E-Paper
Advertisement

India-EU FTA Deal: భారత్-ఈయూ మధ్య కీలక ఒప్పందం, భారీగా తగ్గనున్న కార్ల ధరలు!

India-EU FTA Deal:  భారత్-ఈయూ మధ్య కీలక ఒప్పందం, భారీగా తగ్గనున్న కార్ల ధరలు!
Advertisement

India-EU FTA Deal: భారతదేశం-యూరోపియన్ యూనియన్ మధ్య కీలక  స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) జరిగింది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా చెప్పుకునే ఈ ఒప్పందం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను ప్రభావితం చేయనుంది. ఈ ఒప్పందంతో ఇండియాతో పాటు యూరప్ కంట్రీస్ కు ఎంతో మేలు జరగనుంది. తాజా ఒప్పందంతో భారత్.. ఇతర వాణిజ్య భాగస్వాములెవరికీ లభించని  రాయితీలను EU నుంచి పొందనుంది. ముఖ్యంగా కార్లపై దిగుమతి సుంకాలను 110 శాతం నుంచి 10 శాతం వరకు దశలవారీగా తగ్గనున్నాయి. ఈ నిర్ణయంతో భారత్ దిగుమతి చేసుకున్న యూరోపియన్ వాహనాల ధరలు, ముఖ్యంగా లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి.

లగ్జరీ కార్ల మీద సుంకాలు ఎలా ?  

ఇప్పటి వరకు, యూరప్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న పూర్తి బిల్ట్ అప్  కార్లు ప్రపంచంలోనే అత్యధిక ఆటోమోటివ్ టారిఫ్ ను కలిగి ఉండేవి. ఈ వాహనాలు 70 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 40 శాతం అగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్ డెవలప్ మెంట్ సెస్, 28 శాతం IGST, సహా మరికొన్ని సెస్‌లు ఉండేవి. మొత్తం పన్ను కారణంగా కారు CIF (ఖర్చు, బీమా, సరుకు రవాణా) విలువలో దాదాపు 140–170 శాతానికి పెంచింది. తాజాగా నిర్ణయంతో కార్లపై దిగుమతి సుంకాలు దశలవారీగా తగ్గించబడతాయి. మొదటి దశలో, అర్హత కలిగిన EU-నిర్మిత వాహనాలకు సుంకాలు దాదాపు 40 శాతానికి తగ్గుతాయి. తరువాత GST, సెస్ విధించనున్నారు. దీర్ఘకాలికంగా, కార్లపై సుంకాలు క్రమంగా తగ్గుతాయి. చివరికి 10 శాతం వరకు చేరుకుంటాయి. ఈ ఒప్పందం ఐదు నుంచి పదేళ్ల కాలపరిమితిలో కారు విడిభాగాలపై దిగుమతి సుంకాలను పూర్తిగా రద్దు చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది.

కార్ల ధరలు ఎంత తగ్గుతాయంటే?

Advertisement

తొలి దశలో 40 శాతం సుంకాన్ని తగ్గించడం వల్ల పన్ను భారం దాదాపు 70 నుంచి 90 శాతానికి తగ్గుతుంది. ప్రస్తుత ధరలతో పోల్చితే ధరలలో 40 శాతం నుంచి 50 శాతం తగ్గే అవకాశం ఉంటుంది. సుమారు రూ. 1 కోటి CIF విలువ కలిగిన యూరోపియన్ కారు ప్రస్తుతం దేశంలో దాదాపు రూ.3 కోట్ల ఎక్స్ షోరూమ్‌కు రిటైల్ అవుతుంది. మారిన టారిఫ్ ఫ్రేమ్‌ వర్క్ ప్రకారం ధర భారీగా తగ్గే అవకాశం ఉంటుంది.

ఏ కార్ల ధరలు తగ్గే అవకాశం ఉంది?  

టారిఫ్ తగ్గింపు అనేది  ప్రారంభంలో సంవత్సరానికి రెండు లక్షల కార్ల కోటాకు వర్తిస్తాయి. ప్రారంభ దశలో ఈ ప్రయోజనం పెట్రోల్, డీజిల్ వాహనాలకు వర్తిస్తాయి. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలను మొదటి ఐదు సంవత్సరాలకు ఒప్పందం నుంచి మినహాయించారు. తాజా నిర్ణయంతో మెర్సిడెస్ బెంజ్, BMW, ఆడి, పోర్స్చే, లంబోర్గిని, ఫెరారీ, బెంట్లీ, రోల్స్ రాయిస్, ల్యాండ్ రోవర్, వోల్వో, వోక్స్‌ వ్యాగన్, స్కోడా లాంటి బ్రాండ్‌ల నుంచి పూర్తిగా దిగుమతి చేసుకున్న మోడళ్లు భారీగా ప్రయోజనం పొందనున్నాయి. ఇందులో ఫ్లాగ్‌ షిప్ లగ్జరీ SUVలు, పెర్ఫార్మెన్స్ సెడాన్‌లు,  స్పోర్ట్స్ కార్లు, వోక్స్‌ వ్యాగన్ గోల్ఫ్ GTI,  స్కోడా ఆక్టేవియా Vrs లాంటి తక్కువ వాల్యూమ్ పని తీరు కలిగిన మోడళ్లు ఉన్నాయి.

Advertisement

Read Also: మారుతి To స్కోడా.. ఫిబ్రవరి 2026లో విడుదల కాబోతున్న క్రేజీ కార్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×