E-Paper
Advertisement

KTM Warranty: KTM బైక్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్, ఇక డబుల్ వారెంటీ!

KTM Warranty: KTM బైక్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్, ఇక డబుల్ వారెంటీ!
Advertisement

KTM Offers 4-Year Warranty: ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ మోటార్‌ సైకిల్ తయారీ సంస్థ KTM తమ వినియోగదారులకు మెరుగైన సర్వీసులు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యారెంటీ డబుల్ చేస్తున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది. ఈ కంపెనీ విక్రయించే అన్ని రోడ్ లీగల్ మోటార్‌ సైకిళ్లపై ఇప్పుడు నాలుగు సంవత్సరాల ప్రీమియం వారంటీ అందించనుంది. ఈ కొత్త విధానం 2025 మోడల్ సంవత్సరం నుంచి అమల్లోకి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇప్పటి వరకు 2 ఏళ్ల వారెంటీ ఉండగా..   

ఇప్పటి వరకు KTM బైక్‌లకు సాధారణంగా రెండు సంవత్సరాల వారంటీ ఉండేది. తాజాగా కంపెనీ తీసుకున్న నిర్ణయంతో ఇకపై డబుల్ కానుంది. అంటే రెండేళ్లు ఇకపై నాలుగు సంవత్సరాలు కానుంది. ఈ నిర్ణయం KTM బ్రాండ్‌ మీద వినియోగదారుల పెట్టుకున్న నమ్మకాన్ని మరింత బలంగా మార్చనుంది. ఈ వారెంటీతో తమ కంపెనీకి మరింత ఆదరణ దక్కుతుందని భావిస్తోంది.

వారెంటీలో ఏవి కవర్ అవుతాయంటే?

Advertisement

ఈ వారంటీ KTM మోడల్ లైనప్‌ ను పూర్తిగా కవర్ చేస్తుంది. అడ్వెంచర్, డ్యూయల్ స్పోర్ట్, నేకెడ్, సూపర్ స్పోర్ట్, స్పోర్ట్స్ టూరర్, సూపర్‌ మోటో శ్రేణికి చెందిన బైక్‌ లు ఈ వారెంటీని అందుకుంటాయి. 125cc నుంచి 1,350cc వరకు ఉన్న ఇంజిన్ సామర్థ్యంతో ఉన్న మోటార్‌ సైకిళ్లు ఈ వారంటీ పరిధిలోకి వస్తాయి. సింగిల్ సిలిండర్, ట్విన్ సిలిండర్ ఇంజిన్లతో ఉన్న మోడళ్లు రెండూ ఇందులో భాగం కానున్నాయి. అయితే ట్రాక్ ఓన్లీ మోడల్స్, డర్ట్ బైక్స్ ఈ వారెంటీ ప్రోగ్రామ్ లోకవర్ కావని కంపెనీ వెల్లడించింది.

పోర్టబిలిటీకి ఎక్కువ ప్రాధాన్యత

KTM తాజాగా తీసుకొచ్చిన వారంటీ ప్రోగ్రామ్‌లో మరో కీలక అంశం పోర్టబిలిటీ. అంటే, ఈ వారంటీ బైక్‌ కు లింక్ చేయబడుతుంది. యజమానితో సంబంధం ఉండదు. నాలుగు సంవత్సరాల లోపు బైక్ యజమానికి మారితే, మిగిలిన వారంటీ కొత్త యజమానికి కూడా వర్తిస్తుంది. అయితే, పూర్తి వారంటీ బెనిఫిట్స్ పొందాలంటే మాత్రం మొదటి యజమాని కొనుగోలు చేసిన ఆథరైజ్డ్ KTM డీలర్ దగ్గర కంపెనీ సూచించిన సర్వీస్ షెడ్యూల్‌ను తప్పనిసరిగా పాటించాలి. అయితే, ఈ వారెంటీ భారత్ లో కాకుండా కేవలం యూరప్ లోనే అందిస్తుంది. యూరప్‌ లోని వినియోగదారులు సర్వీస్ యాక్టివేటెడ్ రోడ్ సైట్ అడిస్టెన్స్ (SARA) ప్రోగ్రామ్ ద్వారా రోడ్‌సైడ్ సహాయం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఆథరైజ్డ్ డీలర్ దగ్గర ప్రతి సంవత్సరం సర్వీస్ చేయించినప్పుడు ఈ సహాయం మరో 12 నెలల వరకు పొడిగించబడుతుంది.

KTM లక్ష్యంగా ఏంటంటే?

Advertisement

పోటీ ఎక్కువగా ఉన్న బైక్ మార్కెట్ లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడమే KTM లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆటో నిపుణులు చెప్తున్నారు. ప్రత్యేకంగా హై పర్ఫార్మెన్స్ కలిగిన స్ట్రీట్ బైక్‌ లను ఇష్టపడే రైడర్లలో నమ్మకాన్ని పెంచడానికి ఈ డబుల్ వ్యారెంటీ కీలకంగా పని చేయనున్నట్లు వెల్లడించింది.

Read Also:  కవాసకి క్రేజీ ఆఫర్, ఆ బైక్ మీద ఏకంగా రూ. 22,000 తగ్గింపు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×