E-Paper
Advertisement

Mini Cooper Car: కష్టపడ్డ.. రూ. 65 లక్షల కూపర్ కొన్న.. వైరల్ అవుతున్న టెక్కీ ఇన్ స్టా పోస్ట్!

Mini Cooper Car: కష్టపడ్డ..  రూ. 65 లక్షల కూపర్ కొన్న.. వైరల్ అవుతున్న టెక్కీ ఇన్ స్టా పోస్ట్!
Advertisement

ప్రతి ఒక్కరికీ ఉన్నతమైన గోల్ ఉండాలి. ఆ గోల్ సాధించేందుకు నిరంతరం కష్టపడాలి. ఏదో ఒకరోజు ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. అప్పుడు తమ ఆనందానికి అవధులు ఉండవు. తాజాగా ఓ లేడీ టెక్కీ కూడా  సంవత్సరాల క్రితం కన్న కల తాజాగా నెరవేరడంతో.. సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. శుభాకాంక్షలు చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఆమె ఏం సాధించిందంటే..

కలల కారును కొనుగోలు చేసిన నిహారికా నాయక్

హైదరాబాద్ కు చెందిన నిహారికా నాయక్ తాజాగా తన కలల కారు మినీ కూపర్ ను కొనుగోలు చేసింది. ఈ కారుకు కొనేందుకు తాను ఎంతో కష్టపడ్డానని, ఈ కారు కొనేందుకు 5 నుంచి 9 టెక్ సంస్థల్లో పని చేసినట్లు వెల్లడించింది. తనకు ఉద్యోగం అందించిన ప్రతి సంస్థకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన కలల కారు తాజాగా డెలివరీ అయ్యిందంటూ ఇన్ స్టాలో ఫోటోలు షేర్ చేసింది.

మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నిహారిక

Advertisement

నిహారిక ప్రస్తుతం హైదరాబాద్‌ లోని ఓ మిడ్ సైజ్ టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థలో క్వాలిటీ అషురెన్స్ చీఫ్ గా పని చేస్తుంది. తన భర్త, కొడుకుతో కలిసి హైదరాబాద్ లోని నివసిస్తుంది. 39 ఏళ్ల వయసున్న నిహారిక సొంతూరు మధ్యప్రదేశ్‌లోని జబల్‌ పూర్‌. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది. 2008లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా పొందింది. ఆ తర్వాత టెక్ సంస్థల్లో పని చేసింది. 16 సంవత్సరాలుగా ఐటీ సెక్టార్ లో పని చేస్తుంది. చిన్న చిన్న జీతాలకు పని చేసిన నిహారిక.. నెమ్మదిగా పెద్ద పొజిషన్ కు చేరుకుంది.

Advertisement

గత ఆరు సంవత్సరాలుగా, నిహారిక ఒక టెక్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేస్తోంది. సంవత్సరానికి రూ.45 లక్షలకు పైగా సంపాదిస్తుంది. ఆమె భర్త కూడా ఐటీ రంగంలోనే పని చేస్తున్నాడు. అతడు కూడా అదే స్థాయిలో సంపాదిస్తున్నాయి. అయితే, నిహారికకు ఎప్పటికైనా కూపర్ కారు కొనాలని భావించేది. హైదరాబాద్ లో మినీ కూపర్ ఎస్ రకం ఆన్ రోడ్ ధర రూ. 65 లక్షలు. ఆమె బ్యాంక్ లోన్ తీసుకుని కారు కొనుగోలు చేసింది. ఐదు సంవత్సరాల పాటు, ఆమె నెలకు దాదాపు రూ.85,000 – రూ. 90,000 ఈఎంఐ చెల్లించాలి. తన కలల కారు కొనుగోలు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని నిహారిక చెప్పుకొచ్చింది.  ప్రతి రోజై తన కొడుకును స్కూల్ కు తీసుకెళ్లడంతో పాటు ఆఫీస్ కు వెళ్లేందుకు ఈ కారునే ఉపయోగిస్తున్నట్లు చెప్పింది.

Read Also: మహీంద్రా To టాటా, దేశంలో అత్యంత సురక్షితమైన కార్లు ఇవే!

నెటిజన్లు ఏమంటున్నారంటే?

ఆమె ఇన్ స్టాలో పెట్టిన పోస్టు బాగా వైరల్ అయింది. నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఎన్నో ఏళ్ల కల నెరవేర్చుకోవడం నిజంగా అద్భుతం అంటున్నారు. బలమైన కోరిక ఉండటమే కాదు, వాటిని నెరవేర్చుకున్నప్పుడే అసలు సంతోషం ఉంటుందంటున్నారు.

Read Also: మారుతి సుజుకి ఈ-విటారా వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×