E-Paper
Advertisement

Hyundai Creta Electric Discount: హ్యుందాయ్ లవర్స్ కు గుడ్ న్యూస్, క్రెటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్!

Hyundai Creta Electric Discount:  హ్యుందాయ్ లవర్స్ కు గుడ్ న్యూస్, క్రెటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్!
Advertisement

భారతీయ మార్కెట్ లో హ్యుందాయ్ కార్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అన్ని వర్గాల వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా సరికొత్త మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే ఈ కంపెనీ కూడా ఈవీ రంగంలోకి అడుగు పెట్టింది. దేశీ మార్కెట్ లో చాలా బ్రాండ్ల మాదిరిగానే  హ్యుందాయ్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మంచి సత్తా చాటుతోంది. గత సంవత్సరం, కంపెనీ తన పాపులర్ SUV క్రెటాకు సంబంధించి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ICE విభాగంలో క్రెటా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా, EV కూడా మంచి అమ్మకాలు సాగిస్తోంది. మరిన్ని అమ్మకాలు కొనసాగించేలా హ్యుందాయ్ EV పై డిస్కౌంట్లను ప్రకటించింది.

క్రెటా ఎలక్ట్రిక్ SUV పై రూ. 1.25 లక్షల డిస్కౌంట్‌

హ్యుందాయ్ ఇప్పుడు క్రెటా ఎలక్ట్రిక్ SUV పై గరిష్టంగా రూ. 1.25 లక్షల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. ఇది బ్రాండ్ నేరుగా అందించే డిస్కౌంట్ కాదు. డీలర్‌ షిప్ రేంజ్ ఆఫర్. డిస్కౌంట్ మొత్తం ఒక డీలర్ నుంచి మరొక డీలర్‌కు మారే అవకాశం ఉంటుంది. అయితే, చాలా మంది డీలర్లు ఈవీపై రూ.75,000 నుంచి రూ.1.25 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ 2025లో తయారైన హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ SUVలకు మాత్రమే వర్తిస్తున్నట్లు తెలుస్తోంది.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ గురించి..

Advertisement

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ విషయాని వస్తే, ఇది ఫీచర్లు, డ్రైవింగ్ శ్రేణిలో మంచి బ్యాలెన్స్ అందించే నో నాన్సెన్స్ ఎలక్ట్రిక్ SUV. ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ప్రైమరీ వేరియంట్‌లకు 42 kWh బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. హై వేరియంట్‌లకు 51.4 kWh బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఇది ఎగ్జిక్యూటివ్, స్మార్ట్, స్మార్ట్ (O), ప్రీమియం, ఎక్సలెన్స్ వేరియంట్‌ లలో లభిస్తుంది. స్మార్ట్ (O), ఎక్సలెన్స్ వేరియంట్‌లకు పెద్ద బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. డిజైన్ పరంగా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ICE వెర్షన్‌ ను పోలి ఉంటుంది.

 ఈ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

క్రెటా EV-నిర్దిష్ట మార్పులను కలిగి ఉంటుంది. ఇవి క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, గ్రిల్‌పై హ్యుందాయ్ లోగో, వెనుక ఉంచబడిన ఛార్జింగ్ పోర్ట్, కారు వేగాన్ని బట్టి బ్యాటరీ ఉష్ణోగ్రతను మెయింటెయిన్ చేయడానికి ఓపెన్, క్లోజ్ ఏరో ఫ్లాప్‌లు ఉన్నాయి. LED హెడ్‌లైట్లు, ముందు భాగంలో కనెక్ట్ చేయబడిన LED DRLలను కలిగి ఉంది. ఇది ముందు భాగంలో కనిపించే అదే పిక్సలేటెడ్ డిజైన్‌ తో వెనుక బంపర్‌ను కూడా కలిగి ఉంటుంది.  లోపలి భాగంలో, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్టీరింగ్ వీల్ వెనుక షిఫ్ట్ బై వైర్ డ్రైవ్ సెలెక్టర్‌ తో కూడిన ప్రీమియం క్యాబిన్ ఉంటుంది. న్యూ త్రీ స్పోక్ హ్యుందాయ్ స్టీరింగ్ వీల్, డాష్‌ బోర్డ్‌ లో కర్విలినియర్ ట్విన్ 10.25-అంగుళాల డిస్ప్లే సెటప్ ఉంటుంది. ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, డ్రైవ్ మోడ్ ఎంపిక కోసం రోటరీ నాబ్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌ రూఫ్, సీట్ అప్హోల్స్టరీని కలిగి ఉంటుంది. ఇది డ్రైవర్ కోసం మెమరీ ఫంక్షన్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 8 స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, డిజిటల్ NFC-ఆధారిత కీ,  లెవల్ 2 ADAS, TPMS,  8-వే అడ్జస్టబుల్ పవర్డ్ ఫ్రంట్ సీట్లను కలిగి ఉంటుంది.

ఎంత రేంజ్ అందిస్తుందంటే?

Advertisement

42 kWh బ్యాటరీతో కూడిన హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ 135 PSని ఉత్పత్తి చేస్తుంది. ఒక్క ఛార్జ్ తో 390 కి.మీ డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. పెద్ద 51.4 kWh వేరియంట్ 171 PSని ఉత్పత్తి చేస్తుంది. 473 కి.మీ క్లెయిమ్ అందిస్తుంది.  హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ధరలు రూ. 18.02 లక్షల నుంచి రూ. 24.70 లక్షల వరకు ఉన్నాయి.

Read Also: కారు కొనాలనుకునే వారికి ఆ మూడు రోజులు బెస్ట్, ఊహించని డిస్కౌంట్లు పొందవచ్చు!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×