E-Paper
Advertisement

కియా సెల్టోస్ vs రెనాల్ట్ డస్టర్.. ఏసీలో ఏ SUV బెటర్?

కియా సెల్టోస్ vs రెనాల్ట్ డస్టర్.. ఏసీలో ఏ SUV బెటర్?
Advertisement

Kia Seltos vs Renault Duster: వర్షాకాలం ప్రారంభం అయినా, ఎండలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇంచుమించు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్లలోని ఏసీ పనితీరు గురించి చాలా మంది కంపారిజన్ చేస్తున్నారు. మిడ్‌ సైజ్ SUV సెగ్మెంట్‌ లో మంచి ఆదరణ పొందుతున్న కియా సెల్టోస్, రెనాల్ట్ డస్టర్ మోడళ్ల ఏసీ సామర్థ్యాన్ని ఇప్పుడు మనం పోల్చే ప్రయత్నం చేద్దాం..

ఎలా టెస్ట్ చేశారంటే?

ఈ పరీక్షలో రెండు వాహనాలను రెండు గంటల పాటు నేరుగా ఎండలో పార్క్ చేశారు. విండోస్ పూర్తిగా మూసివేసి, కార్లలో వేడి గరిష్ట స్థాయికి చేరిన తర్వాత ఏసీని ఆన్ చేసి కూలింగ్ పనితీరును పరిశీలించారు. పరీక్ష సమయంలో బయట ఉష్ణోగ్రత 42.2 డిగ్రీల సెల్సియస్‌ గా ఉంది.

సెల్టోస్ ఏసీ గురించి..

Advertisement

కియా సెల్టోస్‌లో పరీక్ష ప్రారంభమైనప్పుడు ముందు సీటు దగ్గర ఉష్ణోగ్రత 50 డిగ్రీలు, వెనుక సీటు వద్ద 47.7 డిగ్రీలు నమోదయ్యాయి. ఏసీ ఆన్ చేసిన ఒక నిమిషంలోనే ముందు భాగం ఉష్ణోగ్రత 40.7 డిగ్రీలకు, వెనుక భాగం 39.7 డిగ్రీలకు తగ్గింది. ఐదు నిమిషాల డ్రైవింగ్ తర్వాత ముందు భాగం 31.5 డిగ్రీలకు, వెనుక భాగం 29.7 డిగ్రీలకు చేరింది. 15 నిమిషాల ప్రయాణం పూర్తయ్యే సమయానికి ముందు సీటు వద్ద ఉష్ణోగ్రత 29.7 డిగ్రీలు, వెనుక భాగంలో 29 డిగ్రీలు నమోదయ్యాయి. అంటే, కారు మొత్తం దాదాపు సమానంగా చల్లబడినట్లు పరీక్షలో తేలింది. ముఖ్యంగా వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికులకు కూడా మంచి కూలింగ్ లభించింది.

రెనాల్ట్ డస్టర్ గురించి..

ఇక రెనాల్ట్ డస్టర్ విషయానికి వస్తే, పరీక్ష ప్రారంభంలో ముందు భాగంలో 51.2 డిగ్రీలు, వెనుక భాగంలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఒక నిమిషం తర్వాత అవి వరుసగా 45.5 డిగ్రీలు, 44.5 డిగ్రీలకు తగ్గాయి. సెల్టోస్‌తో పోలిస్తే మొదటి దశలో డస్టర్ కూలింగ్ కొంచెం నెమ్మదిగా ఉన్నట్లు కనిపించింది.

Advertisement

కారు, ప్రయాణాన్ని మొదలుపెట్టిన తర్వాత డస్టర్ ఏసీ పనితీరు మెరుగుపడింది. ఐదు నిమిషాల డ్రైవింగ్ తర్వాత ముందు, వెనుక భాగాల్లో ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలుగా నమోదైంది. 15 నిమిషాల తర్వాత ముందు భాగం 30.5 డిగ్రీలకు, వెనుక భాగం 31 డిగ్రీలకు చేరుకుంది. డస్టర్‌ లో ప్రత్యేకత ఏమిటంటే, ముందు మరియు వెనుక సీట్ల మధ్య ఉష్ణోగ్రత తేడా చాలా తక్కువగా ఉండటం. దీంతో మొత్తం క్యాబిన్ సమానంగా చల్లబడిన అనుభూతి లభించింది. అయితే, కూలింగ్ వేగం విషయంలో సెల్టోస్ కాస్త ముందుంది.

ఈ టెస్టింగ్ లో రెండు SUVలు కూడా వేసవి ఎండలను తట్టుకునే మంచి ఏసీ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. కానీ, ప్రారంభంలో వేగంగా క్యాబిన్‌ ను చల్లబరచడంలో కియా సెల్టోస్ కొద్దిగా ముందుంది. మరోవైపు రెనాల్ట్ డస్టర్ మొత్తం క్యాబిన్‌ను సమానంగా చల్లబరచడంలో మంచి పనితీరు కనబరిచింది.

Read Also: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×