E-Paper
Advertisement

Tricolour themed Tractors: రిపబ్లిక్ డే స్పెషల్.. మూడు రంగుల్లో మహీంద్రా ట్రాక్టర్లు!

Tricolour themed Tractors: రిపబ్లిక్ డే స్పెషల్.. మూడు రంగుల్లో మహీంద్రా ట్రాక్టర్లు!
Advertisement

మహీంద్రా కంపెనీ ఆలోచనలు ఎప్పుడు క్రియేటివ్ గా ఉంటాయి. తాజాగా ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయం కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకం రంగుల మాదిరిగానే మూడు రంగుల్లో లిమిటెడ్ ఎడిషన్ ట్రాక్టర్లను విడుదల చేసింది. మహీంద్రా యువో టెక్+ 585 DI 4WD ఆధారంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది.   మెటాలిక్ ఆరెంజ్, ఎవరెస్ట్ వైట్, మెటాలిక్ గ్రీన్ రంగుల్లో ఈ ట్రాక్టర్లు ఆకట్టుకుంటున్నాయి. పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్న ట్రాక్టర్లను దేశ రైతులకు, దేశ పురోగతిని నడిపించడంలో వారి పాత్రకు గౌరవంగా తీసుకొచ్చింది.

జనవరి 26 నుంచి అందుబాటులోకి..  

ఇక ఈ పరిమిత ఎడిషన్ మోడల్స్ మహీంద్రా పాపులర్ నెక్ట్స్ జెనరేషన్ ట్రాక్టర్లలో మంచి లుక్ ను అందిస్తున్నాయి. ఈ మూడింటిలో రోప్, జెర్రికన్, మహీంద్రా జెండాతో సహా ప్రత్యేక యాక్సెసరీస్ తో ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రాక్టర్ల ఆవిష్కరణ గురించి మహీంద్రా ట్రాక్టర్స్ మార్కెటింగ్,  నేషనల్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ హెడ్ పరీక్షిత్ ఘోష్ కీలక విషయాలు వెల్లడించారు. త్రివర్ణ నేపథ్య యువో టెక్+ ట్రాక్టర్లు దేశ పురోగతికి ప్రతిబింబంగా తీసుకొచ్చినట్లు వెల్లడించారు. రైతులను మరింత శక్తివంతం చేయడంలో సహకరిస్తాయన్నారు. పరిమిత ఎడిషన్ ట్రాక్టర్లు జనవరి 26 నుంచి దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన మహీంద్రా ట్రాక్టర్స్ డీలర్‌ షిప్‌ లలో అందుబాటులో ఉంటాయన్నారు.

Advertisement

Read Also: కియా To టాటా.. జనవరిలో కార్ల మీద బోలెడు ఆఫర్లు!

ఇక కొత్త ట్రాక్టర్లలో బానెట్ కింద, యువో టెక్+ 585 DI లిమిటెడ్ ఎడిషన్ దాని బలమైన మెకానికల్ ప్యాకేజీని కలిగి ఉంది.  ఇది నాలుగు సిలిండర్ల ఇంజిన్ ద్వారా పవర్ ను తీసుకుంటుంది. 45.4bhp గరిష్ట PTO అవుట్‌ పుట్‌ ను  అందిస్తుంది.  215Nm గరిష్ట టార్క్, 18 శాతం బ్యాకప్ టార్క్‌ తో ఉంటుంది. ఈ సెటప్ ట్రాక్టర్ డిమాండ్ ఉన్న వ్యవసాయ పనులు, సవాళ్లతో కూడిన నేలలో పని చేసేందుకు సాయపడుతుంది.

2 టన్నుల హైడ్రాలిక్ లిఫ్ట్ తో

Advertisement

ఈ ట్రాక్టర్లు 2 టన్నుల హైడ్రాలిక్ లిఫ్ట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. విస్తృత శ్రేణి వ్యవసాయ పనిముట్లకు సపోర్టు చేస్తాయి.  డ్యూయల్ క్లచ్, MSPTO, ఆక్సిలరీ వాల్వ్, 12 ఫార్వర్డ్, 3 రివర్స్ గేర్‌ బాక్స్ లాంటి ఫీచర్లు వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటాయి. పవర్ స్టీరింగ్ తో ఈ ట్రాక్టర్లు వస్తున్నాయి. డ్రైవర్లకు అలసట తగ్గించడంలో ఇవి ఉపయోగపడనున్నాయి.

ఇక 9.5 x 20 అంగుళాల ముందు టైర్లు, 14.9 x 28 అంగుళాల వెనుక టైర్లపై రోలింగ్ చేస్తున్న యువో టెక్+ 585 DI లిమిటెడ్ ఎడిషన్ పొడి, తడి నేలల్లో స్థిరమైన పని చేస్తుంది. ఈ ట్రాక్టర్ల విలక్షణమైన త్రివర్ణ థీమ్, బలమైన పనితీరు ప్యాకేజీతో, మహీంద్రా రిపబ్లిక్ డే స్పెషల్ గా రైతులకు ప్రత్యేకత, సామర్థ్యం, జాతీయతను చాటి చెప్పనున్నాయి. మహీంద్రా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అన్నదాతల నుంచి పాజిటివ్ స్పందన కనిపిస్తోంది.

Read Also: ఇది ప్రపంచంలోనే కాస్లీయెస్ట్ ఎలక్ట్రిక్ కారు, ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×