E-Paper
Advertisement

Holi Special Trains: హోలీ స్పెషల్ ట్రైన్స్.. బుకింగ్స్ మొదలయ్యాయండోయ్!

Holi Special Trains: హోలీ స్పెషల్ ట్రైన్స్.. బుకింగ్స్ మొదలయ్యాయండోయ్!
Advertisement

Holi Special Trains 2026:  హోలీ సందర్భంగా భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. రద్దీకి అనుగుణంగా స్పెషల్ ట్రైన్స్ ను నడపాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాలకు ఉపాధి, ఉద్యోగాల కోసం వెళ్లిన ప్రజలు, హోలీకి సొంతూళ్లకు వెళ్లేలా ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి. స్పెషల్ హోలీ ట్రైన్స్ లక్నో నుంచి న్యూఢిల్లీతో సహా అనేక ప్రధాన స్టేషన్లకు నడుస్తాయి.

హోలీ స్పెషల్ రైళ్లు ఏ మార్గాల్లో నడుస్తాయంటే?

హోలీ ప్రత్యేక రైళ్లు ఢిల్లీ, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, చండీగఢ్, బీహార్‌ లోని కొన్ని ప్రాంతాలకు ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. ఏ రైళ్లు ఏ ప్రాంతాలకు నడుస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

⦿ రైలు నెం. 04203 ఫిబ్రవరి 23, మార్చి 2 తేదీలలో ఉదయం 8:05 గంటలకు లక్నో నుంచి బయలుదేరి, అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు న్యూ ఢిల్లీకి చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 04204  ఫిబ్రవరి 23, మార్చి 2 తేదీలలో రాత్రి 8:20 గంటలకు న్యూ ఢిల్లీ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6:35 గంటలకు లక్నో చేరుకుంటుంది.

Advertisement

⦿ రైలు నెం. 04209  ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6 వరకు ప్రతిరోజూ నడుస్తుంది. వారణాసి నుంచి రాత్రి 10:30 గంటలకు బయలుదేరుతుంది. ఇది లక్నోకు తెల్లవారుజామున 3:30 గంటలకు వెళుతుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది.

⦿ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 7 వరకు ప్రతిరోజూ రైలు నంబర్ 04210 స్పెషల్ రైలు నడుస్తుంది. ఢిల్లీ నుంచి సాయంత్రం 7:25 గంటలకు బయలుదేరి, లక్నో మీదుగా  ఉదయం 9:40 గంటలకు వారణాసి చేరుకుంటుంది.

⦿ రైలు నంబర్ 04213 ఫిబ్రవరి 24, 26, మార్చి 1, 3, 5 తేదీల్లో సాయంత్రం 6:20 గంటలకు అయోధ్య కంటోన్మెంట్ నుంచి బయలుదేరుతుంది.  రాత్రి 8:45 గంటలకు లక్నో మీదుగా వెళ్లి ఉదయం 6:00 గంటలకు ఆనంద్ విహార్ చేరుకుంటుంది.

⦿ రైలు నంబర్ 04214   ఫిబ్రవరి 25, 27, మార్చి 2, 4, 6 తేదీల్లో ఉదయం 9:00 గంటలకు ఆనంద్ విహార్ నుంచి నడుస్తుంది. సాయంత్రం 6:20 గంటలకు లక్నో మీదుగా వెళ్లి రాత్రి 10:00 గంటలకు వారణాసి చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 04227  ఫిబ్రవరి 21, 28 తేదీలలో మధ్యాహ్నం 2:50 గంటలకు వారణాసి నుంచి బయలుదేరి, రాత్రి 8:40 గంటలకు లక్నో మీదుగా వెళ్లి ఉదయం 7:45 గంటలకు చండీగఢ్ చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 04228  ఫిబ్రవరి 22, మార్చి 1 తేదీలలో ఉదయం 9:30 గంటలకు చండీగఢ్ నుంచి నడుస్తుంది. రాత్రి 8:05 గంటలకు లక్నో మీదుగా వెళ్లి ఉదయం 1:20 గంటలకు వారణాసి చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 04604  ఫిబ్రవరి 22, 26, మార్చి 2, 6 తేదీలలో సాయంత్రం 6:15 గంటలకు శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుంచి నడుస్తుంది. మధ్యాహ్నం 12:25 గంటలకు లక్నో మీదుగా వెళ్లి రాత్రి 7:00 గంటలకు వారణాసి చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 04603 స్పెషల్ ఫిబ్రవరి 24, 28, మార్చి 4, 8 తేదీల్లో ఉదయం 5:00 గంటలకు వారణాసి నుంచి బయలుదేరి, ఉదయం 10:20 గంటలకు లక్నో మీదుగా వెళ్లి, మరుసటి రోజు ఉదయం 6:00 గంటలకు శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 04514 స్పెషల్ ఫిబ్రవరి 26, మార్చి 5 తేదీల్లో రాత్రి 11:35 గంటలకు చండీగఢ్ నుంచి నడుస్తుంది. మరుసటి రోజు ఉదయం 11:00 గంటలకు లక్నో మీదుగా వెళ్లి, సాయంత్రం 5:35 గంటలకు గోరఖ్‌పూర్ చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 04513 స్పెషల్ ఫిబ్రవరి 27, మార్చి 6 తేదీల్లో రాత్రి 10:05 గంటలకు గోరఖ్‌పూర్ నుండి బయలుదేరి, ఉదయం 3:00 గంటలకు లక్నో మీదుగా వెళ్లి, మధ్యాహ్నం 2:10 గంటలకు చండీగఢ్ చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 04054  ఫిబ్రవరి 20 నుండి మార్చి 6 వరకు ప్రతిరోజూ నడుస్తుంది. న్యూఢిల్లీ నుంచి సాయంత్రం 7:50 గంటలకు బయలుదేరి, ఐష్‌బాగ్ మీదుగా  రాత్రి 10:00 గంటలకు బరౌనీకి చేరుకుంటుంది.

⦿ రైలు నెం. 04053 ఫిబ్రవరి 22 నుంచి మార్చి 8 వరకు ప్రతిరోజూ నడుస్తుంది. బరౌనీ నుండి తెల్లవారుజామున 12:45 గంటలకు బయలుదేరి, ఐష్‌బాగ్ మీదుగా న్యూఢిల్లీకి తెల్లవారుజామున 3:50 గంటలకు చేరుకుంటుంది.  ఈ రైళ్లకు సంబంధించి ఇండియన్ రైల్వే బుకింగ్స్ ప్రారంభించింది.

Read Also: షాకింగ్.. ఆ రూట్‌లో వందే భారత్ రైళ్ల సేవల్ ఇక బంద్, రైల్వే కీలక నిర్ణయం!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×