E-Paper
Advertisement

కియా సోనెట్‌ కు షాక్.. క్రాష్ టెస్టులో మరీ ఇంత ఘోరమా?

కియా సోనెట్‌ కు షాక్.. క్రాష్ టెస్టులో మరీ ఇంత ఘోరమా?
Advertisement

Kia Sonet Global NCAP Crash Test: దేశంలో తయారయ్యే కియా సోనెట్ SUV తాజాగా గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌ లో పాల్గొంది. అయితే, ఈ పరీక్షలో సోనెట్ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. అడల్ట్ ప్యాసింజర్స్ భద్రత విభాగంలో కేవలం 1-స్టార్ రేటింగ్ మాత్రమే పొందగా, పిల్లల భద్రత విభాగంలో 3 స్టార్ రేటింగ్ సాధించింది.

ఈ కారు ఇండియాలో నో సేల్!

తాజాగా క్రాష్ టెస్ట్ చేసిన సోనెట్ భారత మార్కెట్‌ లో అమ్ముతున్న మోడల్ కాదు. దక్షిణాఫ్రికా మార్కెట్ కోసం భారత్ లో తయారు చేసిన వెర్షన్. ఈ మోడల్‌ లో కేవలం రెండు ఎయిర్‌ బ్యాగ్‌లు మాత్రమే ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా స్టాండర్డ్ ఫీచర్‌ గా ఇవ్వలేదు. అయితే, దేశంలో అమ్మే కియా సోనెట్‌ లో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌ లు, ESC స్టాండర్డ్‌ గా అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఈ 1-స్టార్ రేటింగ్‌ ను భారత మోడల్‌ కు నేరుగా అన్వయించలేమని నిపుణులు చెబుతున్నారు.

అడల్ట్ భద్రతలో జస్ట్ 21.29 పాయింట్లు

Advertisement

అడల్ట్ భద్రత పరీక్షలో సోనెట్ 34 పాయింట్లకు గాను 21.29 పాయింట్లు సాధించింది. ఫ్రంటల్ క్రాష్ టెస్ట్‌ లో డ్రైవర్, ముందు ప్రయాణికుడి తల, మెడ ప్రాంతాలకు మంచి రక్షణ లభించినట్లు గ్లోబల్ NCAP తెలిపింది. అయితే ఛాతీ, కాళ్లు, మోకాళ్ల ప్రాంతాల్లో రక్షణ స్థాయి సంతృప్తికరంగా లేదని తెలిపింది. ముఖ్యంగా డ్రైవర్ పాదాలకు రక్షణ బలహీనంగా ఉన్నట్లు గుర్తించింది.  సైడ్ ఇంపాక్ట్ పరీక్షలో తల, నడుము భాగాలకు మంచి రక్షణ లభించినప్పటికీ, ఛాతీ భాగానికి రక్షణ తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. అలాగే కర్టెన్ ఎయిర్‌ బ్యాగ్‌ లు లేకపోవడం వల్ల సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ నిర్వహించలేదు.

గ్లోబల్ NCAP నివేదిక ప్రకారం, సోనెట్‌ లోని ఫుట్‌ వెల్ ప్రాంతం, బాడీషెల్ నిర్మాణం పూర్తిగా స్థిరంగా లేదని తేలింది. ప్రమాద సమయంలో ఇవి మరింత లోడును తట్టుకునే స్థాయిలో లేవని పరీక్షలో వెల్లడైంది. అలాగే డ్రైవర్ సీటుకు మాత్రమే సీట్‌ బెల్ట్ రిమైండర్ ఉండటం కూడా ప్రతికూల అంశంగా గుర్తించారు.

పిల్లల భద్రతలో 28.57 పాయింట్లు

Advertisement

పిల్లల భద్రత విభాగంలో సోనెట్ 49 పాయింట్లకు గాను 28.57 పాయింట్లు సాధించి 3 స్టార్ రేటింగ్ పొందింది. 18 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం ఉపయోగించే డమ్మీలతో నిర్వహించిన పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయి. అయితే వెనుక మధ్య సీటులో ల్యాప్ బెల్ట్ మాత్రమే ఉండటం, అలాగే కొన్ని అదనపు భద్రతా సదుపాయాలు లేకపోవడం వల్ల పాయింట్లు కోల్పోయింది.

కియా సోనెట్‌ కు పోటీ కార్లు ఇవే!

భారత మార్కెట్లో కియా సోనెట్‌కు టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO, హ్యుందాయ్ వెన్యూ, స్కోడా కైలాక్, నిస్సాన్ మాగ్నైట్ వంటి SUVలు పోటీగా ఉన్నాయి. వీటిలో టాటా నెక్సాన్, నిస్సాన్ మాగ్నైట్ గ్లోబల్ NCAPలో 5-స్టార్ రేటింగ్ సాధించాయి. భారత్ NCAP పరీక్షల్లో XUV 3XO, వెన్యూ, సైరోస్, కైలాక్ కూడా 5 స్టార్ భద్రతా రేటింగ్ పొందాయి. భారత మార్కెట్లో అమ్ముతున్న కియా సోనెట్‌ లో అదనపు భద్రతా ఫీచర్లు ఉండటంతో, ఈ గ్లోబల్ NCAP ఫలితాలను నేరుగా భారత మోడల్‌ తో పోల్చడం సరైనది కాదని ఆటో నిపుణులు చెప్తున్నారు.

Read Also: కొత్త టాటా టియాగో కొనాలా? లేక టాటా పంచ్ బెటరా? ఏ కారులో ఏంటి ప్రత్యేకత?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×