E-Paper
Advertisement

సీఎన్జీ వాడితే నిజంగా మనీ సేవ్ అవుతుందా? ఇదీ అసలు కథ!

సీఎన్జీ వాడితే నిజంగా మనీ సేవ్ అవుతుందా? ఇదీ అసలు కథ!
Advertisement

Hidden Costs of CNG Cars: సీఎన్జీ కార్ల వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఎక్కువ మంది ఈ కార్లను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. బయటికి చూస్తే సీఎన్జీ కచ్చితంగా తక్కువ ఖర్చుతో నడిచే ఇంధనంగా కనిపిస్తుంది. సాధారణంగా ఇది పెట్రోల్‌తో పోలిస్తే 40 నుంచి 50 శాతం వరకు ఖర్చును తగ్గిస్తుంది. కానీ, వాస్తవానికి ప్రతి ఒక్కరికీ  అంతగా లాభం కలిగించకపోవచ్చు. ఎందుకంటే..

ఎక్కువగా వాడే వారికి మాత్రమే ఉపయోగం!

రోజూ ఎంత డ్రైవ్ చేస్తారు అనేది చాలా ముఖ్యం. రోజూ ఎక్కువగా వాడే వారికి మాత్రమే సీఎన్జీ ప్రయోజనం కలిగిస్తుంది. నెలకు 1000 నుంచి 1200 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ ప్రయాణిస్తే, కచ్చితంగా ఇంధన ఖర్చులో మంచి ఆదా పొందే అవకాశం ఉంటుంది. ఐదు సంవత్సరాల కాలంలో చూస్తే, సంవత్సరానికి 15,000 కిలోమీటర్లు నడిపే వ్యక్తి లక్షల రూపాయలు ఆదా చేసే అవకాశం ఉంటుంది. అందుకే, సిటీలో ఎక్కువగా తిరిగే వారు సీఎన్జీ సెలెక్ట్ చేసుకుంటారు.

కొనుగోలు సమయంలో అదనపు ఖర్చు

Advertisement

సీఎన్జీ  కారు కొనుగోలు సమయంలోనే కొంత ఎక్కువ ఖర్చు ఉంటుంది. సాధారణంగా CNG కార్లు పెట్రోల్ మోడళ్ల కంటే రూ.80,000 నుంచి రూ.1 లక్ష వరకు ఎక్కువగా ఉంటాయి. అంటే, కొనుగోలు సమయంలో పెట్టిన అదనపు డబ్బును తిరిగి సేవ్ చేసుకునేందుకు కొంత సమయం పడుతుంది.

మెయింటెనెన్స్ ఖర్చు గురించి..

నిర్వహణ ఖర్చు విషయానికి వస్తే, చాలా మంది ఇది తక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ, అందులో నిజం లేదు. CNG ఇంజిన్ ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర పనిచేస్తుంది. కొన్ని భాగాలు త్వరగా పాడవుతాయి. స్పార్క్ ప్లగ్స్, ఫిల్టర్లు లాంటి వాటిని తరచూ మార్చాల్సి ఉంటుంది. అలాగే, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సిలిండర్ పరీక్ష చేయించాలి. ఈ పరీక్షకు కూడా కొంత ఖర్చు అవుతుంది.

తక్కువ  బూట్ స్పేస్

Advertisement

ఇంకో ముఖ్యమైన విషయం బూట్ స్పేస్. సీఎన్జీ సిలిండర్ వల్ల కారు వెనుక భాగంలో సామాను పెట్టే స్థలం తగ్గిపోతుంది. ఫ్యామిలీ ట్రిప్స్, లాంగ్ డ్రైవ్స్ చేసే వారికి అసౌకర్యంగా అనిపిస్తుంది. అదనంగా, ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

పర్ఫార్మెన్స్ విషయంలోనూ కాస్త తేడా

పర్ఫార్మెన్స్ విషయంలో కూడా కొంత తేడా ఉంటుంది. పెట్రోల్ కార్లతో పోలిస్తే సీఎన్జీ కార్లలో పవర్ 10 నుంచి 15 శాతం వరకు తక్కువగా ఉంటుంది. ఓవర్‌ టేక్ చేయాల్సినప్పుడు, AC ఆన్‌లో ఉన్నప్పుడు ఈ విషయం తెలుస్తుంది. అలాగే సీఎన్జీ స్టేషన్లు అన్ని చోట్ల అందుబాటులో ఉండవు. కొన్ని ప్రాంతాల్లో క్యూలు ఎక్కువగా ఉండడం వల్ల టైమ్ వేస్ట్ అవుతుంది.    సీఎన్జీ కార్లు మనీ సేవ్ చేస్తాయి. కానీ, ప్రతి ఒక్కరికీ కాదు. రోజూ ఎక్కువగా డ్రైవ్ చేసే వారికి, సిటీలో సీఎన్జీ స్టేషన్లు సులభంగా లభించే వారికి మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. కానీ, తక్కువగా వాడే వారికి, ఎక్కువ సామాను తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్న వారికి ఇది అంతగా ఉపయోగపడకపోవచ్చు.

Read Also: మార్కెట్ లోకి మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ.. న్యూ ఛేంజెస్ ఏంటో తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×