E-Paper
Advertisement

హ్యుందాయ్ ఇన్‌ స్టర్‌కు క్రేజీ లగ్జరీ వెర్షన్ లాంచ్.. రేంజ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

హ్యుందాయ్ ఇన్‌ స్టర్‌కు క్రేజీ లగ్జరీ వెర్షన్ లాంచ్.. రేంజ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

Hyundai Inster Lounge EV:  హ్యుందాయ్ చిన్న ఎలక్ట్రిక్ కారు ఇన్‌ స్టర్‌ కు కొత్త ప్రీమియం వెర్షన్‌ ను తీసుకొచ్చింది.   ‘ఇన్‌స్టర్ లాంజ్’ పేరుతో మార్కెట్ కు పరిచయం చేసింది. ఇప్పటికే కంపెనీ ఫ్లాగ్‌ షిప్ మల్టీపర్పస్ వెహికల్ స్టారియా లాంజ్‌ కు ఈ పేరు ఉపయోగిస్తుండగా, ఇప్పుడు అదే బ్రాండ్ పేరును ఇన్‌ స్టర్ ఎలక్ట్రిక్ కారుకు కూడా తీసుకొచ్చింది. కొత్త ఇన్‌ స్టర్ లాంజ్ లగ్జరీ ఇంటీరియర్, మెరుగైన డిజైన్, అదనపు సౌకర్యాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ మోడల్ యూరప్‌ లో అందుబాటులోకి వచ్చింది.

ప్రత్యేక మార్పులతో అందుబాటులోకి..

ఇన్‌ స్టర్ లాంజ్‌ లో సాధారణ మోడల్‌ తో పోలిస్తే కొన్ని ప్రత్యేక మార్పులు కనిపిస్తాయి. ఇందులో జెన్యూన్ లెదర్ సీట్లు, ప్రీమియం స్పీకర్ సిస్టమ్, కొత్త అల్లిన హెడ్‌ లైనర్, సన్‌ వైజర్‌ లు లాంటి ఫీచర్లు అందించారు. అంతేకాకుండా, డార్క్ గ్రే,  మింట్ గ్రీన్ కలర్స్ కలయికలో ప్రత్యేకమైన ఇంటీరియర్ డిజైన్‌ ను రూపొందించారు. బయటి డిజైన్‌ లో కూడా కొన్ని మార్పులు చేశారు. కొత్త గ్లో మింట్ ఎక్స్‌ టీరియర్ కలర్‌ తో పాటు, కొత్త డిజైన్ కలిగిన 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ ను అందించారు. ఇప్పుడు ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు మరింత ఆకట్టుకుంటుంది.

Advertisement

హ్యుందాయ్ ఇప్పటికే ఇన్‌ స్టర్ క్రాస్ అనే మరో వెర్షన్‌ ను కూడా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఆ మోడల్ అడ్వెంచర్ లుక్, అవుట్‌ డోర్ వినియోగంపై దృష్టి సారిస్తే, కొత్త ఇన్‌ స్టర్ లాంజ్ మాత్రం సిటీ వినియోగదారులు, సౌకర్యాన్ని కోరుకునే కస్టమర్లకు అనుకూలంగా ఉండేలా రూపొందించింది.

సింగిల్ ఛార్జ్ తో 360 కి.మీ ప్రయాణం

ఈ కారులో రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి 42kWh బ్యాటరీ ప్యాక్ కాగా, మరొకటి 49kWh బ్యాటరీ ప్యాక్. చిన్న బ్యాటరీతో వచ్చే వేరియంట్ 71kW పవర్, 147Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. పెద్ద బ్యాటరీతో వచ్చే వెర్షన్ 85kW పవర్, 147Nm టార్క్‌ ను అందిస్తుంది. డ్రైవింగ్ రేంజ్ పరంగా కూడా ఈ కారు ఆకట్టుకుంటోంది. 42kWh బ్యాటరీతో కూడిన స్టాండర్డ్ రేంజ్ మోడల్ ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 303 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 49kWh ఎక్స్‌ టెండెడ్ రేంజ్ వెర్షన్ దాదాపు 360 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

ధర గురించి..

Advertisement

ధరల విషయానికి వస్తే, ప్రస్తుత ఇన్‌ స్టర్ మోడల్ ధర ఆస్ట్రేలియాలో సుమారు 39,000 డాలర్ల నుంచి ప్రారంభమవుతోంది. ఇన్‌స్టర్ క్రాస్ ధర 45,000 డాలర్ల వరకు ఉంది. కొత్త లాంజ్ వెర్షన్ ధర 50,000 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఈ ధరలతో ఇన్‌ స్టర్ చైనీస్ ఎలక్ట్రిక్ కార్లైన BYD అట్టో 1, MG4 లాంటి మోడళ్ల కంటే ఖరీదైన ఎంపికగా మారుతోంది. అయినప్పటికీ, ప్రీమియం ఫీచర్లు, ప్రత్యేక డిజైన్, అధునాతన ఇంటీరియర్ కారణంగా ఇన్‌ స్టర్ లాంజ్ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: మళ్లీ పెరిగిన మారుతి నెక్సా కార్ల ధరలు.. ఆ మోడళ్లపై ఏకంగా రూ.30 వేలు హైక్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×