E-Paper
Advertisement

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!
Advertisement

Hyundai Boulder SUV Patent: భారత మార్కెట్‌ లో ఆఫ్ రోడ్ ఎస్‌యూవీలకు మంచి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో  హ్యుందాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. బౌల్డర్ ఆఫ్ రోడ్ SUV ప్రొడక్షన్ వెర్షన్‌ కు సంబంధించిన డిజైన్‌ కు తాజాగా భారత్ లో పేటెంట్ తీసుకుంది. ఈ మోడల్ 2026 న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో ప్రదర్శించిన బౌల్డర్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ SUV భారత మార్కెట్‌ లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాన్సెప్ట్‌ కు దగ్గరగా డిజైన్

పేటెంట్ ఫోటోలను చూస్తే, బౌల్డర్ ప్రొడక్షన్ మోడల్ కాన్సెప్ట్‌ ను చాలా వరకు పోలి ఉంది. బాక్సీ డిజైన్, ఎత్తైన బాడీ, భారీ ఆఫ్ రోడ్ టైర్లు, వెడల్పాటి వీల్ ఆర్చ్‌ లు, బలమైన క్లాడింగ్ లాంటి అంశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ SUVని ఆఫ్ రోడింగ్ కోసం రూపొందించబడినట్లు స్పష్టమవుతోంది. అయితే, ముందు భాగంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. కాన్సెప్ట్‌ లో ఉన్న పెద్ద హెడ్‌ ల్యాంప్‌ ల స్థానంలో చిన్న స్క్వైర్ షేప్ LED లైట్లు ఇచ్చారు. వాటి పక్కన నిలువుగా LED లైట్ స్ట్రిప్‌లు అమర్చారు.  కాన్సెప్ట్‌ లో కనిపించిన గ్రిల్ స్థానంలో మరింత క్లీన్ క్లోజ్డ్ గ్రిల్ డిజైన్‌ను ఉపయోగించారు. బంపర్ కూడా కొత్తగా రూపొందించారు. దిగువ భాగంలో బలమైన స్కిడ్ ప్లేట్ ఉండటం వల్ల గుంతల రోడ్లపై ప్రయాణానికి ఇది మరింత అనుకూలంగా కనిపిస్తోంది.

ఇంటీరియర్ ఎలా ఉండొచ్చు?

Advertisement

ఇంటీరియర్ వివరాలను పేటెంట్‌ లో వెల్లడించలేదు. అయితే, కాన్సెప్ట్ ఆధారంగా చూస్తే ఇందులో అత్యాధునిక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. డాష్‌ బోర్డ్ మధ్యలో నాలుగు రోటరీ నాబ్‌ లు ఉంటాయి. వీటి ద్వారా 4WD వ్యవస్థ, ఆఫ్ రోడ్ మోడ్‌ లను నియంత్రించవచ్చు. వాటి మధ్య ఇంక్లినోమీటర్ కూడా ఉండే అవకాశం ఉంది. పైభాగంలో నాలుగు డిస్‌ ప్లేలు, వెడల్పైన హెడ్ అప్ డిస్‌ ప్లే, పెద్ద స్టోరేజ్ కంపార్ట్‌ మెంట్లు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ లాంటి ఫీచర్లు కాన్సెప్ట్‌ లో కనిపించాయి. వీటిలో చాలా వరకు ప్రొడక్షన్ మోడల్‌ లో కూడా వచ్చే అవకాశముంది.

భారత్‌లోకి ఎంట్రీ ఎప్పుడు?

హ్యుందాయ్ 2030 నాటికి భారత మార్కెట్‌ లో ప్రత్యేకమైన ఆఫ్ రోడ్ SUVను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు బౌల్డర్ డిజైన్‌కు పేటెంట్ రావడంతో, ఇదే మోడల్ భారత మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశాలు బలపడుతున్నాయి. దేశంలో ఆఫ్ రోడ్ SUVలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హ్యుందాయ్ బౌల్డర్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. బలమైన డిజైన్, అడ్వెంచర్‌ కు అనువైన ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో ఈ SUV మార్కెట్లోకి వస్తే, మహీంద్రా థార్, మారుతి జిమ్నీ లాంటి మోడళ్లకు గట్టి సవాల్ విసిరే అవకాశం ఉందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

Read Also: టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×