియో ఫేస్‌ లిఫ్ట్ To BE 07 EV.. మహీంద్రా నుంచి ఏకంగా 6 కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×