E-Paper
Advertisement

New-Gen Hyundai i20: కొత్త హ్యుందాయ్ i20 లీక్.. క్రాసోవర్ లుక్‌ లో సూపరో సూపరు!

New-Gen Hyundai i20: కొత్త హ్యుందాయ్ i20 లీక్.. క్రాసోవర్ లుక్‌ లో సూపరో సూపరు!
Advertisement

New-Gen Hyundai i20 Leaked: హ్యుందాయ్‌ బ్రాండ్ కు సంబంధించిన పాపులర్ హ్యాచ్‌ బ్యాక్ i20 న్యూ జెనరేషన్ మోడల్‌ కు సంబంధించిన వివరాలు లాంచ్ కు ముందే లీక్ అయ్యాయి. ఫోర్త్ జెనరేషన్ i20 డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లకు సంబంధించిన ఫోటోలు ఆటో రంగంలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ కారును 2026 ఫిఫా ప్రపంచ కప్ సందర్భంగా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్త లుక్ లో ఆకట్టుకుంటున్న i20

ఈసారి i20 పూర్తిగా కొత్త లుక్ లో కనిపించింది. గత మోడళ్లలో కనిపించిన సంప్రదాయ హ్యాచ్‌ బ్యాక్ డిజైన్‌ కు భిన్నంగా, కొత్త మోడల్‌ లో క్రాసోవర్ తరహా స్టైలింగ్‌ ను హ్యుందాయ్ తీసుకువచ్చింది. ప్రస్తుతం ఎస్‌యూవీలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసినట్లు భావిస్తున్నారు. కారు ముందు భాగం మరింత ఎత్తుగా, స్ట్రాంగ్ గా  కనిపిస్తోంది.

Advertisement

ముందు, వెనుక భాగాల్లో కనెక్టెడ్ ఎల్ఈడీ లైట్ బార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముందువైపు Y షేప్  ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు ఉండగా, వెనుక భాగంలో C-ఆకారపు టెయిల్ ల్యాంప్ డిజైన్‌ ను ఉపయోగించారు. బంపర్లు, వీల్ ఆర్చ్‌ ల చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్‌ ను కూడా యాడ్ చేశారు. దీంతో కారు మరింత రగ్గడ్ లుక్‌ ను సంతరించుకుంది. ఇక సైడ్ ప్రొఫైల్‌ లో కూడా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. కొత్త డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. బాడీ లైన్లు గత మోడల్‌ తో పోలిస్తే మరింత సింపుల్‌ గా, క్లీన్ గా కనిపిస్తున్నాయి. సాధారణ డోర్ హ్యాండిల్స్‌ ను కొనసాగించారు.

ఇంటీరియర్ గురించి..

ఇంటీరియర్ విషయానికి వస్తే, కొత్త i20లో లేటెస్ట్ టెక్నాలజీకి పెద్దపీట వేశారు. డ్యాష్‌ బోర్డ్‌ పై రెండు పెద్ద స్క్రీన్లను కనెక్టెడ్ రూపంలో అందించే అవకాశం ఉంది. ఇవి సుమారు 12.3 అంగుళాల పరిమాణంలో ఉండొచ్చని సమాచారం. కొత్త స్టీరింగ్ వీల్, అప్‌ డేటెడ్ సెంటర్ కన్సోల్, ప్రీమియం డ్యూయల్ టోన్ కలర్ థీమ్ క్యాబిన్‌ ను మరింత ఆకట్టుకునేలా చేశారు. అయితే, పూర్తిగా టచ్ కంట్రోల్స్‌ పై ఆధారపడకుండా, హ్యుందాయ్ ఫిజికల్ బటన్లు, రోటరీ కంట్రోల్స్‌ ను కూడా అందించినట్లు తెలుస్తోంది. డ్రైవింగ్ సమయంలో ఫీచర్లను ఉపయోగించడం మరింత సులభంగా ఉంటుంది. క్యాబిన్‌ లో సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ వినియోగించడం ద్వారా ప్రీమియం ఫీలింగ్‌ను అందించే ప్రయత్నం చేసింది.

ఇంజిన్ గురించి..

Advertisement

ఇంజిన్ వివరాలను హ్యుందాయ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలను కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటు భవిష్యత్తులో హైబ్రిడ్ టెక్నాలజీకి అనుకూలంగా ఉండే కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.

భారత మార్కెట్ లోకి వస్తుందా?

ఈ కొత్త తరం i20 భారత మార్కెట్లోకి వస్తుందా? లేదా? అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం ఎస్‌యూవీలకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో హ్యాచ్‌ బ్యాక్ విభాగంలో అమ్మకాలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ భారత్ కోసం కొత్త క్రాసోవర్ మోడళ్లపై కూడా దృష్టి పెడుతోంది. అందువల్ల కొత్త i20 భారత మార్కెట్లోకి వస్తుందా? లేదా? అన్నది త్వరలో తెలియనుంది.

Read Also: పెట్రోల్ ఖర్చుకు చెక్.. మారుతి నుంచి 3 ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు వచ్చేస్తున్నాయ్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×