E-Paper
Advertisement

టాటా To మహీంద్రా.. మేలో అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

టాటా To మహీంద్రా.. మేలో అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Advertisement

Top Selling Electric Cars in May 2026: భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ రోజు రోజుకు వేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పర్యావరణంపై అవగాహన పెరగడం లాంటి కారణాలతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఎఫెక్ట్ 2026 మే అమ్మకాల గణాంకాల్లో స్పష్టంగా కనిపించింది. మే 2026లో దేశవ్యాప్తంగా మొత్తం 26,620 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ నెలలో ఈ సంఖ్య 24,592 యూనిట్లుగా ఉండగా, మేలో దాదాపు 8 శాతం వృద్ధి నమోదైంది. భారతీయ ఈవీ మార్కెట్ ఎంత బలంగా విస్తరిస్తుందో ఈ లెక్కలు చూపిస్తున్నాయి.

1.టాటా పంచ్ ఈవీ

మే నెలలో టాటా పంచ్ ఈవీ దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా గుర్తింపు తెచ్చుకుంది. మే నెలలో ఈ కారు 3,681 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్‌ తో పోలిస్తే ఇది 14 శాతం పెరుగుదల. అందుబాటు ధర, మంచి రేంజ్, ఎస్‌యూవీ తరహా డిజైన్ ఈ కారుకు భారీ డిమాండ్ తీసుకొచ్చాయి.

2.మహీంద్రా 9ఎస్

Advertisement

రెండో స్థానంలో మహీంద్రా 9ఎస్ నిలిచింది. ఈ మోడల్ మే నెలలో 3,502 యూనిట్లను విక్రయించింది. ఏప్రిల్‌ తో పోలిస్తే అమ్మకాలు 8 శాతం పెరిగాయి. మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో వేగంగా ఎదుగుతున్న కంపెనీలలో ఒకటిగా మారుతోంది.

3.టాటా నెక్సాన్ ఈవీ

టాటా నెక్సాన్ ఈవీ తన ప్రజాదరణను కొనసాగిస్తోంది. మే నెలలో ఈ కారు 2,649 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచింది. గత నెలతో పోలిస్తే 6 శాతం వృద్ధి సాధించింది.

4.ఎంజీ విండ్సర్

Advertisement

నాలుగో స్థానంలో ఎంజీ విండ్సర్ నిలిచింది. ఈ కారు 2,032 యూనిట్లు అమ్ముడైనా, ఏప్రిల్‌తో పోలిస్తే అమ్మకాలు 38 శాతం తగ్గాయి. ఇది టాప్ మోడళ్లలో అత్యధిక తగ్గింపుగా చెప్పుకోవచ్చు.

5.మహీంద్రా XEV 9e

ఐదో స్థానంలో మహీంద్రా XEV 9e నిలిచింది. ఈ మోడల్ 1,939 యూనిట్ల అమ్మకాలతో 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. మహీంద్రాకు చెందిన పలు ఎలక్ట్రిక్ మోడళ్లు ప్రస్తుతం మంచి డిమాండ్‌ను సొంతం చేసుకుంటున్నాయి.

6.టాటా హారియర్ ఈవీ

టాటా హారియర్ ఈవీ కూడా మంచి సత్తా చాటింది. ఈ కారు 1,833 యూనిట్ల అమ్మకాలతో ఆరవ స్థానంలో నిలిచింది. కంపెనీ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకుంది.

7.ఎంజీ జెడ్ఎస్ ఈవీ

ఎంజీ జెడ్ఎస్ ఈవీ అమ్మకాల్లో భారీ వృద్ధిని నమోదు చేసింది. ఈ కారు మే నెలలో 1,562 యూనిట్లు అమ్ముడై, గత నెలతో పోలిస్తే 118 శాతం పెరుగుదల సాధించింది. ఇది మే నెలలో అత్యధిక వృద్ధిని నమోదు చేసిన మోడల్‌గా నిలిచింది.

8.మారుతి సుజుకి ఈ-విటారా

మారుతి సుజుకి ఈ-విటారా 1,439 యూనిట్ల అమ్మకాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే, అమ్మకాలు 28 శాతం తగ్గాయి.

9.టాటా కర్వ్ ఈవీ

మరోవైపు టాటా కర్వ్ ఈవీ 1,288 యూనిట్ల అమ్మకాలతో 46 శాతం వృద్ధిని నమోదు చేసింది.

10.విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్

విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ కూడా టాప్-10 జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ మోడల్ 1,026 యూనిట్లు అమ్ముడై 50 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Read Also: రిలీజ్ కు ముందే లీకైన అవిన్యా డాష్‌ బోర్డ్.. ఇంటీరియర్‌ చూస్తే వావ్ అనాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×