// // Hybrid Car Battery: హైబ్రిడ్ కారు బ్యాటరీ ఫెయిల్ అయితే? వామ్మో ఇన్ని సమస్యలు వస్తాయా? - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Hybrid Car Battery: హైబ్రిడ్ కారు బ్యాటరీ ఫెయిల్ అయితే? వామ్మో ఇన్ని సమస్యలు వస్తాయా?

Hybrid Car Battery: హైబ్రిడ్ కారు బ్యాటరీ ఫెయిల్ అయితే? వామ్మో ఇన్ని సమస్యలు వస్తాయా?
Advertisement

Hybrid Car Battery Issues: చాలా మంది ఫ్యూయెల్ సేవింగ్, స్మూత్ డ్రైవింగ్, లో పొల్యూష్ కోసం హైబ్రిడ్ కార్లను కొనుగోలు చేస్తారు. ఈ కార్లలో అత్యంత ముఖ్యమైన పార్ట్ హైబ్రిడ్ బ్యాటరీ. అనుకోని పరిస్థితులలో ఈ బ్యాటరీ బలహీనపడితే లేదంటే పూర్తిగా పాడైపోతే కారు ఇంజిన్ వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

హైబ్రిడ్ కారులో బ్యాటరీ ఫెయిల్ అయితే?

హైబ్రిడ్ కారులో పెట్రోల్ ఇంజిన్‌ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా పని చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌ కు పవర్ ఇచ్చేది హై వోల్టేజ్ బ్యాటరీ. ఇది కారు నెమ్మదిగా నడిచేటప్పుడు, ట్రాఫిక్‌ లో లేదంటే స్టార్ట్ అయ్యే సమయంలో ఇంజిన్‌ పై ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే హైబ్రిడ్ కార్లు మంచి మైలేజ్ ఇస్తాయి. కానీ, ఈ బ్యాటరీ పాడవ్వడం మొదలైతే, పెట్రోల్ ఇంజిన్ ఎక్కువగా పని చేస్తుంది. సాధారణంగా నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ మోడ్‌ లో వెళ్లే కారు, పూర్తిగా ఇంజిన్‌ పై ఆధారపడుతుంది. దీంతో ఇంధనం వినియోగం పెరుగుతుంది. కారు సౌండ్ కూడా కూడా ఎక్కువగా వస్తుంది.

Advertisement

అటు కారు పర్ఫార్మెన్స్  కూడా తగ్గింపోతుంది. ఎలక్ట్రిక్ మోటార్ ఇచ్చే సడెన్ టార్క్ లేకపోవడం వల్ల కారు నెమ్మదిగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఓవర్‌ టేక్ చేయడం కష్టంగా మారుతుంది. ఘాట్ రోడ్లలో డ్రైవింగ్ మరింత ఇబ్బందికరంగా మారుతుంది. డాష్‌ బోర్డ్‌ లో వార్నింగ్స్ కూడా కనిపిస్తాయి. హైబ్రిడ్ సిస్టమ్ ను చెక్ చేయాలనే మిసేజ్ లు డిస్ ప్లే అవుతాయి. బ్యాటరీ, సిస్టమ్‌ లో ప్రాబ్లమ్ ఉన్నట్లు సూచిస్తాయి. కొన్ని సందర్భాల్లో బ్యాటరీ పూర్తిగా డెడ్ అయితే కారు స్టార్ట్ కాదు.

మైలేజ్ పడిపోయే అవకాశం!

హైబ్రిడ్ కారులో  బ్యాటరీ పాడైతే మైలేజ్ చాలా వరకు పడిపోతుంది. సుమారు 20% నుంచి 40% వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ మోడ్ పని చేయదు, కాబట్టి చిన్న ప్రయాణాలకు కూడా ఇంజిన్ ఫ్యూయెల్ ను ఉపయోగిస్తుంది. అదే సమయంలో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా పని చేయదు. సాధారణంగా బ్రేక్ వేయగానే ఉత్పత్తి అయ్యే శక్తి బ్యాటరీలో నిల్వ అవుతుంది. కానీ, బ్యాటరీ డ్యామేజ్ అయితే ఆ పవర్ వేస్ట్ అవుతుంది. ఇంధన సామర్థ్యం ఇంకా తగ్గుతుంది.

కారు పూర్తిగా ఆగిపోతుందా?

Advertisement

బ్యాటరీ ఫెయిల్ అయితే, కారు ఆగిపోతుందా? అనేది మోడల్‌ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని కార్లు  లింప్ మోడ్ లోకి వెళ్లి కేవలం ఇంజిన్‌ తోనే నడుస్తాయి. కానీ, పనితీరు బలహీనంగా ఉంటుంది. మరికొన్ని కార్లు స్టార్ట్ కాకపోవచ్చు.  ఇంకో విషయం ఏంటంటే.. హైబ్రిడ్ కారులో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఒకటి పెద్ద హై వోల్టేజ్ బ్యాటరీ, మరొకటి చిన్న 12V బ్యాటరీ. 12V బ్యాటరీ పాడైతే సులభంగా మార్చవచ్చు. కానీ హైబ్రిడ్ బ్యాటరీ సమస్య అయితే ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకే తరచుగా బ్యాటరీని గమనిస్తూ ఉండాలి.

Read Also: సమ్మర్‌ లో కారు ఓవర్‌ హీట్ అవుతోందా? సింఫుల్ గా ఈ టిప్స్ ఫాలోకండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×