E-Paper
Advertisement

100 మందికి ఫ్రీగా రాంగ్లర్ కార్లు.. ఫిఫా వరల్డ్ కప్ వేళ జీప్ సంచలన ప్రకటన!

100 మందికి ఫ్రీగా రాంగ్లర్ కార్లు.. ఫిఫా వరల్డ్ కప్ వేళ జీప్ సంచలన ప్రకటన!
Advertisement

Jeep Viral FIFA World Cup Offer: ఫిఫా వరల్డ్ కప్ 2026పై ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌ బాల్ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ జీప్ క్రేజీ ఆఫర్ ప్రకటించింది. 100 మందికి సరికొత్త జీప్ రాంగ్లర్ ఎస్‌యూవీలను ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. అయితే, ఇందుకో కండీషన్ పెట్టింది. అదేంటంటే..

ఫ్రీ కారు పొందాలంటే ఎలా?

ఈ ఆఫర్‌ కు జీప్ కంపెనీ ఒక ఆసక్తికరమైన షరతు పెట్టింది. ఫిఫా వరల్డ్ కప్‌ లో అమెరికా జట్టు విజయం సాధించాలి. అంతేకాదు, ఫ్రీగా జీప్ రాంగ్లర్ పొందాలనుకునే వ్యక్తుల పేరు జార్జ్ వాషింగ్టన్  అయి ఉండాలి. వారు అమెరికా పౌరులు కావాలి. కంపెనీ వెబ్‌ సైట్‌ లో మొదటగా నమోదు చేసుకునే అలాంటి 100 మంది మాత్రమే ఈ ఆఫర్‌ కు అర్హులు అవుతారు. ఈ అనౌన్స్ మెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది ఈ ఆఫర్ గురించి చర్చించడంతో పాటు జీప్ రాంగ్లర్ ధర, ఫీచర్ల గురించి కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

జీప్ రాంగ్లర్ గురించి..

Advertisement

జీప్ రాంగ్లర్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఆఫ్-రోడర్ ఎస్‌యూవీలలో ఒకటి. కఠినమైన రోడ్లు, కొండ ప్రాంతాలు, బురద మార్గాల్లో కూడా సులభంగా ప్రయాణించేందుకు ఈ వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. అడ్వెంచర్ ప్రయాణాలను ఇష్టపడే వారికి ఇది మంచి ఆప్షన్ గా భావిస్తారు. ఈ ఎస్‌యూవీలో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ను అందించారు. ఈ ఇంజిన్ 270 బీహెచ్‌పీ పవర్, 400 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.  ఇందులో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో పాటు జీప్‌కు ప్రత్యేకమైన 4×4 రాక్ ట్రాక్ సిస్టమ్‌ను  కూడా అందించారు. ఎలాంటి కఠినమైన రహదారులపైనా సులభంగా ప్రయాణిస్తుంది.

ఫీచర్ల గురించి..

ఫీచర్ల విషయానికి వస్తే, జీప్ రాంగ్లర్‌లో 12.3 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, వాషబుల్ ఇంటీరియర్, రిమూవబుల్ డోర్లు, రిమూవబుల్ రూఫ్ లాంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఆఫ్ రోడింగ్ ఎక్స్ పీరియెన్స్ ను మరింత క్రేజీగా మార్చుతాయి.  భద్రత విషయంలో కూడా ఈ ఎస్‌యూవీ ఏమాత్రం రాజీపడలేదు. ఇందులో ADAS, ఆరు ఎయిర్‌ బ్యాగ్‌ లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అత్యాధునిక భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లో జీప్ రాంగ్లర్ రెండు ప్రధాన వేరియంట్లలో సేల్ అవుతోంది. ఒకటి అన్‌లిమిటెడ్, రెండు రుబికాన్. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్‌ షో రూమ్ ధర రూ.67.65 లక్షలు. టాప్ వేరియంట్ ధర రూ.71.65 లక్షల వరకు ఉంటుంది. జీప్ కంపెనీ ఈ వాహనాన్ని భారత్‌లోనే అసెంబుల్ చేస్తోంది. అందువల్ల విదేశీ మార్కెట్లతో పోలిస్తే దీని ధర కొంత వరకు అందుబాటులో ఉంది.

Advertisement

Read Also: ఆండ్రాయిడ్ ఆటోలో గూగుల్ జెమిని.. డ్రైవింగ్‌ ను ఈజీ చేసే ఈ 5 స్మార్ట్ ఫీచర్ల గురించి మీకు తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×