E-Paper
Advertisement

Viral Video: మారుతి 800ను లంబోర్గినిగా మార్చేశాడు, ఈ మెకానిక్ క్రియేటిటీ పీక్స్ అంతే!

Viral Video: మారుతి 800ను లంబోర్గినిగా మార్చేశాడు, ఈ మెకానిక్ క్రియేటిటీ పీక్స్ అంతే!
Advertisement

ఇండియన్స్ ఆలోచలను ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తాయి. అదే సమయంలో అద్భుతం అనిపిస్తాయి. నమ్మడం లేదా? అయితే, ఈ ఆసక్తికర స్టోరీని చదవాల్సిందే. జార్ఖండ్ కు చెందిన ఓ కారు మెకానిక్ చేసిన పని చూసి అందరూ వావ్ అంటున్నారు. ఆయన ఏకంగా తన మారుతి 800 కారును లంబోర్గిని మోడల్‌ గా మార్చేశాడు. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ కారు కథ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

చిన్న వర్క్ షాప్ లో మెకానిక్ గా పని చేస్తూ..

మహ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి ఈ క్రేజీ కారును క్రియేట్ చేశాడు. ఆయన చండిల్‌ లోని ఒక చిన్న వర్క్‌ షాప్‌ లో పని చేస్తున్నారు. ఒక రోజు ఆయనకు క్రేజీ ఆలోచన వచ్చింది. తన దగ్గర ఉన్న మారుతి  800 కారును లంబోర్గిని కారుగా మార్చాలి అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యంగా తన కారును మోడిఫై చేశాడు. ఇందుకోసం ఆరిఫ్ దాదాపు రూ. 4 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తక్కువ ఖర్చుతో అచ్చం లంబోర్గిని లాంటి కారును తయారు చేశారు.

Advertisement

ప్రొఫెషనల్ కస్టమ్ గ్యారేజీల రెడీమేడ్ బాడీ కిట్లను ఉపయోగించకుండా, అగ్రెసివ్ స్టైలింగ్‌ ను పొందడానికి ప్యానెల్స్ ను కత్తిరించాడు. మరికొన్ని భాగాలన వెల్డింగ్ చేశాడు. చాలా బాడీ మార్పులు ఆయన చేతితోనే చేశాడు. లంబోర్గిని మాదిరిగానే తక్కువ స్లాంగ్, వెడల్పు లుక్ ను ఇవ్వడానికి, మారుతి 800 అసలు నిర్మాణానికి బోలెడు మార్పులు చేశాడు. పొడవైన, బాక్సీ బాడీని తొలగించి, లంబోర్గిని రూపాన్ని క్రియేట్ చేయడానికి వీల్ ఆర్చ్‌ లను ఫ్లేర్ చేశారు. హెవీ మెటల్ ప్యానెల్స్‌ కు బదులుగా, షార్ప్, యాంగిల్ డిజైన్ లైన్లను రూపొందించడానికి ఫైబర్‌ గ్లాస్ బాడీ భాగాలను ఉపయోగించాడు.

ఇక కారులో పెద్ద వెనుక వింగ్, లోతైన ముందు స్ప్లిటర్లు, 16 అంగుళాల వెడల్పు కలిగిన అల్లాయ్ వీల్స్ కూడా అమర్చాడు.  ఇవి అసలు హ్యాచ్‌ బ్యాక్ చిన్న 12 అంగుళాల వీల్స్ ప్లేస్ లో అమర్చాడు. అంతేకాకుండా, కారులో కస్టమ్ LED హెడ్‌ ల్యాంప్‌లు, షైనింగ్ నియాన్ గ్రీన్ పెయింట్ ఫినిషింగ్ తో ఆకట్టుకునేలా చేశాడు.  లోపల, కారు స్పోర్టీ టూ సీటర్ క్యాబిన్‌ గా, సన్‌ రూఫ్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది అసలు మారుతి 800 కారులా ఏ కోణంలో కనిపించదు.

Advertisement

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

విజువల్ ఛేంజెస్ ఉన్నప్పటికీ, ఈ కారు ఇప్పటికీ స్టాక్ 796cc 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ పై నడుస్తుంది. ఇది సాధారణంగా 37–40 bhp పవర్, 56–59 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, నిజమైన లంబోర్గిని పనితీరుతో సరిపోలకపోయినా, ఆరిఫ్ క్రియేటివిటీకి అందరూ ఫిదా అవుతున్నారు. దేశీ సూపర్‌ కార్ అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Read Also: కొత్త డిజైన్.. పెద్ద బ్యాటరీ.. టాటా టియాగో EV ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×