E-Paper
Advertisement

India’s First SUV: ఇండియాలో ఫస్ట్ SUV.. ధర ఎంతో తెలుసా?

India’s First SUV: ఇండియాలో ఫస్ట్ SUV.. ధర ఎంతో తెలుసా?
Advertisement

India’s SUV Journey: భారతీయ మార్కెట్ లో SUV కార్లకు ఎంత క్రేజ్ ఉందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, దేశీ మార్కెట్ లోకి తొలుత అడుగు పెట్టిన SUV కారు ఏదో చాలా మందికి తెలియదు. ఏ సంవత్సరంలో అడుగు పెట్టింది? ధర ఎంత అనేది కూడా ఐడియా ఉండదు. అయితే, ఇప్పుడు మనం ఇండియన్ మార్కెట్ లోకి తొలుత పరిచయం అయిన SUV గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

తొలి భారతీయ SUV ఏదంటే?

ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టిన తొలి SUV టాటా సియెర్రా. ఈ మోడల్ 1991లో మార్కెట్ లోకి విడుదల అయ్యింది. ఈ కారు భారతీయ ఆటోమొబైల్ రంగానికి కొత్త దిశను చూపించింది. ఈ కారును అప్పటి టెల్కో సంస్థ అయిన ఇప్పటి టాటా మోటార్స్ తయారు చేసింది.  ఇది టాటా టెల్కోలైన్ పికప్ ప్లాట్‌ ఫామ్‌ పై ఆధారపడి రూపొందింది. మంచి బిల్డ్ క్వాలిటీతో పాటు మంచి ప్రయాణ సౌకర్యాన్ని అందించింది. అప్పట్లో దాని ధర సుమారు రూ. 5 నుంచి రూ. 6 లక్షల మధ్య ఉండేది. అప్పట్లో ఈ ధర చాలా చౌకగా ఆటో మోబైల్ మార్కెట్ భావించింది.

టాటా సియెర్రా 1991 మోడల్ ఇంజిన్ గురించి..  

Advertisement

14991 టాటా సియెర్రాలో 2.0 లీటర్ (1,948cc) డీజిల్ ఇంజన్ తో వచ్చింది. ఇది సుమారు 68 హార్స్‌ పవర్‌ ను ఉత్పత్తి చేసేది. తరువాత వచ్చిన టర్బో డీజిల్ వేరియంట్‌ లో సుమారు 90 hp వరకు పవర్ లభించింది. ఈ ఇంజన్‌ కు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్ ఉండేది. దేశంలోని గుంతల రోడ్లలోనూ ఈజీగా ప్రయాణించేలా ఈ కారును డిజైన్ చేశారు.

ఇక డిజైన్ పరంగా చూస్తే, సియెర్రా చాలా ప్రత్యేకంగా కనిపించేది. మూడు డోర్ల బాడీ స్టైల్, పెద్ద గ్లాస్ విండోలతో ఆకట్టుకునేది. ముఖ్యంగా వెనుక భాగంలో ఉన్న పెద్ద గ్లాస్ ప్యానెల్ ఈ కారుకు ఒక విభిన్నమైన లుక్ ఇచ్చింది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, బలమైన బాడీ, బోల్డ్ ఫ్రంట్ గ్రిల్ ఆకట్టకునేవి. ఇంటీరియర్ విషయంలో కూడా ఈ కారు అప్పట్లోనే చాలా అడ్వాన్స్ డ్ గా ఉండేది. విశాలమైన క్యాబిన్, సౌకర్యవంతమైన సీట్లు, పవర్ విండోలు, ఎయిర్ కండిషనింగ్ లాంటి ఫీచర్లు ఉండేవి. అంతేకాదు, అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, టాకో మీటర్ కూడా ఉండేవి. వెనుక పెద్ద గ్లాస్ కారణంగా లోపల ఎక్కువ లైట్ ఉండేది. క్యాబిన్ మరింత పెద్దదిగా ఉండేది.

2023లో నిలిచిపోయిన ఉత్పత్తి

Advertisement

2003లో టాటా సియెర్రా కారు ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ,  భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఇది భారతదేశంలో SUV సెగ్మెంట్‌ కు బాటలు వేసి, ఆ తర్వాత వచ్చిన అనేక మోడళ్లకు ప్రేరణగా నిలిచింది. ఇప్పటికీ కార్ ప్రేమికులు దీన్ని ఒక ఐకానిక్ వాహనంగా గుర్తుంచుకుంటారు.

Read Also: మాన్యువల్ ఫీలింగ్ తో ఆటోమేటిక్ డ్రైవ్, ప్యాడిల్ షిఫ్టర్ల గురించి మీకు తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×