E-Paper
Advertisement

జియో కార్‌ సింక్‌ వచ్చేసింది.. ఇక కారులో వైర్ల గజిబిజికి చెక్!

జియో కార్‌ సింక్‌ వచ్చేసింది.. ఇక కారులో వైర్ల గజిబిజికి చెక్!
Advertisement

Jio Launches JioCarSync: కారు వినియోగదారులకు జియో గుడ్ న్యూస్ చెప్పింది. జియో కార్ సింక్  పేరుతో కొత్త వైర్‌ లెస్ అడాప్టర్‌ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కారులో ప్రతి సారి ఫోన్‌ ను USB కేబుల్‌ తో కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ పరికరాన్ని రూపొందించింది. ప్రస్తుతం చాలా కార్లలో వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో,  ఆపిల్ కార్‌ ప్లే సిస్టమ్ మాత్రమే ఉంటుంది. కానీ, ఈ చిన్న డివైస్ సాయంతో అదే సిస్టమ్‌ ను వైర్‌ లెస్‌ గా మార్చుకోవచ్చు.

కారు స్టార్ట్ కాగానే ఆటోమేటిక్ కనెక్ట్

జియో కార్‌ సింక్ ఈజీగా ఉపయోగించుకునేలా ఉంటుంది. ఒకసారి ఫోన్‌ ను సెటప్ చేసి పెయిర్ చేస్తే, తర్వాత కారును స్టార్ట్ చేసిన కొన్ని సెకన్లలోనే ఆటోమేటిక్‌ గా కనెక్ట్ అవుతుంది. ప్రతిసారి ఫోన్ తీసి కేబుల్ పెట్టాల్సిన అవసరం ఉండదు. డ్రైవింగ్ మొదలు పెట్టే ముందు సమయం వృథా కాకుండా ఉపయోగపడుతుంది. ఈ డివైజ్  చిన్న సైజులో ఉండటం వల్ల కారులో ఎక్కువ స్థలం కూడా ఆక్రమించదు. జేబులో పెట్టుకునేంత కాంపాక్ట్‌ గా ఉంటుంది. USB టైప్ A, USB టైప్ C పోర్ట్ ఉన్న కార్లలో కూడా పనిచేస్తుంది. అందుకే, పాత మోడల్ కార్లు నుంచి కొత్త కార్ల వరకు  సూటవుతుంది. టైప్ C డాంగిల్ కూడా బాక్స్‌ లో అందిస్తున్నారు.

వేగవంతమైన కనెక్టివిటీ

Advertisement

పనితీరు పరంగా కూడా జియో కార్‌ సింక్ వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుందని జియో వెల్లడించింది.  ఇందులో బ్లూటూత్ 5.3, 5GHz Wi-Fi టెక్నాలజీని ఉపయోగించారు. మ్యాప్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్, ఫోన్ కాల్స్ లాంటి ఫీచర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా లేకుండా పని చేస్తాయి. ప్రయాణ సమయంలో కనెక్షన్ డ్రాప్ సమస్యలు తక్కువగా ఉండేలా రూపొందించారు. కారులో ఇప్పటికే ఉన్న కంట్రోల్స్ అన్నీ అలాగే పని చేస్తాయి. స్టీరింగ్ వీల్ బటన్లు, టచ్‌ స్క్రీన్, ఇన్‌ బిల్ట్ మైక్రోఫోన్ లాంటి ఫీచర్లను మళ్లీ కొత్తగా సెటప్ చేయాల్సిన అవసరం లేదు. వినియోగదారులు ముందుగా ఎలా ఉపయోగించారో అలాగే కొనసాగించవచ్చు. ఈ కొత్త సిస్టమ్ గురించి కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా సులభంగా ఉపయోగించుకునేలా ఉంటుంది.

ధర ఎంత అంటే?

జియో కార్‌ సింక్ ప్రారంభ ధర రూ. 2,399గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇది అమెజాన్ లో అందుబాటులో ఉంది. అలాగే, ఈ డివైస్‌కు ఒక సంవత్సరం వారంటీ కూడా ఇస్తున్నారు. దీంతో కొనుగోలుదారులకు మరింత నమ్మకం కలగనుంది. ఇప్పటికే వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే ఉన్న కార్లను తక్కువ ఖర్చుతో వైర్‌ లెస్‌ గా మార్చుకోవాలనుకునేవారికి జియో కార్‌ సింక్ మంచి ఎంపికగా కనిపిస్తోంది. ఖరీదైన కొత్త ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్ కొనాల్సిన అవసరం లేకుండా, ఈజీగా ఆధునిక వైర్‌ లెస్ ఎక్స్ పీరియెన్స్ ను పొందే అవకాశం కల్పిస్తోంది.

Advertisement

Read Also: స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ ఇంజిన్‌.. భారత మార్కెట్ లోకి హోండా ZR-V వచ్చేస్తోంది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×