E-Paper
Advertisement

హ్యుందాయ్ సమ్మర్ క్యాంప్.. ఫ్రీగా ఏసీ చెకప్ చేయించుకోండి!

హ్యుందాయ్ సమ్మర్ క్యాంప్.. ఫ్రీగా ఏసీ చెకప్ చేయించుకోండి!
Advertisement

Hyundai AC Check Up Camp 2026: వేసవి మొదలైంది. ఉష్ణోగ్రతలు అప్పుడే 40 డిగ్రీలకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులకు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్రత్యేక కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 18 వరకు దేశవ్యాప్తంగా ఏసీ చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ క్యాంప్ ద్వారా వాహనాల్లోని ఏసీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా ముందస్తు తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించింది.

వినియోగదారులకు పలు రకాల బెనిఫిట్స్

ఈ క్యాంప్ లో భాగంగా హ్యుందాయ్ వినియోగదారులకు పలు ప్రయోజనాలు అందిస్తోంది. ముఖ్యంగా ఫ్రీ 30 పాయింట్స్ పేరుతో వెహికల్స్ చెక్ చేయనుంది. డ్రై వాష్ సర్వీసును కూడా ఎటువంటి ఖర్చు లేకుండా అందిస్తుంది. వేసవిలో కార్ క్యాబిన్ చల్లగా ఉండేందుకు ఏసీ సిస్టమ్ సరిగా పనిచేయడం ఎంతో అవసరం. అందుకే, కంపెనీ ఏసీ సర్వీసింగ్‌ పై ప్రత్యేక రాయితీలు ప్రకటించింది.

Advertisement

ఏసీ గ్యాస్ రీఫిల్, సర్వీసింగ్ లాంటి సర్వీసులకు సుమారు 15 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. అలాగే, వీల్ అలైన్‌ మెంట్, బ్యాలెన్సింగ్ సేవలపై కూడా ఇదే స్థాయిలో డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కాంప్రెసర్, కండెన్సర్, కూలింగ్ కాయిల్ లాంటి ముఖ్యమైన ఏసీ భాగాలపై సుమారు 10 శాతం వరకు ధర తగ్గింపు అందిస్తుంది.    అదనంగా ఏసీ డిసిన్ఫెక్టెంట్ ట్రీట్‌మెంట్, ప్లాస్టిక్ భాగాల రిస్టోరేషన్ లాంటి సర్వీసులు కూడా తగ్గింపు ధరలతో అందిస్తుంది.

హ్యుందాయ్ అధికారిక సర్వీస్ సెంటర్లలో..

ఈ ఏసీ చెకింగ్ క్యాంప్ దేశ వ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ అధికారిక సర్వీస్ సెంటర్లలో నిర్వహించబడుతుంది. దీంతో వినియోగదారులు ఈ సేవలను సులభంగా పొందవచ్చు. శిక్షణ పొందిన టెక్నీషియన్లు వాహనాన్ని పూర్తిగా పరిశీలించి, అవసరమైన మార్పులు సూచిస్తారు. ఒరిజినల్ స్పేర్ పార్ట్స్  ఉపయోగించడం వల్ల వాహనం పనితీరు మెరుగుపడుతుంది.

ముందస్తు చెకింగ్ తో మున్ముందు సమస్యలకు చెక్

Advertisement

వినియోగదారులకు ఎలాంటి మున్ముందు సమస్యలు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది. కస్టమర్లకు ఇబ్బందులు రాకుండా, వేసవిలో ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది. ముందుగానే వెహికల్ చెక్ చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించే అవకాశం ఉందన్నారు. ఈ ఏసీ చెకప్ క్యాంప్ వాహనదారులకు మంచి అవకాశం కానుంది. తక్కువ ఖర్చుతో అవసరమైన సేవలు పొందడంతో పాటు, కారు పనితీరు మెరుగుపరచుకోవచ్చు. చిన్నపాటి తనిఖీలు పెద్ద మరమ్మత్తుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.

Read Also: భారత్‌లో టెస్లా సేల్స్ షాక్.. జస్ట్ 342 కార్ల అమ్మకం!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×