E-Paper
Advertisement

కియా కేరెన్స్ క్లావిస్ వచ్చేసింది, ధర జస్ట్ రూ. 12 లక్షలే!

కియా కేరెన్స్ క్లావిస్ వచ్చేసింది, ధర జస్ట్ రూ. 12 లక్షలే!
Advertisement

కియా ఇండియా కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఎలక్ట్రిక్ కారు కేరెన్స్ క్లావిస్ EV కోసం బ్యాటరీ యాస్ ఏ సర్వీస్(BaaS) ఫైనాన్స్ ప్రోగ్రామ్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా కస్టమర్లు వెహికల్ కొనుగోలు ఖర్చును భారీగా తగ్గించుకునే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా EV కొనాలనుకునే ఈ స్కీమ్ మరింత ఉపయోగపడనుంది. అంతేకాదు, ఈ కొత్త మోడల్‌ లో వెహికల్ ధరను రెండు భాగాలుగా విభజిస్తారు. ఒకటి కారు బాడీ ఖర్చు కాగా, మరొకటి బ్యాటరీ ఖర్చు. దీని వల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. వాహనం బాడీకి మాత్రమే లోన్ తీసుకుని, బ్యాటరీకి వేరు చెల్లింపు చేసే అవకాశం ఉంటుంది.

రూ. 12.84 లక్షల ప్రారంభం ధరతో..

Advertisement

ఈ స్కీమ్ కింద కేరెన్స్ క్లావిస్ EV ధరలు రూ. 12.84 లక్షల నుండి ప్రారంభమవుతున్నాయి. డౌన్ పేమెంట్ కూడా తక్కువగా ఉండేలా ప్లాన్ రూపొందించారు. స్టాండర్డ్ వేరియంట్‌ కు దాదాపు రూ. 51,520 నుంచి డౌన్ పేమెంట్ ప్రారంభమవుతుంది. ఎక్స్‌ టెండెడ్ వేరియంట్‌ లో కొంచెం ఎక్కువగా ఉంటుంది . ఈ BaaS మోడల్‌ లో వినియోగదారులు ప్రతి కిలోమీటర్‌ కు సుమారు రూ.3.3 చొప్పున బ్యాటరీ ఛార్జ్ చెల్లించాలి. అంటే, ఎంత ప్రయాణిస్తే అంతే చెల్లించాల్సిన విధంగా ఈ స్కీమ్ తీసుకొచ్చారు. సాధారణంగా ఫ్యూయల్ ఖర్చుతో పోల్చితే మరింత  తక్కువ ధరలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

ఇక ఫైనాన్స్ భాగస్వాములుగా ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్‌ సర్వ్ లాంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీల సహకారంతో కస్టమర్లకు ఈజీగా డ్యూయల్ లోన్ సిస్టమ్ అందిచనున్నారు. ఇందులో వాహనం బాడీకి ఒక లోన్, బ్యాటరీకి మరో లోన్ ఉంటుంది. ఈ లోన్  పీరియడ్ కూడా వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. కార్ బాడీ లోన్ గరిష్టంగా 60 నెలల వరకు, బ్యాటరీ చెల్లింపులు 96 నెలల వరకు కొనసాగుతాయి. దీని వల్ల నెలవారీ ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది.

దేశ వ్యాప్తంగా 15,000కి పైగా ఛార్జింగ్ పాయింట్లు

Advertisement

ఇక కియా MyKia యాప్‌లో K ఛార్జ్ అనే ప్లాట్‌ ఫారమ్‌ ను కూడా అందిస్తోంది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా 15,000కి పైగా ఛార్జింగ్ పాయింట్లను యూజర్లు ఉపయోగించుకోవచ్చు. రూట్ ప్లానింగ్, రియల్ టైమ్ ఛార్జర్ లభ్యత లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 267కు పైగా EV రెడీ వర్క్‌ షాప్‌లు, అలాగే 100కి పైగా డీలర్‌ షిప్‌ లలో DC ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. EV వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. కియా తీసుకొచ్చిన BaaS ప్రోగ్రామ్ భారత EV మార్కెట్‌ లో కొత్త ఊపును తీసుకురానుంది. తక్కువ ప్రారంభ ఖర్చు, కిలోమీటర్ ఆధారిత చెల్లింపు విధానం, మంచి ఛార్జింగ్ నెట్‌ వర్క్‌ తో వినియోగదారులను మరింత ఆకర్షించే అవకాశం కనిపిస్తోంది.

Read Also: టాటా SUVలపై బంపర్ ఆఫర్లు.. హారియర్, సఫారీ మరీ ఇంత చౌకా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×