E-Paper
Advertisement

హ్యుందాయ్‌కు బిగ్ షాక్.. ఏప్రిల్-జూన్‌లో కుప్పకూలిన లాభాలు.. ఎగుమతులు సైతం డౌన్!

హ్యుందాయ్‌కు బిగ్ షాక్.. ఏప్రిల్-జూన్‌లో కుప్పకూలిన లాభాలు.. ఎగుమతులు సైతం డౌన్!
Advertisement

Hyundai Q1 Results: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY27) మొదటి త్రైమాసికంలో నిరాశాజనకమైన ఫలితాలను నమోదు చేసింది. ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం ఏకంగా 35.1 శాతం పడిపోయి రూ. 888.6 కోట్లకు పరిమితమైంది. గతేడాది ఇదే సమయానికి కంపెనీ రూ. 1,369 కోట్ల లాభాన్ని ఆర్జించగా.. ఈసారి అది గణనీయంగా తగ్గడం గమనార్హం. ఇక కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం గతేడాదితో పోలిస్తే 0.5 శాతం తగ్గి రూ. 16,334.6 కోట్లుగా నమోదైంది.

దెబ్బకొట్టిన అగ్ని ప్రమాదం!

ముడిసరుకుల ధరలు పెరగడం, నిర్వహణ వ్యయాలు భారీగా కావడం వల్ల హ్యుందాయ్ కంపెనీ మార్జిన్ల పై తీవ్ర ప్రభావం పడినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశీయంగా కంపెనీ విక్రయాల వృద్ధి 5.4 శాతానికే పరిమితం కావడం వెనుక అమ్మకాల్లో నెలకొన్న టెంపరరీ సమస్యలే కారణమని కంపెనీ తెలిపింది. జూన్ నెలలో కీలకమైన కంపెనీ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు 13,900 వాహనాల ఉత్పత్తి నిలిచిపోయిందని పేర్కొంది. జూన్ 22 నుండి పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయని.. జూలై-సెప్టెంబర్ (రెండో త్రైమాసికం) కాలంలో ఈ ఉత్పత్తి లోటును భర్తీ చేస్తామని హ్యుందాయ్ ధీమా వ్యక్తం చేసింది.

పడిపోయిన ఎగుమతులు

Advertisement

మరోవైపు పశ్చిమాసియాలో చోటుచేసుకున్న రాజకీయ, సైనిక ఉద్రిక్తతల కారణంగా హ్యుందాయ్ కంపెనీ ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM) సమాచారం ప్రకారం.. జూన్ త్రైమాసికంలో హ్యుందాయ్ దేశీయ హోల్‌సేల్ విక్రయాలు 5.38 శాతం పెరిగి 1,39,374 యూనిట్లకు చేరాయి. అయితే ఎగుమతులు మాత్రం 19.6 శాతం తగ్గి 38,708 యూనిట్లకు పడిపోయాయి.

లాభాలు తగ్గినా.. నిలకడగా షేర్లు!

హ్యూందాయ్ లాభాలు తొలి త్రైమాసికంలో ఊహించని విధంగా తగ్గినప్పటికీ.. స్టాక్ మార్కెట్లో మాత్రం కంపెనీ షేర్లు సానుకూలంగా ఉన్నాయి. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి హ్యుందాయ్ మోటార్ ఇండియా షేరు 2.38 శాతం పెరిగి రూ. 2,040.30 వద్ద ముగిసింది. హ్యుందాయ్ లో ఈ తాత్కాలిక సమస్యల కంటే.. కంపెనీ దీర్ఘకాలిక ప్రణాళికలు, మార్కెట్ డిమాండ్‌పై పెట్టుబడిదారులు నమ్మకంతో ఉన్నారని ఇది సూచిస్తోంది.

Advertisement

Also Read: కారు పార్కింగ్ తిప్పలకు చెక్.. రూ.2,000 లోపే టాప్-5 రివర్స్ కెమెరాలు!

ఆ వాహనాలపైనే ఆశలు

ఇదిలా ఉంటే ప్రస్తుతం హ్యుందాయ్ భారత్‌లో గ్రాండ్ i10 నియోస్, i20 వంటి మోడళ్లతో పాటు ఆరా, వెర్నా సెడాన్లు, ఎక్స్‌టర్, వెన్యూ, క్రెటా, అల్కజార్ వంటి పాపులర్ SUVలను విక్రయిస్తోంది. వీటితో పాటు క్రెటా ఎలక్ట్రిక్, అయోనిక్ 5 ఎలక్ట్రిక్ వాహనాలను.. కమర్షియల్ విభాగానికి సంబంధించి ప్రైమ్-HB, ప్రైమ్-SD మోడళ్లను సైతం మార్కెట్లో అందిస్తోంది. వీటికున్న క్రేజ్ దృష్ట్యా రెండో త్రైమాసికంలోనైనా లాభాల్లో గట్టి కమ్ బ్యాక్ ఇస్తామని హ్యుందాయ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: పాస్‌పోర్ట్ రంగుల అసలు రహస్యం తెలుసా? బ్లూ, రెడ్, గ్రీన్, బ్లాక్ దేనికి సంకేతమంటే..!

Tags

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×