E-Paper
Advertisement

స్పోర్ట్స్ బైక్స్ To కమ్యూటర్స్.. జూన్ లో లాంచ్ అయ్యే క్రేజీ టూ వీలర్స్ ఇవే!

స్పోర్ట్స్ బైక్స్ To కమ్యూటర్స్.. జూన్ లో లాంచ్ అయ్యే క్రేజీ టూ వీలర్స్ ఇవే!
Advertisement

2026 June Bike Launches: ఇండియన్ మార్కెట్‌ లోకి ఈ నెలలో పలు కొత్త బైక్ మోడళ్ల విడుదల కానున్నాయి. ఈసారి విడుదల అవుతున్న బైక్స్ లో హై పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ బైక్‌ లతో పాటు రోజువారీ ప్రయాణాలకు ఉపయోగపడే కమ్యూటర్ మోడళ్లు కూడా ఉన్నాయి. బైక్ ప్రియుల్లో ఇప్పటికే ఆసక్తి పెరుగుతోంది.  ఇక ఈ నెలలో విడుదలయ్యే మోడల్స్ ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ యమహా YZF-R7

యమహా YZF-R7 ప్రీమియం సూపర్ స్పోర్ట్ బైక్‌ గా రాబోతోంది. దీని అంచనా ధర సుమారు రూ.10 లక్షల నుంచి రూ.10.10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. జూన్ 2026 మధ్యలో ఇది మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. స్పీడ్, హ్యాండ్లింగ్‌ పై దృష్టి పెట్టిన ఈ మోడల్ స్పోర్ట్స్ రైడింగ్ ఇష్టపడే వారికి ఎక్కువగా నచ్చుతుంది.

⦿ కరిజ్మా XMR 250

Advertisement

హీరో నుంచి రాబోతున్న మరో క్రేజీ మోడల్ కరిజ్మా XMR 250. ఈ బైక్ పైనా కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.    స్పోర్ట్స్ టూరర్ సెగ్మెంట్‌ లోకి అడుగు పెడుతోంది. దీని ధర సుమారు రూ.2 లక్షల నుంచి రూ.2.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. జూన్ 2026 చివర్లో ఈ బైక్ విడుదల కావచ్చని తెలుస్తోంది. సుదూర ప్రయాణాలకు అనువుగా ఉండేలా ఈ బైక్ ను డిజైన్ చేశారు.

⦿ కెటీయం RC 390

తేలికపాటి సూపర్ స్పోర్ట్ బైక్‌ గా మార్కెట్ లోకి రానుంది. దీని ధర సుమారు రూ.3.50 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. జూన్ 2026లో మార్కెట్‌ లోకి రానుంది. యంగ్ రైడర్లను లక్ష్యంగా చేసుకుని ఈ బైక్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

⦿ యమహా R3 2026

Advertisement

ఈ వెర్షన్ కూడా ఈ నెలలోనే విడుదల కానుంది. దీని ధర రూ.3.70 లక్షల నుంచి రూ.4.80 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఇది పూర్తిస్థాయి సూపర్ స్పోర్ట్ కేటగిరీలోకి వస్తుంది. మిడ్ రేంజ్ స్పోర్ట్స్ బైక్‌లలో బలమైన పోటీదారుగా నిలవనుంది.

⦿ అపాచీ RTX 300

టీవీఎస్ కూడా కొత్త అపాచీ RTX 300 మోడల్‌ ను తీసుకురానుంది. నేకడ్ స్ట్రీట్ ఫైటర్ సెగ్మెంట్‌ లో వస్తుంది. దీని ధర సుమారు రూ.1.99 లక్షల వరకు ఉంటుంది. రోజువారీ సిటీ  రైడింగ్‌ కు అనుకూలంగా ఉంటుంది.

⦿ స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్  

హీరో మరోసారి కమ్యూటర్ సెగ్మెంట్‌ లో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్‌ ను విడుదల చేయనుంది. దీని ధర రూ.88,000 ఉంటుందని తెలుస్తోంది. ఇంధన పొదుపు, తక్కువ మెయింటెన్స్ ఖర్చుల కారణంగా సాధారణ వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది.

⦿ యమహా WR155 R

అటు యమహా WR155 R కూడా జూన్ 2026లో మార్కెట్‌లోకి రానుంది. ఆఫ్ రోడ్, అడ్వెంచర్ రైడింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. దీని ధర సుమారు రూ. 1.70 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

Read Also: హీరో To హోండా.. ఇండియన్ మార్కెట్ లో ఎంట్రీ ఇస్తున్న ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×