E-Paper
Advertisement

మారుతి ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ To హోండా ZR-V.. జూన్ లో విడుదలయ్యే 5 క్రేజీ SUVలు ఇవే!

మారుతి ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ To హోండా ZR-V.. జూన్ లో విడుదలయ్యే 5 క్రేజీ SUVలు ఇవే!
Advertisement

Upcoming SUVs in India: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో జూన్ నెల కార్ల ప్రియులకు ఆసక్తికరంగా మారనుంది. ఇప్పటికే ఈ ఏడాది పలు కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చినప్పటికీ, వచ్చే నెలలో మరికొన్ని కీలక SUVలు, ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా మారుతి, హ్యుందాయ్, హోండా, స్కోడా లాంటి పాపులర్ బ్రాండ్స్ కొత్త మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు

మారుతి సుజుకి తన తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును జూన్‌ లో పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ మోడల్ ఫ్రాంక్స్, వాగన్‌ ఆర్ ఆధారంగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కారు ఎక్కువ శాతం ఇథనాల్‌ తో నడిచే ఇంజిన్‌ ను కలిగి ఉండనుంది. ప్రస్తుతం ఉన్న మోడల్‌ తో పోలిస్తే ధర రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

⦿ స్కోడా కోడియాక్ RS

Advertisement

స్కోడా తన ప్రీమియం SUV కోడియాక్ RS‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. సుమారు 265 bhp పవర్, 400 Nm టార్క్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ మోడల్‌ ను పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే (CBU) విధానంలో తీసుకురానుండటంతో ధర ఎక్కువగా ఉండనుంది.

⦿ హ్యుందాయ్ ఎలక్ట్రిక్ SUV

హ్యుందాయ్ నుంచి కూడా కొత్త ఎలక్ట్రిక్ SUV వచ్చే నెలలో లాంచ్ కావచ్చని సమాచారం. ఇన్‌ స్టర్ ప్లాట్‌ ఫారమ్ ఆధారంగా రూపొందుతున్న ఈ మోడల్ ఇప్పటికే పలు సందర్భాల్లో టెస్టింగ్‌లో కనిపించింది. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన రేంజ్‌ తో మార్కెట్లోకి రానుంది. దీని ధర రూ.11 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.

⦿ హోండా ZR-V SUV

Advertisement

హోండా కూడా ఇండియన్ మార్కెట్లో కొత్త ZR-V SUVను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మోడల్‌ ను ఇప్పటికే ప్రదర్శించిన కంపెనీ, ధరలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈ SUV ధర సుమారు రూ.40 లక్షల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.

⦿ న్యూ మారుతి బ్రెజ్జా

ఇక మారుతి బ్రెజ్జా కూడా పెద్ద అప్‌ డేట్‌ తో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త పవర్‌ ట్రెయిన్, అండర్‌ బాడీ CNG కిట్, అదనపు ఫీచర్లతో ఈ SUVను అప్‌ డేట్ చేయనున్నట్లు సమాచారం. డిజైన్‌ లో పెద్ద మార్పులు లేకపోయినా, పనితీరు,  ఫీచర్ల పరంగా మరిన్ని అప్ డేట్స్ ఉండే అవకాశం ఉంది.  జూన్ 2026లో భారత ఆటో మార్కెట్లో కొత్త SUVలు, ఎలక్ట్రిక్ వాహనాల హడావిడి కనిపించనుంది. కొత్త టెక్నాలజీ, ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలు, ప్రీమియం మోడళ్లతో వినియోగదారులకు మరిన్ని ఆప్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.

Read Also: హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ వచ్చేస్తోంది, లాంచింగ్ ఎప్పుడంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×