E-Paper
Advertisement

India’s cheapest electric SUV: దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ SUV ఇదే, ధర ఎంతో తెలుసా?

India’s cheapest electric SUV: దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ SUV ఇదే, ధర ఎంతో తెలుసా?
Advertisement

India’s Cheapest Electric SUV: ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ SUVగా టాటా పంచ్ EV గుర్తింపు తెచ్చుకుంది. ఇది మైక్రో SUV సెగ్మెంట్‌లో అద్భుతమైన వాల్యూ ఫర్ మనీ ఆఫర్ చేస్తుంది. అఫోర్డబుల్ ధర, మంచి రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, ప్రీమియం ఫీచర్స్‌ తో ఆకట్టుకుంటుంది. 400+ కిమీ రేంజ్, 360 డిగ్రీ కెమెరా, సన్‌ రూఫ్ సహా మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. జస్ట్ 56 నిమిషాల్లో 80% ఛార్జ్ అవుతోంది.

టాటా పంచ్ EV ముఖ్యమైన ఫీచర్లు

టాటా పంచ్ EV పలు లేటెస్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటుంది.  10.25 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్‌ ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌ రూఫ్, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జింగ్, 360 డిగ్రీ కెమెరా, సన్‌ రూఫ్ క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఛార్జింగ్  టైమింగ్

Advertisement

టాటా పంచ్ EV 50 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ తో  కేవలం 56 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు ఛార్జ్ చేయవచ్చని టాటా మోటార్స్ వెల్లడంచింది. హోమ్ ఛార్జింగ్ (7.2 kW AC)లో  పూర్తి ఛార్జ్‌ కు 5-6 గంటల సమయం పడుతుంది.

బ్యాటరీ ఆప్షన్స్, రేంజ్

బ్యాటరీ ఎంపికలు, పరిధి విషయానికి వస్తే.. టాటా పంచ్ EV రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. 25 kWh బ్యాటరీకితో వచ్చే కారులో ఒక్క ఛార్జ్‌ కు 315 కి.మీ క్లెయిమ్డ్ రేంజ్‌ లభిస్తుంది. అటు ఒకే ఛార్జ్‌ పై 421 కి.మీ. రేంజ్ అందించే 35 kWh బ్యాటరీ ఆప్షన్ లో మరో వేరియంట్ ఉంది. దీని పవర్ 82-122 PS, టార్క్ 114-190 Nm ఉంటుంది. ఇన్‌ స్టంట్ యాక్సిలరేషన్ సూపర్గా ఉంటుంది.

టాటా పంచ్ EV ధర ఎంతంటే?

Advertisement

టాటా పంచ్ EV రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 14.44 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ఇది దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUVగా గుర్తింపు తెచ్చుకుంది.

టాటా పంచ్ EV భద్రతా రేటింగ్

టాటా పంచ్ EV భద్రతా రేటింగ్ విషయానికి వస్తే, భారత్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌ లో పంచ్ EV 5 స్టార్ రేటింగ్‌ ను పొందింది. ఇది దీనిని అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ SUVలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆరు ఎయిర్‌ బ్యాగ్‌ లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లను కలిగి ఉంటుంది.

అనుకూల, ప్రతికూల అంశాలు 

అనుకూల అంశాలు: చౌక ధర, మంచి రేంజ్, సేఫ్టీ టాప్ క్లాస్, సిటీ డ్రైవింగ్‌కు పర్ఫెక్ట్, లో మెయింటెనెన్స్.

ప్రతికూల అంశాలు: రియర్ సీట్ లెగ్‌ రూమ్ కాస్త టైట్, హైవే పర్ఫార్మెన్స్ మీడియం, కొన్ని వేరియంట్లలో స్పేర్ టైర్ లేదు.  టాటా పంచ్ EV సిటీ యూజర్లకు, ఫస్ట్ టైమ్ EV బైయర్లకు బెస్ట్ చాయిస్గా చెప్పుకోవచ్చు.

Read Also: కియా To మహీంద్రా.. కొత్త ఏడాది సరికొత్తగా అడుగు పెట్టబోతున్న హైబ్రిడ్ కార్ల!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×