E-Paper
Advertisement

20 ఏళ్ల తర్వాత కవాసకి సంచలనం.. కొత్త టూ-స్ట్రోక్ బైక్ విడుదల!

20 ఏళ్ల తర్వాత కవాసకి సంచలనం.. కొత్త టూ-స్ట్రోక్ బైక్ విడుదల!
Advertisement

Kawasaki Two Stroke Motorcycles: టూ స్ట్రోక్ మోటార్‌ సైకిళ్ల కాలం చెల్లిందని భావిస్తున్న సమయంలో కవాసకి సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత పూర్తిగా కొత్త టూ స్ట్రోక్ మోటార్‌ సైకిల్‌ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త సిరీస్ లో భాగంగా KX327, KX327X రెండు మోడళ్లను తీసుకొచ్చింది. వీటిని మోటోక్రాస్, క్రాస్ కంట్రీ రైడింగ్‌ ను దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు.

327 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో..

ఈ రెండు బైక్‌ లలో 327 సీసీ సామర్థ్యం కలిగిన సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ టూ స్ట్రోక్ ఇంజిన్‌ ను ఉపయోగించారు. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో వచ్చింది. కవాసకి చరిత్రలో ఫ్యూయల్ ఇంజెక్టెడ్ టూ స్ట్రోక్ ఇంజిన్‌ తో వచ్చిన తొలి మోడల్ ఇదే కావడం మరో ప్రత్యేకత. సాధారణంగా టూ స్ట్రోక్ బైక్‌ లలో కార్బ్యురేటర్ వ్యవస్థ ఉండేది. అయితే, కొత్త KX327 సిరీస్‌ లో ఫ్యూయల్ ఇంజెక్షన్ ఉండటంతో ఇంధన సరఫరా మరింత ఈజీగా జరుగుతుంది. వెదర్ ఛేంజెస్, ఎత్తైన ప్రాంతాలు,  ఉష్ణోగ్రతల్లో తేడాలు ఉన్నా ఇంజిన్ పని తీరులో ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిచేలా సాయపడుతుంది. ఇందులో ఆయిల్ ఇంజెక్షన్ వ్యవస్థను ఇవ్వలేదు. అందువల్ల రైడర్లు ముందుగానే పెట్రోల్‌ తో పాటు ఆయిల్‌ను కలిపి ఉపయోగించాల్సి ఉంటుంది.

ట్రాన్స్ మిషన్స్ గురించి..

Advertisement

ట్రాన్స్‌ మిషన్ విషయానికి వస్తే రెండు మోడళ్ల మధ్య తేడా ఉంది. KX327Xలో 6 స్పీడ్ గేర్‌ బాక్స్ ఉండగా, KX327లో 5-స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను అందించారు. క్రాస్ కంట్రీ రైడింగ్‌ కు అనుకూలంగా KX327Xను రూపొందించగా, KX327ను ట్రాక్ వినియోగం కోసం తయారు చేశారు. ఇంజిన్ పనితీరును మరింత మెరుగుపరచేందుకు కొత్త ఎగ్జాస్ట్ వాల్వ్ సిస్టమ్‌ ను కూడా కవాసకి అందించింది. దీంతో థ్రాటిల్ రెస్పాన్స్ వేగంగా ఉండటంతో పాటు పవర్ డెలివరీ కూడా మరింత మెరుగవుతోంది.

ఈ బైక్‌ల ఫ్రేమ్ KX450F మోడల్ ఆధారంగా తయారైన అల్యూమినియం పెరిమీటర్ డిజైన్‌ ను ఉపయోగిస్తుంది. ఇది బైక్‌ కు తక్కువ బరువుతో పాటు మంచి హ్యాండ్లింగ్‌ ను అందిస్తుంది. KX327X బరువు సుమారు 106 కిలోలు మాత్రమే ఉండటంతో పోటీ మోడళ్లతో పోలిస్తే పెద్ద తేడా కనిపించదు.

అత్యాధునిక ఫీచర్లు

Advertisement

ఫీచర్ల పరంగా కూడా ఈ బైక్‌లు ఆకట్టుకుంటాయి. హ్యాండిల్‌ బార్‌ పై మ్యాప్ స్విచ్‌ ను అందించారు. దీని ద్వారా రెండు ECU మోడ్‌ ల మధ్య ఎంపిక చేసుకోవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ ను రైడాలజీ యాప్‌ తో కనెక్ట్ చేసి బైక్ సమాచారం, రైడ్ డేటా,  మెయింటెనెన్స్ వివరాలను చూడవచ్చు.

ధర ఎంత అంటే?

ధర విషయానికి వస్తే KX327 ధర 9,099 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. KX327X ధర 9,699 డాలర్లుగా నిర్ణయించారు. KTM, హస్క్‌ వర్ణా, ఇతర పోటీ టూ స్ట్రోక్ మోడళ్లతో పోలిస్తే ఈ ధర పోటీదారులకు సవాల్ విసరనుంది.

Read Also: ఈ కారు హెడ్‌ లైట్లు సినిమా చూపించేస్తాయ్.. వామ్మో.. ఇదేం టెక్నాలజీ భయ్యా!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×