E-Paper
Advertisement

Maruti e Vitara vs Vinfast VF6: మారుతి ఇ విటారా vs విన్‌ఫాస్ట్ VF6.. ఈ రెండు కార్లలో ఏది బెస్ట్ అంటే?

Maruti e Vitara vs Vinfast VF6: మారుతి ఇ విటారా vs విన్‌ఫాస్ట్ VF6.. ఈ రెండు కార్లలో ఏది బెస్ట్ అంటే?
Advertisement

Maruti e Vitara vs VinFast VF6 Comparison: ఇండియన్ మార్కెట్ లోకి సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు అడుగు పెడుతున్నాయి. తాజాగా టాప్ బ్రాండ్ల నుంచి లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు మారుతి ఇ విటారా, విన్‌ఫాస్ట్ VF6. ప్రస్తుతం ఈ రెండు కార్ల మధ్య ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లో గట్టి పోటీ కొనసాగుతోంది. ఇ విటారా మెరుగైన రేంజ్ సుమారు 543 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. VF6 మెరుగైన పర్ఫార్మెన్స్ తో వస్తుంది. ఈ కారు 150kW మోటార్, ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. ఇ విటారా ధర రూ. 15.99 లక్షల నుంచి ప్రారంభం కాగా, VF6 ధర సుమారు రూ.17.29 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు కార్ల మధ్య పోలికలను ఇప్పుడు తెలుసుకుందాం..

మారుతి ఇ విటారా vs విన్‌ఫాస్ట్ VF6 మధ్య పోలికలు

⦿ బ్యాటరీ, రేంజ్: మారుతి ఇ విటారా 49kWh, 61kWh బ్యాటరీ ప్యాక్‌ లతో వస్తుంది. ఇది 543 కి.మీ MIDC రేంజ్‌తో వస్తుంది. విన్‌ ఫాస్ట్ VF6 సుమారు 59.6kWh బ్యాటరీతో వస్తుంది. ఒకే ఛార్జ్ తో ఈ కారు 463 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది.

Advertisement

⦿ పనితీరు: VF6 విండ్ వేరియంట్ 150kW ప్యాక్ వేరియంట్ లో 204 PS పవర్, 310 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇ విటారా 61kWh వేరియంట్ 174hp పవర్ ను అందిస్తుంది.

⦿ పరిమాణం: ఇ విటారా పొడవు 4,275mm, వెడల్పు 1,800mm, ఎత్తు 1,635mm ఉంటుంది. విన్‌ఫాస్ట్ VF6 కొంచెం ఎక్కువ వీల్‌ బేస్, వెడల్పును కలిగి ఉండివిశాలమైన ఇంటీరియర్‌ తో వస్తుంది.

Advertisement

⦿ ఫీచర్లు: VF6లో 12.9-అంగుళాల టచ్‌ స్క్రీన్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వెంటిలేటెడ్ సీట్లు, ADAS ఫీచర్లు ఉన్నాయి. ఇ విటారాలో కూడా ఆధునిక కనెక్టివిటీ, భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

⦿ ధర: మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ SUV ఇ-విటారాను భారత్ లో రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇది  బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ మోడల్‌ లో లభిస్తుంది. అంటే బ్యాటరీ అద్దెకు వస్తుంది. మొత్తం ధర సుమారు రూ. 15.99 లక్షల నుంచి రూ.20.01 లక్షల వరకు ఉంటుంది. విన్‌ ఫాస్ట్ VF6 కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV దేశంలో సుమారు రూ.16.49 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది. ఇది మూడు వేరియంట్లలో  అందుబాటులో ఉంది.

Read Also: ఫిబ్రవరిలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల జోష్, టాప్ లో టీవీఎస్, ఏడో స్థానానికి పడిపోయిన ఓలా!

రెండు కార్లలో ఏది బెస్ట్ అంటే?

ఎక్కువ రేంజ్, సర్వీస్ నెట్‌ వర్క్ కావాలనుకుంటే మారుతి ఇ విటారా బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. మెరుగైన పవర్, ప్రీమియం ఫీచర్లు, బోల్డ్ డిజైన్ కోసం విన్‌ఫాస్ట్ VF6 ను తీసుకోవచ్చు.

Read Also: మహీంద్రా To టాటా.. ఇండియాలో అత్యంత సురక్షిమైన కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×