E-Paper
Advertisement

వెన్యూ మైలేజ్ టెస్ట్‌ లో షాకింగ్ రిజల్ట్స్.. సిటీలో ఎంత ఇస్తుందంటే?

వెన్యూ మైలేజ్ టెస్ట్‌ లో షాకింగ్ రిజల్ట్స్.. సిటీలో ఎంత ఇస్తుందంటే?
Advertisement

హ్యుందాయ్ కంపెనీ భారత మార్కెట్లో చిన్న కార్లలో ఉపయోగిస్తున్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ బాగా పాపులర్ అయ్యింది. ఈ ఇంజన్ గ్రాండ్ i10 నియోస్, ఆరా, ఎక్స్టర్, i20, వెన్యూ లాంటి మోడళ్లలో అందుబాటులో ఉంది. అయితే, వెన్యూలో ఈ ఇంజన్‌ను కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్‌ తో మాత్రమే అందిస్తున్నారు. అయినప్పటికీ, వెన్యూ మొత్తం అమ్మకాలలో ఈ 1.2 పెట్రోల్ వెర్షన్‌ కే ఎక్కువ డిమాండ్ ఉండటం విశేషం. హ్యుందాయ్ వెన్యూ 1.2 పెట్రోల్ వేరియంట్ మొత్తం వెన్యూ అమ్మకాలలో దాదాపు 63 శాతం వాటాను కలిగి ఉంది. టర్బో పెట్రోల్, డీజిల్ మోడళ్లతో పోలిస్తే ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. దీనికి ప్రధాన కారణం తక్కువ ధర, సింపుల్ ఇంజన్ సెటప్, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటమే.

వెన్యూ 1.2 పెట్రోల్ వేరియంట్ మైలేజ్ ఎంత?

Advertisement

హ్యుందాయ్ వెన్యూ 1.2 పెట్రోల్ వేరియంట్ లో 1,197cc సామర్థ్యం కలిగిన నాలుగు సిలిండర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 83hp పవర్, 115Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ తెలిపిన ARAI మైలేజ్ ప్రకారం ఈ కారు లీటరుకు 18.05 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కానీ, వాస్తవ పరిస్థితుల్లో మైలేజ్ కొంత తక్కువగా కనిపించింది. రియల్ వరల్డ్ టెస్టుల్లో నగర ప్రాంతాల్లో ఈ కారు సుమారు 10.7 kmpl మైలేజ్ ఇచ్చింది. హైవేలపై దాదాపు 14.9 kmpl వరకు మైలేజ్ లభించింది. అంటే రోజువారీ ట్రాఫిక్‌ లో ఎక్కువగా నడిపే వారికి కంపెనీ ప్రకటించిన మైలేజ్ లో ఇంచుమించు సగం మాత్రమే వస్తుంది.

వెన్యూ 1.2 మైనస్ ఆ ఫీచర్లు లేకపోవడం

వెన్యూ 1.2లో కొన్ని ఫీచర్లు లేకపోవడం కూడా ఇంధన వినియోగంపై ప్రభావం చూపుతోంది. ఈ కారులో ఆటోమేటిక్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ ఇవ్వలేదు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇంజన్ ఆటోమేటిక్‌ గా ఆగి మళ్లీ స్టార్ట్ అయ్యే ఈ ఫీచర్ ఉంటే ఇంధనం మరింత ఆదా అయ్యే అవకాశం ఉండేది.

ఎక్కువ బరువు ఉండటం!

Advertisement

మరో ముఖ్యమైన విషయం బరువు. ఈ SUV బరువు 1,127 కిలోలు. అదే ఇంజన్‌ ను ఉపయోగించే హ్యుందాయ్ ఎక్స్టర్‌తో పోలిస్తే ఇది దాదాపు 130 కిలోలు ఎక్కువ బరువుగా ఉంటుంది. ఈ అదనపు బరువు కారణంగా ఇంజన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే కంపెనీ తక్కువ గేరింగ్‌ ను ఉపయోగించింది.  దీని ప్రభావం హైవే డ్రైవింగ్‌ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఐదో గేర్‌ లో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు ఇంజన్ సుమారు 3,200rpm దగ్గర తిరుగుతుంది. దీని వల్ల కారు కొంచెం ఎక్కువ శబ్దం చేస్తుంది.  సుదూర ప్రయాణాల్లో అంతగా రిలాక్స్‌ డ్ ఫీలింగ్ ఇవ్వదు.

హ్యుందాయ్ వెన్యూ 1.2 పెట్రోల్ మోడల్ సిటీ యూజ్ కు సరిపడే సింపుల్ SUVగా చెప్పొచ్చు. అయితే, మైలేజ్ విషయంలో కంపెనీ చెప్పే లెక్కలతో పోల్చితే, రియల్ వరల్డ్ లో చాలా తక్కువగా ఉండటం గమనించాల్సిన విషయం.

Read Also: 1200 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఫీచర్లు.. BYD హైబ్రిడ్ కార్లు వచ్చేస్తున్నాయ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×