E-Paper
Advertisement

E20 పెట్రోల్ తో పాత వాహనాలకు డేంజరా? అసలు నిజం ఏంటి?

E20 పెట్రోల్ తో పాత వాహనాలకు డేంజరా? అసలు నిజం ఏంటి?
Advertisement

E20 Fuel Impact on Old Vehicles: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గత కొద్ది రోజులుగా E-20 ఫ్యూయెల్ గురించి బాగా చర్చ జరుగుతోంది. ఈ పెట్రోల్ కారణంగా 2023కు ముందు తయారైన బైక్‌లు, కార్లకు ప్రమాదం జరుగుతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. హైదరాబాద్‌లో త్వరలో E-20 పెట్రోల్ అంటే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ అందుబాటులోకి వస్తుందని, పాత వాహనాలకు ఈ ఫ్యూయెల్ ప్రమాకరంగా మారబోతుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ వార్తల్లో వాస్తవం ఎంత? నిజంగానే E-20 పెట్రోల్ పాత వాహనాలకు డ్యామేజ్ చేస్తుందా? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇంతకీ E-20 పెట్రోల్ అంటే ఏంటి?

ప్రస్తుతం వాడుతున్న పెట్రోల్ లో ఇథనాల్ 10 శాతం ఉంటుంది. కానీ, కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను మిక్స్ చేయబోతున్నారు. అదే సమయంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారాన్ని తగ్గించడానికి ఈ ఇథనాల్ మిశ్రమాన్ని పెంచబోతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో E-10 అమల్లో ఉండగా, ఇప్పుడు దాన్ని E-20గా పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పాత వాహనాలకు ప్రమాదమా?

Advertisement

E-20 పెట్రోల్ పాత వాహనాలకు ప్రమాదకరమా? అంటే.. కాదనే చెప్పుకోవచ్చు. కానీ, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 2023కు ముందు తయారైన వాహనాల్లో ఫ్యూయల్ పైపులు, రబ్బర్ భాగాలు, ప్లాస్టిక్ కంపోనెంట్లు E-20కు పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇథనాల్‌ కు కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్నాయి. అది తేమను ఎక్కువగా తీసుకుంటుంది. అలాగే కొన్ని రబ్బర్, ప్లాస్టిక్ భాగాలను నెమ్మదిగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది.

నిపుణులు ఏం చెప్తున్నారంటే?

ఈ నేపథ్యంలో ఆటో నిపుణులు కొన్ని కీలక సూచలను చేస్తున్నారు. ముఖ్యంగా పాత వాహనాల యజమానులు, ఫ్యూయల్ పైపులు, సీల్స్ లాంటి భాగాలను E-20కి అనుకూలంగా మార్చించుకోవడం మంచిది. అలాగే, ఫ్యూయల్ ఫిల్టర్‌ ను టైమ్ టు టైమ్ మార్చడం మంచిది. ఇథనాల్ వల్ల ట్యాంక్‌ లోని మలినాలు కదిలే అవకాశం ఉండటంతో, ఫిల్టర్ క్లాగ్ కావచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ట్యాంక్‌ లో కంప్లీట్ ఖాళీ అయ్యేంత వరకు ఉంచకూడదు. ట్యాంక్ ఖాళీగా ఉంటే, తేమ ఎక్కువగా చేరి ఇంధన నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కనీసం హాఫ్ ట్యాంక్ వరకు ఫ్యూయెల్ ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ అసలు నిజం!

Advertisement

E-20 పెట్రోల్ తో ఏప్రిల్ 1 నుంచి పాత వాహనాలు పనికిరావు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ప్రభుత్వం ఒక్కసారిగా మార్పులు చేయదు. దశలవారీగా అమలు చేస్తుంది. అలాగే చాలా వాహనాలు చిన్న మార్పులతోనే E-20ని హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా E-20 పెట్రోల్ పాత వాహనాలపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ సరైన మెయింటెనెన్స్, చిన్న మార్పులతో ఈ సమస్యను సులభంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. సో, పాత వాహనదారులు భయపడాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.

Read Also:  కూలెంట్ తగ్గి ఏసీ పని చేయట్లేదా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×